వాడిపోతున్న కమలం..బీజేపీ కింకర్తవ్యం...?
24-12-201924-12-2019 09:49:56 IST
Updated On 24-12-2019 11:25:19 ISTUpdated On 24-12-20192019-12-24T04:19:56.107Z24-12-2019 2019-12-24T04:17:13.008Z - 2019-12-24T05:55:19.403Z - 24-12-2019

జార్ఖండ్ ఫలితాలు ఏం చెబుతున్నాయి?
ఒక్కో రాష్ట్రం బీజేపీ ‘చే’జారిపోతోందా?
మోడీ-షా ప్రాభవం కోల్పోతున్నారా?
కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయా?
మొన్న మహారాష్ట్ర.. నిన్న జార్ఖండ్.. నెక్స్ట్ ఏంటి?
2019 లోక్ సభ ఎన్నికల నాటి బీజేపీ ఏది?
జార్ఖండ్ ఎన్నికలు బీజేపీకి గుణపాఠం నేర్పాయి. ఒకవైపు పౌరసత్వ ఆందోళనలు, ఎన్ ఆర్సీ నిరసనలతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతికూల సంకేతాలు ఈ రూపంలో కనిపించాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల జాబితా నుంచి తాజాగా జార్ఖండ్ కూడా జారిపోవడంతో బీజేపీ శ్రేణులు నిర్వేదానికి గురి అవుతున్నాయి. 2017లో దేశ భూభాగంలోని 71 శాతం బీజేపీ ఆధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. 2019 డిసెంబర్ నాటికి అది 35 శాతానికి తగ్గిపోవడం రాజకీయ పరిణామాలకు అద్దం పడుతోంది.

దేశంలో 69శాతం జనాభా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉండగా, అదిప్పుడు 43 శాతానికి తగ్గింది. ఈ సంవత్సరం ఏప్రిల్– మే నెలల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన అనంతరం జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలయింది. త్వరలో ఢిల్లీ, బిహార్లలో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని ఆర్జేడీ నేత, లాలూప్రసాద్ తనయుడు తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు.
తమకు తిరుగేలేదని భావిస్తున్న మోడీ-అమిత్ షా ద్వయానికి ఇది చావుదెబ్బలాంటిది. జార్ఖండ్ మహారాష్ట్ర నేర్పిన పాఠంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ పునరాలోచించుకుంటోంది.
వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి పరంపర 2018 నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ల్లో ఓటమి నుంచి ఆరంభమయిందని చెప్పాలి. ఆయా రాష్ట్రాల్లో పట్టున్న సామాజిక వర్గాల నుంచి కాకుండా వేరే వర్గాల నేతలను ప్రోత్సహించే విధానం బీజేపీకి నెగిటివ్ ఫలితాలను అందించిందనే చెప్పాలి.
జార్ఖండ్ లో ఆదివాసీలు, హరియాణాలో జాట్, మహారాష్ట్రలో మరాఠా, జార్ఖండ్లో గిరిజనులు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో పోలిస్తే.. తక్కువ సీట్లనే గెలుచుకోవడంతో బీజేపీ ప్రభావం క్రమేపీ తగ్గుతోంది.
హరియాణాలో జననాయక్ జనతా పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. మహారాష్ట్రలో మిత్ర పక్షం శివసేనతో విభేదాల కారణంగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కోల్పోయింది. మహారాష్ట్ర ప్రభావం దేశం మొత్తం మీద పడబోతోంది.
జార్ఖండ్లో ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే బీజేపీ గ్రాఫ్ ఎలా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం బాగా పడిపోయింది. జార్ఖండ్లో 2019 మేనెలలో బీజేపీ ఓటు శాతం 55 కాగా, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అది 33 శాతానికి తగ్గింది.
హరియాణాలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటుశాతం 58 కాగా, అది శాసనసభ ఎన్నికల నాటికి 36 శాతానికి తగ్గింది. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాఖ్, అయోధ్యలో రామ మందిరం.. తదితర సైద్ధాంతిక హామీలను నెరవేర్చినప్పటికీ.. ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పౌరసత్వ సవరణ బిల్లు, ఎన్నార్సీ ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
7 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
3 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
5 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
10 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
12 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా