newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విప‌క్షాలు మోడీ ఉచ్చులో పడ్డాయా?

09-05-201909-05-2019 07:45:41 IST
Updated On 01-07-2019 12:23:13 ISTUpdated On 01-07-20192019-05-09T02:15:41.505Z09-05-2019 2019-05-09T02:14:53.509Z - 2019-07-01T06:53:13.023Z - 01-07-2019

 విప‌క్షాలు మోడీ ఉచ్చులో పడ్డాయా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

విప‌క్షాల‌ను ముగ్గులోకి లాగి ప‌ని చ‌క్క‌బెట్టుకోవ‌డంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని మించిన వారు లేరంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ చెబుతున్నారు. జార్ఘండ్ స‌భ‌లో ఒక్క‌సారిగా బోఫోర్స్ వివాదాన్ని తెర మీద‌కు తెచ్చిన‌ మోడీ, కాంగ్రెస్ పార్టీని ఉచ్చులోకి లాగార‌ట‌. ద‌మ్ముంటే బోఫోర్స్ కుంభ‌కోణం మీద చ‌ర్చ‌కు రావాల‌ని కాంగ్రెస్ నేత‌ల‌కు స‌వాల్ విసిరారు మోడీ. 

పంజాబ్, ఢిల్లీ, భోపాల్ ఎన్నిక‌ల్లో మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ పేరుతో జ‌నాన్ని ఓట్లు అడిగి చూడాల‌ని కూడా అన్నారు. అంతేకాదు, అవినీతిప‌రుడిగా రాజీవ్ గాంధీ రాజ‌కీయ జీవితం ముగిసింద‌ని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ నేత‌ల‌తో పాటు రాహుల్, ప్రియాంక వాద్రాలు, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌త త‌దిత‌రులు రెచ్చిపోయారు. మోడీ మీద పోటీ ప‌డి విమ‌ర్శ‌లు చేశారు. 

ఇక కాంగ్రెస్ పార్టీ హైక‌మాండ్ కూడా మోడీ మీద రెచ్చిపోండ‌ని త‌మ నేత‌ల‌కు పిలుపు ఇచ్చింది. ఈ ఎన్నిక‌ల్లో త‌మ‌కు ట్రంప్ కార్డ్ దొరికింద‌ని కాంగ్రెస్ నేత‌లు ప్ర‌తిచోటా బోఫోర్స్ కుంభ‌కోణంలో రాజీవ్ గాంధీ ప్ర‌మేయం లేదంటూ ప్ర‌చారం ఊద‌ర‌గొట్టారు. కానీ తాము మోడీ రాజకీయ‌ ఉచ్చులో ప‌డ్డామ‌ని ఆల‌స్యంగా తెల్సుకున్నారు కాంగ్రెస్ పార్టీ నేత‌లు. 

ఎందుకంటే  1989 ఎన్నిక‌ల్లో బోఫోర్స్ కుంభ‌కోణంతో రాజీవ్ గాంధీ అధికారం కోల్పోయారు. ఆ త‌ర్వాత 1999లో రాజీవ్ గాంధీ మీద ఈ కేసులో చార్జిషీటు దాఖ‌లైంది. కొన్నాళ్ల విచార‌ణ త‌ర్వాత రాజీవ్ గాంధీకి క్లీన్ చీట్ ల‌భించింది. అయితే ఈ కేసు విచార‌ణ చేసిన‌, స్వీడ‌న్ పోలీస్ అధికారి చేసిన కామెంట్, బోఫోర్స్ కుంభ‌కోణంలో రాజీవ్ గాంధీ ప్ర‌మేయాన్ని నిర్థారించేలా ఉంద‌ని రాజకీయ విశ్లేష‌కులు తెలిపారు. 

ఎందుకంటే, బోఫోర్స్ అంశంలో కొంద‌రు దోషుల‌ను రాజీవ్ గాంధీ ఉద్దేశ‌పూర్వకంగానే కాపాడార‌న్న స్వీడ‌న్ పోలీస్ అధికారి స్టెన్ లిండ్ స్టాం వ్యాఖ్య‌ను కొట్టిపారేయ‌లేమ‌ని చెబుతున్నారు. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మార‌డం ఖాయం. అంతేకాదు, ర‌ఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్య‌వ‌హ‌రంలో మోడీ దొంగ అంటూ రాహుల్ గాంధీ తెగ ప్ర‌చారం చేశారు. కానీ బోఫోర్స్, ర‌ఫెల్ కేసుల్లో ఉన్న తేడాను రాహుల్ గాంధీ తెల్సుకోలేక పోయార‌ట‌. బోఫోర్స్ కేసులో లంచం ఇచ్చిన‌ట్లు రుజువులు ఉన్నాయి. కానీ ర‌ఫెల్ వ్య‌వ‌హారంలో అది లేదు. 

మ‌రో విష‌యం ఏంటంటే, చౌకీదార్ చోర్ హై అన్న రాహుల్ గాంధీ, ఆయ‌న చెప్పిన‌ట్లు ర‌ఫెల్ కొనుగోలు వ్య‌వ‌హారంలో అంబానీ  లాభ‌ప‌డిన‌ట్లు ఆరోపిస్తున్నారు. కానీ మోడీని తిడుతున్న రాహుల్, ల‌బ్ది పొందిన‌ట్లుగా ఆయ‌న చెబుతున్న అంబానీ మీద నోరు మెద‌ప‌డం లేదు. అంటే, రాహుల్ ఆరోప‌ణ‌లు రాజ‌కీయ ఉద్దేశంతోనే చేసిన‌వని అర్థం అవుతోంద‌ని రాజ‌కీయ పండితులు చెబుతున్నమాట‌. చివ‌రాఖ‌రికి మోడీ ఎత్తుగ‌డ‌ను అర్థం చేసుకున్న కాంగ్రెస్ నేత‌లు, ఇప్పుడు నోరు మెద‌పడం లేదట‌. మొత్తానికి మోడీ త‌న రాజ‌కీయ చాణక్యం మ‌రోసారి చూపించార‌ని అర్థం అవుతోంది.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle