newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

వివాదాల్లో ఆర్టికల్ 15 మూవీ

01-07-201901-07-2019 07:55:23 IST
2019-07-01T02:25:23.373Z01-07-2019 2019-07-01T02:19:18.467Z - - 26-08-2019

వివాదాల్లో ఆర్టికల్ 15 మూవీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆయుష్మాన్ ఖురానా లేటెస్ట్ మూవీ ఆర్టిక‌ల్ 15 ఇబ్బందుల్లో ప‌డింది. య‌దార్థ ఘ‌ట‌న‌ల‌తో చిత్రీక‌రించామ‌ని చెబుతున్న ఈ సినిమాలో కొన్ని స‌న్నివేశాలు త‌మ‌ను కించ ప‌రిచేలా ఉన్నాయంటూ బ్రాహ్మ‌ణ సంఘాలు మండిప‌డుతున్నాయి.

ఓ ద‌ళిత కుటుంబానికి బ్రాహ్మ‌ణ వ‌ర్గం అన్యాయం చేసింద‌నే స‌న్నివేశం, వాస్త‌వానికి విరుద్ధంగా ఉంద‌ని ఆరోపిస్తున్నారు. బీసీ వ‌ర్గం చేతిలో ఆ ద‌ళిత కుటుంబానికి అన్యాయం జ‌రిగింద‌ని పోలీసులు కూడా చెబుతుంటే, బ్రాహ్మ‌ణుల మీద బుర‌ద చ‌ల్ల‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. 

ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఆర్టిక‌ల్ 15 ప్ర‌ద‌ర్శిస్తున్న థియేట‌ర్ల ముందు ఆందోళ‌న‌కు దిగుతున్నారు. అఖిల భార‌తీయ‌ బ్రాహ్మ‌ణ ఏక్తా ప‌రిష‌త్, స‌ర్వ బ్రాహ్మ‌ణ మ‌హాస‌భ‌, ప‌రుశురాం స‌ర్వ క‌ల్యాణ్ అండ్ బ్రాహ్మిణ్ మ‌హాస‌భ తదిత‌ర సంఘాలు ఆర్టిక‌ల్ 15 సినిమాల‌ను నిషేధించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

ఇక యూపీలో ఇప్ప‌టికే ప‌లు థియేట‌ర్ల య‌జ‌మానులు బ్రాహ్మ‌ణ సంఘాల బెదిరింపుల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆపేశార‌ట‌. ఇక ఆర్టిక‌ల్ 15 ద‌ర్శ‌కుడు అనుభ‌వ్ సిన్హా మీద దాడులు త‌ప్ప‌వంటూ ప‌రుశురాం సేన వార్నింగ్ ఇస్తోంది. 

వీరికి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు క‌ర్ణిసేన ప్ర‌క‌టించింది. మ‌రోవైపు త‌న సినిమాలో ఏ ఒక్క వ‌ర్గాన్నీ విమ‌ర్శించ‌లేద‌ని చెబుతున్నారు ఆర్టిక‌ల్15 ద‌ర్శ‌కుడు అనుభ‌వ్ సిన్హా. బ్రాహ్మ‌ణుల‌ను విల‌న్లుగా చూపించాల్సిన అవ‌స‌రం, ఉద్దేశం త‌న‌కు ఏమాత్రం లేద‌ని చెబుతున్నారు.

ఈ సినిమా నిర్మాణంలో చాలా మంది బ్రాహ్మ‌ణులు ప‌నిచేశార‌నీ. ఇబ్బందిక‌ర స‌న్నివేశాలు ఉంటే వారే అడ్డుకునే వార‌నీ అంటున్నారు. అంతేకాదు, సెన్సార్ బోర్డ్ ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్ త‌ర్వాతే సినిమా రిలీజ్ చేశామ‌న్న విష‌యం గుర్తుంచుకోవాలంటున్నారు సిన్హా.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle