విశాఖ గ్యాస్ లీకేజీపై మోదీ దిగ్భ్రాంతి... కేసీఆర్, కేటీఆర్ ఏమన్నారంటే..?
07-05-202007-05-2020 12:39:49 IST
Updated On 07-05-2020 13:06:16 ISTUpdated On 07-05-20202020-05-07T07:09:49.452Z07-05-2020 2020-05-07T06:42:03.020Z - 2020-05-07T07:36:16.075Z - 07-05-2020

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ లో విషపూరిత గ్యాస్ లీక్ కావడంపై ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హోంశాఖ అధికారులతో ప్రధాని మోదీ ఆరా తీశారు. ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మాట్లాడారు ప్రధాని మోదీ. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సాయం అందిస్తామన్నారు మోదీ.. మరోవైపు తెలంగాణ సీఎం కేసీయార్, మంత్రి కేటీయార్ స్పందించారు. ఈ ఏడాది భయంకర ఘటనలు చూడాల్సి వస్తోందని, విశాఖ గ్యాస్ లీక్ ఘటన వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యామన్నారు కేసీయార్, కేటీయార్. గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరం అని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామని చెప్పారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకుని విస్మయానికి గురయ్యానని చెప్పారు. ఈ ఏడాది చాలా భయంకర ఘటనలు చూడాల్సి వస్తోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదానికి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. లాక్డౌన్లోనూ పరిశ్రమలో ప్రతిరోజు మెయింటెనెన్స్ చేయాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. లాక్డౌన్ ఉన్నకారణంగా మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం పాస్లు కూడా ఇచ్చింది. 45 మందికి మెయింటెనెన్స్ పాస్లు ఇచ్చినప్పటికీ.. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పరిశ్రమ ట్యాంకుల్లో దాదాపు 2 వేల మెట్రిక్ టన్నుల స్టైరెన్ను నిల్వ చేసింది. అక్కడ 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉంచడంలో ఫ్యాక్టరీ యాజమాన్యం విఫలమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో.. స్టైరెన్ లీక్ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలకు స్టైరెన్ గ్యాస్ వేగంగా వ్యాప్తి చెందింది. కాగా, గురువారం తెల్లవారుజామన చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, దాదాపు 200 మంది అస్వస్థతకు లోనయ్యారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
13 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
10 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
12 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
16 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
19 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
20 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా