newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విధానసౌధలో చచ్చిన ఎలుక.. మండిపడ్డ సీఎం..!

15-10-201915-10-2019 16:16:30 IST
2019-10-15T10:46:30.746Z15-10-2019 2019-10-15T10:46:19.946Z - - 17-04-2021

విధానసౌధలో చచ్చిన ఎలుక.. మండిపడ్డ సీఎం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విధాన సౌధలో చచ్చిన ఎలుక, పురుగుల కారణంగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ ఎడియూరప్ప నాలుగు ముఖ్యమైన సమావేశాలను రద్దు చేసుకున్నారు. బెంగళూరులోని భారీ నిర్మాణాల్లో ఒకటైన విధాన సౌధ అనే శాసనసభకు ఎలుకలు, పురుగులు సమస్య చుట్టిముట్టినట్లుంది. సోమవారం ముఖ్యమంత్రి కమటీరూములో నాలుగు అధికారిక సమావేశాల్లో పాల్గొనవలసి ఉండగా చచ్చిన ఎలుక వాసన కంపుగొట్టడంతో సీఎం మండిపడ్డారు. 

ముఖ్యమంత్రి సమావేశ స్థలానికి చేరుకోగానే ఘాటుగా చచ్చిన ఎలుక వాసన వచ్చింది. దీంతో అధికారులపై ఆగ్రహం ప్రదర్శించిన సీఎం ఏంటిది అంటూ వారిని నిలదీసినట్లు సమాచారం. ఆ కంపును తట్టుకోలేక అక్కడినుంచి బయటపడిన ఎడ్డీ తన చాంబర్‌లోనే నాలుగు ముఖ్యమైన సమావేశాలను పూర్తిచేశారు.

తర్వాత తెలిసిందేమిటంటే విధానసౌధలో సచ్చిన ఎలుకల సమస్యే కాదు నల్లుల సమస్య కూడా ఒక రేంజిలో ఉంటోందని వార్తలు వెలువడ్డాయి. ఇది ఎడియూరప్ప ఎదుర్కొన్నదే కాదు. మునుపటి సీఎంలు కూడా వీటిబారిన  పడ్డారని తెలుస్తోంది. 

2015లో మాజీ సీఎం సిద్ధరామయ్య శాసనసభలో ప్రసంగిస్తూ అయిదేళ్ల కాలానికి గాను విదాన సౌధలో ఎలుకలు పట్టేయడానికి తన ప్రభుత్వం రూ. 19.34 లక్షల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. అప్పుడు ఒక నెల రోజుల వ్యవధిలో 50 ఎలుకలు పట్టినట్లు ఎడ్డీ తెలిపారు.

చివరకు విధానసౌధ, వికాస సౌధ మాత్రమే కాదు రాజ్ భవన్లో తిష్ట వేసిన 30 గండుపిల్లులు పట్టేందుకు తాము గతంలో లక్షరూపాయల్ని కేటాయించినట్లు బ్రహత్ బెంగళూరు మహానగర పాలిక మేయర్ తెలిపారు. ఒక్కో పిల్లిని పట్టడానికి తాము మూడువేల రూపాయలను కేటాయించినట్లు తెలిసింది.

చూస్తుంటే కర్ణాటక విధానసౌధ, రాజ్ భవన్‌ ఎలుకలు, బొద్దింకలు, పిల్లులు ఇతర పురుగులకు కూడా నిలయమైనట్లు కనిపిస్తోంది. 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   4 hours ago


hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

   15 minutes ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   7 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle