వారసులకే జయ ఆస్తులు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
30-05-202030-05-2020 16:10:30 IST
2020-05-30T10:40:30.392Z30-05-2020 2020-05-30T10:40:28.254Z - - 17-04-2021

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులకు జయలలిత అన్న జయకుమార్ కుమార్తె దీప, కుమారుడు దీపక్‌లే ప్రత్యక్ష వారసులని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. దీంతో అత్యంత వివాదాస్పదంగా సాగిన జయలలిత ఆస్తుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. జయ ఆస్తికి వారిద్దరూ రెండో తరం వారసులని గురువారం ప్రకటించిన కోర్టు శుక్రవారం తీర్పును సవరిస్తున్నట్లు పేర్కొని వారే ఆమె ఆస్తికి ప్రత్యక్ష వారసులని స్పష్టం చేసింది. అనారోగ్యకారణాలతో జయలలిత అకస్మాత్తుగా కన్నుమూసిన నాటి నుంచి రెండు అంశాలపై రసవత్తరమైన చర్చకు తెరలేచింది. ఒకటి రాజకీయ వారసులు ఎవరు, రెండు అపారమైన ఆమె ఆస్తికి వారసులు ఎవరు.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పార్టీలో ఎవ్వరినీ నెంబరు టూ స్థాయిలో కూర్చో బెట్టలేదు. ఒకటి నుంచి వంద వరకూ అన్నీ తానై వ్యవహరించారు. ఆస్తుల కేసులో జైలు జీవితం గడిపినపుడు పన్నీర్‌సెల్వంకు సీఎం బాధ్యతలు అప్పగించినా అది అంతవరకే. పార్టీలో, ప్రభుత్వంలో పన్నీర్‌సెల్వం సహా అందరూ కిందిస్థాయి నేతలుగానే కొనసాగారు. ఆ రెండింటిలో మొదటిదాన్ని కైవసం చేసుకునే యత్నంలో శశికళ బొక్కబోర్లాపడి జైలు జీవితం గడుపుతోంది. జయ స్థాయిలో శశికళ పార్టీలో చక్రం తిప్పినా అదంతా అనధికారమే. కొంత జయకు తెలియకుండా సాగిపోయినదే. ఇక ఆస్తిని దక్కించుకునేందుకు సైతం శశికళ, టీటీవీ దినకరన్ ప్రయత్నాలు చేసి విఫలమైనారు. జయ అవివాహిత కావడంతో ప్రత్యక్ష వారసులు లేరు. తాను నటుడు శోభన్‌బాబు, జయలలితకు జన్మించిన కుమార్తెను, ఆమె ఆస్తికి తానే వారసురాలినంటూ వేర్వేరుగా ఇద్దరు యువతులు కొన్నాళ్లపాటు హడావిడి చేశారు. వీరిలో బెంగళూరుకు చెందిన యువతి కోర్టులో కేసు కూడా వేసింది. ఆమె వాదనకు బలం లేకపోవడంతో కొద్దిరోజుల్లోనే కనుమరుగైంది. ఇక జయలలిత అన్న జయకుమార్ కుమార్తె దీప, కుమారుడు దీపక్ సైతం వారసత్వపోరును ప్రారంభించారు. పార్టీకి, ప్రాపర్టీకి సైతం తామే వారసులమని దీప మీడియా ముందుకొచ్చారు. చెన్నై పోయస్ గార్డెన్‌లోని నివాసాన్ని జయ స్మారకమందిరంగా మార్చాలని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను న్యాయస్థానం ద్వారా అడ్డుకున్నారు. జయకు రక్తసంబందీకులుగా దీప, దీపక్ మాత్రమే చలామణిలో ఉండడంతో న్యాయస్థానం తీర్పు కూడా వారిద్దరికీ అనుకూలంగా వచ్చింది. పోయస్‌గార్డెన్ ఇంటిని స్మారకమందిరం చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉందని గురువారం ఇచ్చిన తీర్పులో పేర్కొంది. జయ ఆస్తులకు దీప, దీపక్ రెండోతరం వారసులని పేర్కొంది. ముందురోజు చెప్పిన తీర్పులో సవరణలు చేస్తూ జయ ఆస్తులకు దీప, దీపక్ ప్రత్యక్ష వారసులని మద్రాసు హైకోర్టు శుక్రవారం మరో తీర్పు వెలువరించింది. తాజా తీర్పుతో పోయస్‌గార్డెన్ ఇంటిపై దీప, దీపక్‌కు పూర్తిస్థాయి అధికారం వచ్చినట్లు భావించవచ్చు. జయ ఆస్తుల వ్యవహారంలో ఇంతవరకు శశికళ ప్రత్యక్ష జోక్యం చేసుకోలేదు. త్వరలో అదే జరిగితే ఈ వ్యవహారం మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి. మద్రాసు హైకోర్టుకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను.. దీప మద్రాసు హైకోర్టు శుక్రవారం తాజా తీర్పును వెలువరించిన అనంతరం మీడియాతో దీప మాట్లాడారు. ఇలాంటి తీర్పును నేను ఊహించలేదు. అన్నాడీఎంకే సైతం ఈ తీర్పును స్వాగతించాలి. పోయెస్‌గార్డెన్ రోడ్డులోకి ప్రవేశించకుండా నిరోధించారు. వారు ఎవరో మీకు తెలుసు. అత్త (జయలలిత) కడసారి చూపులకు కూడా నోచుకోకుండా చేసింది అన్నాడీఎంకే ప్రభుత్వమే. పోయెస్‌గార్డెన్ ఇంట్లోనే పుట్టాను. అయితే ఆ ఇంటిలోకి నేను వెళ్లకుండా అడ్డుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం తమపై అనవసరమైన నిందలు మోపింది. అయితే చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మద్రాసు హైకోర్టుకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. అని దీప పేర్కొన్నారు. జయ ఆస్తులపై మాకు కోర్టు సర్వాధికారం ఇచ్చింది. ప్రత్యక్ష వారసులమని ప్రకటించిన తరువాత ఏఏ హక్కులు వస్తాయో పరిశీలించాలి. అన్ని ఆస్తులు మాకు అప్పగించాలి. వేదనిలయాన్ని జయ స్మారకమందరంగా మార్చాలని ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై, ఆ ఇంటిపై హక్కు కల్పించాలని కోరుతూ గవర్నర్‌ను కలుస్తాను. అన్నాడీఎంకే నుంచి ఇకపై వచ్చే సమస్యలను న్యాయస్థానంలోనే ఎదుర్కొంటాను. జయ ఆస్తుల విషయంలో అన్నాడీఎంకేకు అడ్డంకులు ఎదురవడంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు. మాలో కొన్ని భయాలు నెలకొన్నందున సాయుధ పోలీసు బందోబస్తు కల్పించాలని దీప చెప్పారు.

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు
44 minutes ago

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి
37 minutes ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
2 hours ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
2 hours ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
5 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
3 hours ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
6 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
20 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
16-04-2021

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
21 hours ago
ఇంకా