newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విద్యారంగంలో మార్పులు తప్పవా? సీబీఎస్ఇ విప్లవాత్మక నిర్ణయం

29-06-202029-06-2020 11:11:40 IST
Updated On 29-06-2020 11:52:01 ISTUpdated On 29-06-20202020-06-29T05:41:40.796Z29-06-2020 2020-06-29T05:40:25.047Z - 2020-06-29T06:22:01.747Z - 29-06-2020

విద్యారంగంలో మార్పులు తప్పవా? సీబీఎస్ఇ విప్లవాత్మక నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో ఎన్నడూ లేనివిధంగా కరోనా వైరస్ వ్యవస్థల్ని నిర్వీర్తం చేస్తోంది. కేసులు పెరుగుతుండడంతో ఈఏడాది విద్యాసంవత్సరం బాగా ఎఫెక్ట్ అవుతోంది. ఇప్పటికే ఎంట్రన్స్ పరీక్షలు పూర్తికావలపి వున్నా అవి వాయిదా పడ్డాయి. విద్యారంగంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలవుతున్న క్రమంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

తాజాగా అత్యవసర జనరల్ బాడీ మీటింగ్‌ను నిర్వహించిన సీబీఎస్ఈ  అధికారులు పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగానే  కొత్త విద్యా సంవత్సరం ఆగస్టులో ప్రారంభం కానుంది. అందులో భాగంగా సీబీఎస్ఇ ఈ ఏడాది 33 శాతం సిలబస్‌ను తగ్గించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. 1వ తరగతి నుంచి 8 తరగతి వరకు పాఠశాలలే సిలబస్‌ను తగ్గించనున్నారు.

అనంతరం 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తగ్గించిన సిలబస్‌కు సంబంధించిన సర్క్యూలర్లను త్వరలోనే విడుదల చేయనుంది. అటు క్వశ్చన్ పేపర్‌లో కూడా 50 శాతం మల్టీపుల్ ఛాయస్ ప్రశ్నలను ఇవ్వాలని, మిగిలిన థియరీ బేస్డ్ ఉంచాలని భావిస్తోంది. అంతేకాకుండా విద్యార్థులకు ఇంటి వద్ద నుంచే ప్రాక్టికల్స్ నిర్వహించేలా మార్పులు చేసేందుకు సీబీఎస్ఈ సిద్ధమైంది. దీని కోసం పాఠశాలల యాజమాన్యాలు డిజిటల్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. 10, 12వ తరగతుల సీబీఎస్ఈ బోర్డు పరీక్షా ఫలితాలు జూలై 15న వెలువరించనుంది. సీబీఎస్ఈతో పాటు రాష్ట్రాల ఎస్ఎస్ఎస్సీ బోర్డులు కూడా మార్పులు చేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. విద్యార్ధులకు రోజుకి నాలుగైదు క్లాసులు చెబుతున్నాయి. 

మరోవైపు కరోనా నిబంధనలను పాటిస్తూ పాఠశాలలు తెరుస్తామని వివిధ రాష్ట్రాలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. ఏపీలోనూ ఆదిశగా రాష్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. అటు డిగ్రీ, పీజీ పరీక్షలపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే పదవతరగతి పరీక్షలు రద్దుచేశాయి. తెలంగాణ ప్రభుత్వం గ్రేడింగ్ లతో ఫలితాలు ప్రకటించింది. ఒకవేళ పాఠశాలలు ప్రారంభించినా ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని పంపిస్తారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో పాఠశాలల ప్రారంభంపై సస్పెన్స్ కొనసాగుతోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle