newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విద్యార్థుల ఇష్టం లేకుండా బలవంతంగా పరీక్షలా..

29-08-202029-08-2020 07:12:35 IST
2020-08-29T01:42:35.114Z29-08-2020 2020-08-29T01:42:30.765Z - - 14-04-2021

విద్యార్థుల ఇష్టం లేకుండా బలవంతంగా పరీక్షలా..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విద్యార్థుల ఆమోదం లేకుండా బలవంతగా పరీక్షలు జరపాల్సిన అవసరం ఏమిటని కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. విద్యార్థుల బాధ‌ను అర్థం చేసుకుని ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని సోనియా కేంద్రానికి విన్న‌వించారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆమె  ఓ వీడియోను షేర్ చేశారు. సెప్టెంబర్‌లో జ‌ర‌గాల్సిన‌ జేఈఈ, నీట్ ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని దేశ‌వ్యాప్తంగా విద్యార్థులు ముక్త‌కంఠంతో నిన‌దిస్తున్నారు. కానీ ప్ర‌భుత్వం మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతామ‌ని మొండిగా తేల్చి చెప్పింది. అయితే చాలామంది ప్ర‌ముఖులు విద్యార్థుల ప‌క్షాన నిల‌బ‌డుతూ ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని కేంద్రాన్ని కోరుతున్నారు. 

తాజాగా కాంగ్రెస్ తాత్కాలిక‌ అధినేత్రి సోనియా గాంధీ ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.  నీట్, జేఈఈ-2020 పరీక్షలు నిర్వహించే విషయంలో విద్యార్థుల వాణి వినాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ కేంద్రాన్ని కోరారు. కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ మేరకు ఒక వీడియోను సోనియా గాంధీ పోస్ట్ చేశారు. నిమిషం పాటు సాగే ఈ వీడియోకు, 'స్పీక్ అప్ ఫర్ స్టూడెంట్స్ సేఫ్టీ'  అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.

ప్రియ‌మైన విద్యార్థులారా.. మీ బాధ‌ను నేను అర్థం చేసుకోగ‌ల‌ను. ఇప్పుడు మీరు అత్యంత క్లిష్ట ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప‌రీక్ష‌లు ఎప్పుడు, ఎక్క‌డ జ‌ర‌పాలి అనే విష‌యాలు మీకు మాత్ర‌మే కాదు, మీ కుటుంబానికి కూడా ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించాయి. మీరే రేప‌టి భ‌విష్య‌త్తు. భావి భారత నిర్మాణం మీ చేతుల్లోనే ఉంది. కాబ‌ట్టి మీ భ‌విష్య‌త్తును శాసించే ఏ నిర్ణ‌య‌మైనా మీ అనుమ‌తితోనే తీసుకోవాలి. అదే ముఖ్యం కూడా. ప్ర‌భుత్వం మీ మొర ఆల‌కిస్తుంద‌ని ఆశిస్తున్నా. మీ ఇష్టానికి అనుగుణంగా న‌డుచుకుంటుంద‌ని భావిస్తున్నా. ఇదే ప్ర‌భుత్వానికి నేనిచ్చే స‌ల‌హా. ధ‌న్య‌వాదాలు అని వీడియోలో పేర్కొన్నారు. 

కాగా జేఈఈ, నీట్ ప‌రీక్ష‌లు ఇప్ప‌టికే రెండు సార్లు వాయిదా పడ్డాయి. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ఆల‌స్యం చేసే కొద్దీ విద్యార్థుల భ‌విష్య‌త్తు దెబ్బ‌తింటుంద‌ని కేంద్ర విద్యాశాఖ అభిప్రాయ‌ప‌డుతోంది. కానీ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా వారితో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని సోనియా సూచించారు. మీ వాణి ప్రభుత్వం వింటుందని, అందుకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వానికి నా విజ్ఞప్తి కూడా ఇదే అని సోనియాగాంధీ ఆ వీడియోలో పేర్కొన్నారు. 

ప్ర‌భుత్వ వైఫ‌ల్యానికి విద్యార్ధులు బాధ్యులా? రాహుల్ ప్రశ్న

ప్ర‌భుత్వ వైఫ‌ల్యం కార‌ణంగా విద్యార్థులు త‌మ భ‌ద్ర‌త విష‌యంలో రాజీప‌డ‌కూడ‌ద‌ని కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ అభిప్రాయ‌ప‌డ్డారు. విద్యార్థులు దేశ భ‌విష్య‌త్తు, వారే భార‌త కీర్తిని మ‌రింత ఎత్తుకు తీసుకెళ్లేది అని రాహుల్ పేర్కొన్నారు. 'నాకు అర్థం కాని విష‌యం ఏమిటంటే క‌రోనా నియంత్ర‌ణ‌లో ప్ర‌భుత్వం వైఫ‌ల్యం ఉంటే దానికి మీరెందుకు బాధ్య‌త వ‌హించాలి? త‌ర్వాత  ఎదుర‌య్యే ప‌ర్య‌వ‌సనాల‌కు మీరెందుకు బాధ ప‌డాలి? అస‌లు ఈ విష‌యంలో ప్ర‌భుత్వం మిమ్మ‌ల్ని ఎందుకు బ‌ల‌వంతం చేయాలి? ప‌్ర‌భుత్వ‌మే విద్యార్థుల మాట విన‌డం చాలా ముఖ్యం' అని  విద్యార్థుల‌ను ఉద్దేశించి రాహుల్ వీడియోలో పేర్కొన్నారు. 

జేఈఈ, నీట్ ప‌రీక్ష‌ల నిర్వ‌హణ‌పై ప్ర‌భుత్వం విద్యార్థుల‌తో ముచ్చ‌టించి ఒక ఏకాభిప్రాయానికి రావాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న కోరారు. క‌రోనా తీవ్ర‌త నేప‌థ్యంలో ఈ రెండు ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాల‌ని శుక్ర‌వారం విప‌క్షాలు సుప్రీంను ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. బీజేపేత‌ర ప్ర‌భుత్వాలు ప‌శ్చిమ‌బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, చ‌త్తీస్‌గ‌డ్, పంజాబ్, మ‌హారాష్ర్ట రాష్ర్టాలు ఈ మేర‌కు  సంయుక్తంగా పిటిష‌న్ దాఖ‌లు చేశాయి. 

ముందుగా నిర్ణయించిన సెప్టెంబర్‌ నెలలో జేఈఈ, నీట్ పరీక్షలు జరుగుతాయని సుప్రీంకోర్టు ఇదివర‌కే స్పష్టం చేసింది.  పరీక్షల వాయిదాని కోరుతూ 11 మంది విద్యార్థులు దాఖ‌లుచేసిన పిటిష‌న్‌ను సుప్రీం కొట్టివేసింది.  పరీక్షలను వాయిదా వేయ‌డం వ‌ల్ల విద్యార్థులు నష్టపోతారని తెలిపింది. ఏడాదిపాటు అకడమిక్‌ ఇయ‌ర్‌ను విద్యార్థులు కోల్పోతార‌ని, అది వారి భ‌విష్య‌త్తుపై ప్రభావం చూపిస్తుంద‌ని వ్యాఖ్యానించింది. సెప్టెంబ‌ర్ 1 నుంచి 6వ తేదీ వ‌ర‌కు జేఈఈ మెయిన్స్, సెప్టెంబ‌ర్ 13న నీట్‌ను దేశవ్యాప్తంగా ఉన్న 161 కేంద్రాల్లో నిర్వహించేందుకు  అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు.

 

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   10 minutes ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   an hour ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   2 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   3 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   4 hours ago


కేటీఆర్ కి అంత సీన్ లేదులే

కేటీఆర్ కి అంత సీన్ లేదులే

   6 hours ago


పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

   6 hours ago


కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

   21 hours ago


వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

   21 hours ago


ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle