newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విపక్షం కాదంటున్నా.. సభ ముందుకి పౌరసత్వ సవరణ బిల్లు

09-12-201909-12-2019 08:40:42 IST
2019-12-09T03:10:42.315Z09-12-2019 2019-12-09T03:09:53.931Z - - 23-04-2021

విపక్షం కాదంటున్నా.. సభ ముందుకి పౌరసత్వ సవరణ బిల్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో విపక్షాలు మండిపడుతున్నాయి. అయినా మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నపౌరసత్వ సవరణ బిల్లు ఇవాళ పార్లమెంట్ ముందుకు రానుంది. లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెడతారు. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్‌లో పౌరసత్వ సవరణ బిల్లును లిస్ట్ చేసింది మోదీ ప్రభుత్వం. 

బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కు వలసొచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు వీలుగా ఈ సవరణ బిల్లు తెచ్చింది కేంద్రం. 1955 పౌరసత్వ బిల్లుకు సవరణలు చేసింది ప్రభుత్వం. ఈ సవరణలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ముస్లిం దేశాల నుంచి మతఘర్షణల కారణంగా వలసొచ్చిన హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు ఈ బిల్లు ద్వారా లబ్ధి చేకూరనుంది.

అయితే మతప్రాతిపదిక పౌరసత్వంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.  కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, సీపీఎం దీనిపై మండిపడుతున్నాయి. ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయించారు. 

ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉందని, లౌకిక దేశమయిన భారతదేశంలో  మతం ప్రాతిపదికన పౌరసత్వం ఎలా ఇస్తారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా తీవ్రంగా విమర్శించారు. దేశంలోకి వచ్చిన ప్రతి శరణార్ధికి పౌరసత్వం ఇవ్వాలన్నారు. ఆర్థిక మాంద్యం, ప్రభుత్వ అసమర్థతల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే పౌరసత్వ సవరణ బిల్లు తెరమీదకు తెచ్చారని ఆమె మండిపడుతున్నారు.

ఇదిలా ఉంటే ఈశాన్య రాష్ట్రాలలో అధికసంఖ్యలో ప్రజలు, ప్రజా సంఘాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తుండటంతో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. 1985 నాటి అసోం ఒప్పందంలో పేర్కొన్న నియమ నిబంధనలను ఈ బిల్లు కాలరాస్తోందని వారు విమర్శిస్తున్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య ప్రాంత విద్యార్థి సంఘం ఈ నెల 10న 11 గంటల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   3 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   33 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle