వివాదంలో ‘లగే రహో కేజ్రీవాల్’ .. భారీ దావా
13-01-202013-01-2020 08:58:00 IST
Updated On 13-01-2020 11:00:42 ISTUpdated On 13-01-20202020-01-13T03:28:00.924Z13-01-2020 2020-01-13T03:27:50.171Z - 2020-01-13T05:30:42.678Z - 13-01-2020

దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి ఫోకస్ ఢిల్లీపైనే వుంది. తాజాగా ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇటు కేజ్రీవాల్-అటు బీజేపీ నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. వీరిమధ్య మాటల తూటాలు పేలుతూనే వున్నాయి. ఆమ్ఆద్మీ ప్రచారంలో తనదైన రీతిలో ముందుకు సాగుతోంది. ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలే అన్నీతానై ప్రచారం నిర్వహిస్తున్నారు. ఢిల్లీ సీఎంగా గడిచిన ఐదేళ్ల కాలంలో అమలు చేసిన ప్రజాసంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఓటర్లను చేరుకునేందుకు సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్‌పై విడుదల చేసిన ప్రచార గీతం వైరల్ అవుతోంది. ‘లగే రహో కేజ్రీవాల్’ అంటూ సాగే ఈ ప్రచారం గీతం ఢిల్లీ ప్రజలను విశేషంగా అకట్టుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించిన ఢిల్లీ బీజేపీ చీఫ్, ఎంపీ మనోజ్ తివారీ సీఎం కేజ్రీవాల్ ను టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా ఆప్ ఇటీవల విడుదల చేసిన ‘లగే రహో కేజ్రీవాల్’ అనే ప్రచారం గీతంపై కామెంట్లు చేశారు. ఈ పాట తన బోజ్‌పురి సంగీత అల్బమ్కు చెందిన ఎడిటెడ్ వెర్షన్ అని, తన పాటను కాపీ చేసే హక్కు ఆప్ సర్కార్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.దీనిపై తాను న్యాయపోరాటానికి దిగుతానని, తన మేధో సంపత్తి హక్కులు ఉపయోగించుకున్నందుకు రూ.500 కోట్ల పరువునష్టం దావా వేసినట్లు మనోజ్ తివారీ ప్రకటించారు. అలాగే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశానని అన్నారు. ఈ మేరకు ఆయనకు నోటీసులు పంపామన్నారు. అబద్దాలను ప్రచారం చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. ఈసారి బీజేపీ విజయం ఖాయమంటున్నారు మనోజ్ తివారీ. .

ఏపీలో స్కూల్స్ బంద్
12 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
11 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
16 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
17 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
13 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
20 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
20 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
12 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
14 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
20 hours ago
ఇంకా