newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విజయపథంలో మోడీ తొలి ఏడాది

08-06-202008-06-2020 21:19:38 IST
Updated On 09-06-2020 09:09:10 ISTUpdated On 09-06-20202020-06-08T15:49:38.422Z08-06-2020 2020-06-08T15:48:37.119Z - 2020-06-09T03:39:10.071Z - 09-06-2020

విజయపథంలో మోడీ తొలి ఏడాది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ నినాదంతో 2019 ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచి, రెండవ సారి ప్రధాని అయ్యాక శ్రీ నరేంద్ర మోడి ఏడాది కాలంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మోడి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ల నుంచి ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా దేశాన్ని  పరిపాలిస్తోంది.  రెండవసారి అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది కాలంలో భారతదేశంపై చెరగని ముద్ర వేసిన చారిత్రక నిర్ణయాలను ఒకసారి పరిశీలిస్తే..

అంతర్జాతీయంగా బలమైన శక్తిగా ఎదిగిన భారత్

భారత ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన మోడి తొలి ఏడాది కాలంలో ప్రపంచంలోని పలు దేశాలతో దౌత్య సంబంధాలు బలోపేతానికి చర్యలు తీసుకున్నారు.ఆర్థిక, రక్షణ, విద్యుత్ వంటి రంగాల్లో వివిధ దేశాలతో సంబంధాలు బలపడ్డాయి. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ధ్వజమెత్తి, పాకిస్థాన్ ను ఏకాకిని చేశారు.అమెరికాలో జరిగిన హౌడీ, మోడి, అహ్మదాబాద్ లో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమాల వల్ల అమెరికా, భారతదేశం మధ్య సంబంధాలు బలోపేతం అయ్యాయి. అంతర్జాతీయంగా భారత్ ఒక బలమైన శక్తిగా ఎదిగింది.

ముస్లిం మహిళల జీవితాల్లో వెలుగు - ట్రిపుల్ తలాఖ్ రద్దు

ముస్లిం మహిళల గౌరవ ప్రతిష్టలను కాపాడ్డానికి, వారి వివాహ హక్కులను పరిరక్షించడానికి ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేశారు. షరియత్ ప్రకారం భర్త మూడుసార్లు తలాఖ్ చెబితే విడాకులు మంజూరైనట్టే. భార్య అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు. అంతే కాదు, భర్త కేవలం మూడు నెలలు భరణం చెల్లిస్తే సరిపోతుంది. ఇది ముస్లిం మహిళల పాలిట శాపంగా మారింది. గతంలో అధికారంలో వున్నకాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మహిళల హక్కులను కాలరాసింది.ట్రిపుల్ తలాఖ్ వల్ల దగా పడుతున్న మహిళలను ఆదుకోడానికి ప్రధానమంత్రి మోడి రెండవసారి పదవి చేపట్టాక 2019 జులై 31న ముస్లిం మహిళల వివాహ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు.

దీని ప్రకారం ఎవరైనా మూడుసార్లు తలాఖ్ చెబితే మూడు సంవత్సరాల కారాగార శిక్ష అనుభవించాల్సి వుంటుంది. అంతే కాదు, బాధిత మహిళకు, పిల్లలకు మేజిస్ట్రేట్ నిర్ణయం మేరకు భరణం కూడా ఇవ్వాల్సి వుంటుంది.ముస్లిం మహిళలకు, పిల్లలకు భరోసా కల్పించిన ఈ చట్టంపై మెజారిటీ ముస్లింలు, మహిళలు, అభ్యుదయవాదులు హర్షం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.

రామజన్మభూమికి  శాంతియుత  పరిష్కారం

స్వతంత్ర భారతదేశంలో అత్యంత వివాదాస్పదమైన రామజన్మభూమి సమస్యకు న్యాయ ప్రక్రియ ద్వారా పరిష్కారం లభించింది. వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమి ట్రస్టుకివ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం తీర్పును అనుసరించి కేంద్రం శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును ప్రకటించి మొత్తం 62 ఎకరాల భూమిని ట్రస్టుకు అప్పగించింది. బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో కీలకమైన అయోధ్య అంశాన్ని అత్యంత శాంతియుతంగా పరిష్కరించిన ఘనత మోడి ప్రభుత్వానికి దక్కింది.

పౌరసత్వ సవరణ చట్టం 

పౌరసత్వ సవరణ చట్టంపై కొంతకాలంగా కొన్నిపార్టీలు, సంస్థలు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే వారి ప్రచారాలన్నీ అసత్యాలే.పొరుగు దేశాల్లో మతపరమైన అణచివేతకు గురై, భారతదేశానికి శరణార్ధులుగా వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, పార్శీలు, జైన్లు, బౌద్ధులు, సిక్కులను ఆదుకోడానికే కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చింది.

మతపరమైన అణచివేతకు గురై, ప్రాణాలరచేత పెట్టుకుని పిల్లాపాపలతో శరణార్ధులుగా మన దేశానికొచ్చిన వారికి, అక్రమంగా వలసలు వచ్చిన వారికి మధ్య తేడాను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు గమనించకుండా అందర్నీ ఒకే గాటన కట్టాయి. సిఎఎ ప్రకారం 2014 డిసెంబరుకు ముందు భారతదేశంలోకి వలస వచ్చినవారికి భారతీయ పౌరసత్వం కల్పిస్తారు. దీని వల్ల ఏ భారతీయుడి పౌరసత్వం రద్దుకాదు. ఇక్కడున్న ప్రజలకు , ముస్లింలకు ఎలాంటి నష్టం జరగదు.శరణార్ధులుగా వచ్చిన వారికి రక్షణ కల్పించి, చేయూతనివ్వడం మన సాంస్కృతిక, జాతీయ బాధ్యత. బిజెపి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని నిలుపుకుని పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. 

ఆర్టికల్ 370 రద్దు

భారతదేశంలో కశ్మీర్ విలీన సమయంలో అప్పటి కశ్మీర్ రాజు హరిసింగ్ షరతులకు నెహ్రూ నాయకత్వంలోని ప్రభుత్వం తలొగ్గడం వల్ల విదేశీ, రక్షణ, టెలికమ్యూనికేషన్లు వంటి కొన్ని అంశాలు మినహా మిగిలిన అన్ని విషయాల్లో జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి వుండేలా రాజ్యాంగంలో 370వ అధికరణం ద్వారా కల్పించారు.ఈ అధికరణం వల్ల భారత పార్లమెంటు చేసిన చట్టాలు, బిల్లుల కశ్మీర్లో అమలవ్వాలంటే కశ్మీర్ అసెంబ్లీ అనుమతిపై ఆధారపడి వుంటాయి. 

దేశంలోని మిగతా ప్రాంతాల ప్రజలు జమ్ము,కశ్మీర్ లో ఆస్తులు కొనడానికి వీలు లేదు.కశ్మీర్ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిగా పిలుస్తారు. కశ్మీర్కు ప్రత్యేక జెండా వుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వాల ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల కశ్మీర్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారింది.ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఆర్టికల్ 370ని రద్దు చేశారు. దీంతో పాటు జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు.స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తరువాత భారతదేశం మొత్తం ఒకే జాతీయ జెండా కిందకు వచ్చింది. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజ అన్న నినాదం సాకారమైంది.

రైతు సంక్షేమం కోసం ఏటా రూ.87 వేల కోట్లు

పిఎం కిసాన్ సమ్మాన్ నిధినిబంధనల సరళీకరణ వల్ల రైతులకు మరింత లబ్ధి కలగనుంది. రైతు సంక్షేమం కోసం ఏటా రూ.87 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.సన్న, చిన్నకారు రైతులకు పెన్షన్ స్కీం ప్రవేశపెట్టారు. దీని ప్రకా రం 60 ఏళ్లు దాటిన రైతులకు నెలకు 3 వేల  పెన్షన్ వస్తుంది.

బ్యాంకుల విలీనం

5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దేందుకు బీమా, బ్యాంకింగ్ రంగాల్లో అనేక సంస్కరణలు చేపట్టారు.దేశంలోని 10 ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసి, నాలుగు పెద్ద బ్యాంకులుగా మార్చారు. దీని వల్ల ఆర్థిక కార్యకలాపాలపై నిఘా, నియంత్రణ పెరుగుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకులతో మన బ్యాంకులు పోటీపడే స్థాయికి ఎదుగుతాయి.

కరోనాపై పోరు

కరోనా వల్ల ప్రపంచమంతా అల్లకల్లోలమైంది. అమెరికా, బ్రిటన్ వంటి సంపన్న దేశాలే దిక్కుతోచని స్థితిలోకెళ్లాయి.కానీ మన దేశంలో మాత్రం కేంద్రం సకాలంలో తీసుకుంటున్న చర్యల వల్ల కరోనా నియంత్రణలో మనం మెరుగ్గా వున్నాము.138 కోట్ల జనాభా, ఆరోగ్య వ్యవస్థలు సరిగాలేని మనదేశంలో కరోనాను కట్టడి చేయడం మాటలుకాదు. కేంద్రం ముందు నుంచి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో ఇది సాధ్యమైంది. కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రజలు, ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు రూ.20 లక్షల కోట్ల విలువైన ప్యాకేజిని అమలు చేయనుంది. 

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్

కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుంచి అభివృద్ధి పథంలో పయనించే విధంగా ప్రధాని నరేంద్రమోడి గారు రూ. 20 లక్షల కోట్లతో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజిని ప్రకటించారు.భారత దేశ జిడిపిలో దాదాపు 10 శాతానికి సమానమైన ప్యాకేజి ఇది. ప్రపంచంలో అతిపెద్ద  రిలీఫ్ ప్యాకేజిల్లో ఇది ఒకటి.ఎకానమీ, మౌలికరంగం, సాంకేతికత ఆధారిత రంగాలు, జనాభా, ఉత్పత్తులకు డిమాండ్ అనే అయిదు అంశాలు మూల స్తంభాలుగా ఆత్మనిర్భర్ ప్యాకేజి పనిచేస్తుంది.కరోనా లాక్ డౌన్ ప్రకటించిన తొలి రోజుల్లోనే ప్రధానమంత్రి పేదల కోసం ఒక లక్షా 70 వేల కోట్ల రూపాయలతో గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ప్రకటించారు. 

ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 42 కోట్ల మంది నిరుపేదలకు 53 వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలో ఎంతో వేగంగా అమలవుతున్న ఈ పథకం కింద ఇప్పటివరకు మంజూరైన నిధుల వివరాలు మీకు తెలియజేస్తాను.8.7 కోట్ల మంది రైతులకు ముందస్తుగా కిసాన్ యోజన నిధులు రూ.16,394 కోట్లు నేరుగా వారి బ్యాంక్ ఎకౌంట్లలో జమచేయడం జరిగింది.

జనధన్ ఖాతాలున్న 41 కోట్ల మంది మహిళలకు వారి ఖాతాల్లో రెండు విడతలుగా రూ.20,320 కోట్లు జమచేశారు.దాదాపు 3 కోట్లమంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రెండు దఫాలుగా 3 వేల కోట్లు పంపిణీ చేయడమైనది.ఇప్పటివరకు 1 కోటి, 1 లక్ష మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు రాష్ట్రాలకు పంపడం జరిగింది. అందులో ఏప్రిల్ నెలకు 37 లక్షల మెట్రిక్ టన్నులు 74 కోట్ల మందికి పంపిణీ చేశారు. మే నెలకు 33 లక్షల మెట్రిక్ టన్నులు 66 కోట్ల మందికి పంపిణీ చేశారు.5లక్షల మెట్రిక్ టన్నుల పప్పులను రాష్ట్రాలకు సరఫరా చేయడం జరిగింది.

2.3 కోట్ల మంది భవననిర్మాణ కార్మికులకు ఉపశమనం కల్పించడానికి, భవననిర్మాణ సంక్షేమ నిధి నగదు వినియోగించడానికి అనుమతించిన కేంద్రం. వీరికి రూ.4,312 కోట్లు అందజేయడం జరిగింది.రూ.15 వేల రూపాయల లోపు ఆదాయం వున్న ఉద్యోగులకు, 100 మంది లోపు కార్మికులున్న వ్యాపారాలకు మొత్తం 24 శాతం పిఎఫ్ ను మూడు నెలల పాటు కేంద్రమే వారి ఖాతాల్లో జమ చేస్తుంది. స్వయం సహాయక బృందాలకు ఉచితరుణాల పరిమితిని రూ.10 నుంచి రూ.20 లక్షల వరకు పెంచింది.

ఉపాధిహామీకి సంబంధించిన పెండింగ్ బకాయిల కింద రాష్ట్రాలకు 29 వేల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది.ఉపాధిహామీ పథకానికి ప్రస్తుతం కేటాయించిన దానికి అదనంగా రూ.40 వేల కోట్లు, కేటాయించారు. దీని వల్ల 300 కోట్ల పనిదినాలు అదనంగా వస్తాయి.ఇవి కాకుండా పారిశ్రామికరంగానికి వూరట కల్పించడానికి పలు పథకాలు ప్రకటించారు. వీటిని పరిశీలిస్తే..

ప్యాకేజి 1...పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు

మొదటి ప్యాకేజిలో చిన్నవ్యాపారాలు, MSMSE లు, పన్ను చెల్లింపుదారులు, డిస్కమ్ లు, NBFCలు, సూక్ష్మరుణ సంస్థలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, కాంట్రాక్టర్లకు భారీ ఊరట కల్పించారు. మొత్తం 6 లక్షల కోట్ల విలువైన ఉద్దీపనలున్నాయి.తీవ్రమైన రుణ ఒత్తిడిలో వున్న వ్యాపార సంస్థలు, MSMSE లకు రూ.3 లక్షల కోట్లతో పూచీకత్తు లేని రుణ సదుపాయం కల్పిస్తారు. పెట్టుబడి విలువ రూ.25 కోట్లు, టర్నోవర్ విలువ రూ.100 కోట్లు కలిగిన రుణగ్రహీతలు ఈ పథకానికి అర్హులు. 100 శాతం క్రెడిట్ గ్యారంటీ కేంద్రమే హామీ ఇస్తుంది.

చిన్న, సూక్ష్మ్, మధ్య తరహా సంస్థలకు రూ.50 వేల కోట్లు అందించనుంది.రూ.200 కోట్ల లోపు ప్రభుత్వ పనులకు గ్లోబల్ టెండర్లు నిషేధించింది. దీని వల్ల దేశీయ MSMEలకు అవకాశాలు మెరుగుపడతాయి.కేంద్రప్రభుత్వ అభ్యర్థన మేరకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్రాల వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితులను 60 శాతం పెంచడంతో పాటు ఓవర్ డ్రాఫ్ట్ పరిమితులను కూడా పెంచింది. 

ఎమర్జెన్సీ హెల్త్ రెస్పాన్స్ ప్యాకేజి కింద రూ.15 వేల కోట్ల నిధులు మంజూరయ్యాయి.ప్యాకేజి 2 (వలస కూలీలు, రైతులు, చిన్నవ్యాపారులు ఆత్మనిర్భర్ భారత్ పథకం రెండో విడతలో భాగంగా వలస కూలీలు, రైతులు, చిన్నవ్యాపారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.3.16 లక్షల కోట్ల ప్యాకేజిని అమలు చేయనున్నారు. లాక్ డౌన్ కాలంలో తీవ్ర కష్టాలు అనుభవిస్తున్న వలస కూలీలను ఆదుకోడానికి కేంద్రం నిర్విరామంగా కృషి చేస్తోంది.. ఎస్డీఆర్ఎఫ్ కింద ఇప్పటికే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.11 వేల కోట్లు మంజూరు చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిధులు ఉపయోగించుకుని సొంత వూళ్లకు నడచి వెళుతున్న కార్మికులకు ఆయా రాష్ట్రాల పరిధుల్లో రవాణా, ఆహారం, వసతి వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి వుంది.  అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం వల్ల కూలీలు ఇబ్బందులు పడ్డారు.దేశవ్యాప్తంగా 8కోట్ల మంది వలస కార్మికులకు రాబోయే రెండు నెలల పాటు ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల బియ్యం కానీ, గోధుమలు కానీ ఇస్తారు. ఒక కిలో కందిపప్పు ఇస్తారు.

దీని కోసం కేంద్రం రూ.3,500 కోట్లు మంజూరు చేసింది. వలస కూలీలను గుర్తించి అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. రేషన్ కార్డు లేకపోయినా వీటిని ఇవ్వాల్సి వుంటుంది.లాక్ డౌన్ వల్ల వ్యాపారాలు జరగకు ఇబ్బంది పడుతున్న చిరువ్యాపారులకు ఉపశమనం కలిగించడానికి వారు తీసుకున్న ముద్ర శిశు రుణాలపై వచ్చే ఏడాది పాటు 2 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తారు. దీని వల్ల వారికి రూ.1500 కోట్ల మేరకు ప్రయోజనం కలుగుతుంది.

చిన్న, సన్నకారు రైతులకు నాబార్డు ద్వారా రూ.30 వేల కోట్లతో అత్యవసర మూలధన నిధి సమకూరుస్తారు. నాబార్డు గతంలో ప్రకటించిన రూ.90 వేల కోట్లకు ఇది అదనం. ఈ మొత్తాన్ని రైతులకు గ్రామీణ బ్యాంకులు, సహకార సంఘాల నుంచి రుణంగా అందజేస్తారు.2.5 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడిరైతులకు కిసాన్  క్రెడిట్ కార్డులు అందించి వడ్డీ రాయితీతో రూ. 2 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేస్తారు. ఈ పథకం ద్వారా గరిష్టంగా మూడు లక్షల రూపాయల వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది. 

ఏడాదికి రూ.6 నుంచి 18 లక్షల ఆదాయం వున్న మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు ఇళ్ల కొనుగోలు కోసం ఇస్తున్న వడ్డీ రాయితీ పథకాన్ని 2021 మార్చి వరకు పొడిగించారు. ఇంటి కోసం తీసుకున్న రుణానికి చెల్లించే వడ్డీలో 6.5 శాతం కేంద్రప్రభుత్వం భరించడం వల్ల ఈఎంఐల భారం తగ్గుతుంది.వచ్చే ఆగస్టుకల్లా ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు విధానం అమల్లోకి తీసుకురానున్నారు. దీని వల్ల 67 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది.దేశంలో వున్న 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున  5 వేల కోట్ల  రుణం ఇస్తారు. 

ప్యాకేజి 3... వ్యవసాయ, అనుబంధ రంగాలు

ఆత్మ నిర్భర్ భారత్ లో మూదో ప్యాకేజిలో వ్యవసాయ, అనుబంధ రంగాల బలోపేతానికి రూ.1,63,343 కోట్లు కేటాయించారు. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్ముకునేందుకు లక్ష కోట్లతో మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు చేస్తారు.మత్స్యకారుల కోసం 20 వేల కోట్లతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రారంభిస్తారు. దీని వల్ల 55 లక్షల మందికి ఉపాధి కలగడమే కాకుండా ఎగుమతులు రెట్టింపై లక్ష కోట్లకు చేరతాయి.పాడిపరిశ్రమలో  మౌలిక వసతుల కల్పనకు రూ.15 వేల కోట్లు ఖర్చు పెట్టనున్నారు.

ఔషధ మొక్కల పంటలు సాగు చేసేవారికి రూ.4 వేల కోట్లతో ప్రోత్సాహకాలు అందించనున్నారు.అన్నిరకాల కూరగాయల రవాణా, నిల్వలకు అయ్యే ఖర్చులో 50 శాతం రాయితీ ఇస్తారు.రైతు తన ఉత్పత్తిని ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునేందుకు వీలుగా వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని సంస్కరిస్తూ కేంద్రీకృత చట్టాన్ని తీసుకురావడం జరిగింది. రైతులకు పంట వేసేటప్పుడే దాని ధరకు భరోసా కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా వ్యాపారులు, ఎగుమతిదారులతో ముందుగానే పంటల కొనుగోలు, ధరలపై కుదుర్చుకునే ఒప్పందాలకు చట్టపరమైన భద్రత కల్పించనుంది.

ప్యాకేజి 4.. ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల కల్పనకు ఊతం

సామాజిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వయబులిటీ గ్యాప్ ఫండింగ్ పెంచనున్నారు. దీని వల్ల ప్రభుత్వం భరించే విజిఎఫ్ పరిమితి ప్రాజెక్టు వ్యయంలో 20 శాతం నుంచి 30 శాతానికి పెరగనుంది.పిపిపి పద్ధతిలో ఖనిజాల మైనింగ్  జరుపుతారు. ఇందుకోసం 500  క్షేత్రాలను వేలం వేయనున్నారు.  ఉత్పత్తి రంగంలో పోటీతత్వాన్ని పెంచేందుకు బాక్సైట్, బొగ్గు గనులను సంయుక్తంగా వేలం వేయనున్నారు.

బొగ్గురంగంలో భారీ సంస్కరణలు చేపట్టారు. ఆదాయం పంపిణీ పద్ధతిన బొగ్గు కమర్షియల్ మైనింగ్ కు అనుమతించారు. రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో త్వరలో 50 గనులు వేలం వేయనుంది.రక్షణ రంగ ఉత్పత్తుల్లో మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సాహం. డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ లో నేరుగా అనుమతించే విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల పరిమితిని 49 నుంచి 74 శాతానికి పెంపు. కొన్ని ఆయుధాలు, ప్లాట్ ఫామ్ ల దిగుమతులపై నిషేధం.ఎయిర్ స్పేస్ వినియోగంపై ఆంక్షలు సడలించడం ద్వారా, పౌర విమానయాన రంగానికి ఏటా వెయ్యి కోట్ల ఆదాయం పెరుగుతుంది.భారతదేశాన్ని విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (MRO) హబ్ లా మార్చేందుకు చర్యలు తీసుకుంటారు. పిపిపి పద్ధతిలో ఆరు విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నారు.

ప్యాకేజి 5 ..స్వయం సమృద్ధి

సంక్షోభం వల్ల ఎదురైన సవాళ్లను ఎదుర్కొని స్వయంసమృద్ధి చెందాలన్న లక్ష్యంతో 5వ ప్యాకేజి రూపొందించారు. ఇందులో ప్రధానంగా 7 రంగాలపై దృష్టి సారించారు.క్షేత్ర స్థాయిలో వైద్య వ్యవస్థ బలోపేతానికి చర్యలు. మండల స్థాయిలో ప్రజారోగ్య ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తారు. టెస్టింగ్ ల్యాబ్ లు, పరీక్షల కిట్ల కోసం రూ.550 కోట్లు కేటాయింపు.ఆన్ లైన్ విద్యా వ్యవస్థ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. పిఎం ఈ విద్య, మనోదర్పణ్ పేరుతో కొత్త ప్రాజెక్టులు. ఇకపై ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతి తరగతికి ఒక ప్రత్యేక ఛానల్ ఏర్పాటు. దేశ వ్యాప్తంగా మే 30 నుంచి 100 యూనివర్శిటీలకు ఆన్ లైన్ కోర్సులకు అనుమతి. రేడియో, కమ్యూనిటీ రేడియో,పాడ్  కాస్ట్ ల సేవలు వినియోగించేందుకు చర్యలు.

కరోనా వల్ల నష్టపోయిన వ్యాపార సంస్థలకు, ఎంఎస్ఎంఈలకు దివాళా స్మృతి నుంచి ఏడాదిపాటు మినహాయింపులు. MSMEలు, ఇతర సంస్థలకు లబ్ధి చేకూర్చేలా దివాళా స్మృతిలో సంస్కరణలు అమలు.రాష్ట్రాలకు రెవెన్యూ లోటు రూ.12,390 కోట్లు భర్తీ. ఎస్డీఆర్ఎఫ్ నిధులు కోసం ఏప్రిల్ మొదటివారంలో రాష్ట్రాలకు రూ.11 వేల కోట్లు అడ్వాన్స్ గా చెల్లించడం జరిగింది. కోవిడ్ నివారణ చర్యల కోసం రూ.4 వేల కోట్లు నేరుగా విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ.  రాష్ట్రాల ఓవర్ డ్రాఫ్ట్ వరుస రోజుల పరిమితిని 14నుంచి 21 రోజులకు పెంచడం జరిగింది. కరోనా వల్ల దేశాభివృద్ధి కుంటుపడకుండా తీసుకుంటున్న చర్యలు భవిష్యత్తులో మంచి ఫలితాలనిస్తాయి.

మోడి గారి సమర్థ నాయకత్వంలో రాబోయే నాలుగేళ్లలో దేశం ప్రగతిపథంలో పయనిస్తుందని విశ్వసిస్తున్నాను. ఇంచుమించు 80 రోజులుగా షూటింగులు ఆగిపోయి అటు ఆర్టిస్టులు, కార్మికులు నానా ఇబ్బందుల పాలయ్యారు. దీంతో షూటింగులు ఎప్పుడు ప్రారంభం అవుతాయా అని ఎదురుచూస్తున్నవారికి తెలంగాణ సీఎం కేసీయార్ తీపికబురు అందించారు. తెలంగాణ ప్రభుత్వం సినిమా, టీవీ షూటింగ్‌లకు అనుమతిస్తూ ఉత్తర్వులూ జారీ చేయడంతో సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

-వై.సత్యనారాయణ చౌదరి (వైఎస్ చౌదరి), రాజ్యసభ ఎంపీ 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle