విభజన రాజకీయాలు మావద్ద పనిచేయవు.. దీదీ కౌంటర్
02-10-201902-10-2019 06:49:13 IST
2019-10-02T01:19:13.895Z02-10-2019 2019-10-02T01:19:05.776Z - - 11-04-2021

బెంగాల్ ప్రజలను జాతీయ పౌర రిజిస్టర్ విషయంలో పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కేంద్రం హోమంత్రి అమిత్ షా ఆరోపించిన కొద్ది సేపట్లోనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. విభజన రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ బెంగాలీలను హెచ్చరిస్తూనే అలాంటి తన రాష్ట్రంలో పనిచేయవు గాక చేయవంటూ కొట్టిపడేశారు. అమిత్ షా పేరు కూడా ప్రస్తావించని తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమత పశ్చిమబెంగాల్లో విభిన్న మత విశ్వాసాలున్న ప్రజలు తమతమ మతాచారాలను పాటిస్తూనే రాష్ట్రంలో అతి పెద్ద పండుగ అయిన దుర్గా పూజను సంబరంగా జరుపుకుంటారని, ఇదే ప్రజల విభిన్న విస్వాసాలను ఏకం చేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరినీ మా రాష్ట్రానికి స్వాగతిస్తున్నాం. మా ప్రజల ఆతిథ్యాన్ని ఆస్వాదించాలని కూడా కోరుతాం. కానీ దయచేసి ఎలాంటి విభజన రాజకీయాలనూ ఇక్కడికి తీసుకురావద్దు. బెంగాల్లో అవి పనిచేయవు. విభజన రాజకీయాల కోసం మతాన్ని వాడుకోవద్దు. ప్రజల మధ్య ఘర్షణలను సృష్చించవద్దు. విభిన్ని విశ్వాసాల నేతలను తరాలుగా గౌరవించడంలో బెంగాల్ పేరు గాంచింది. ఈ సంప్రదాయాన్ని ఎన్నటికీ విచ్చిన్నపర్చవద్దు అని మమత సూచించారు. అంతకు ముందు కలకత్తాలో ఎన్నార్సీ జాగరణ్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. హిందువులు, బౌద్ధులు, జైనులకు సంబంధించిన శరణార్థులు ఎవ్వరూ దేశంనుంచి వెళ్లిపోవలసిన పనిలేదు. వారందరికీ భారతీయ పౌరసత్వం వస్తుంది. భారత జాతీయులుగా వారు అన్ని హక్కులను అనుభవించవచ్చు. పార్లమెంటులో పౌరసత్వ బిల్లు ఆమోదం పొందగానే ఇవన్నీ సాధ్యమవుతాయి కానీ చొరబాటుదారులను మాత్రం దేశం నుంచి పంపేస్తామని అమిత్ షా పేర్కొన్నారు. ఓట్ల కోసం చొరబాటుదారుల పట్ల మమతా సానుభూతితో ఉంటున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అదేసమయంలో టీఎమ్సీ తనవంతుగా బేజేపీ మతపర ప్రాతిపదికన ఓటర్లను విభజిస్తోందని పేర్కొంది. అదేసమయంలో బెంగాల్లో జాతీయ పౌర రిజిష్టర్ అవసరం లేదని మమత చెబుతూ వస్తున్నారు. గత నెలలో ఢిల్లీలో అమిత్ షాతో జరిపిన భేటీలో ఆమె అస్సాంలో జాతీయ పౌర రిజిస్టర్ సమస్య గురించి ప్రస్తావించారు. పౌరసత్వం పేరుతో ఏ భారతీయుడు కూడా ఇక్కట్ల పాలు కాకూడదని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పశ్ఛిమబెంగాల్లో అధికార పీఠం ఎవరిదని తేల్చుకునే తండ్లాట టీఎంసీ, బేజీపీ మధ్య ఇప్పటినుంచే మొదలేైంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
13 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
10 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
12 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
16 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
19 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
20 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా