newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వలస కూలీల వ్యధ ఇంతింత కాదయా!

10-05-202010-05-2020 11:22:17 IST
Updated On 10-05-2020 20:03:50 ISTUpdated On 10-05-20202020-05-10T05:52:17.518Z10-05-2020 2020-05-10T05:52:04.335Z - 2020-05-10T14:33:50.063Z - 10-05-2020

వలస కూలీల వ్యధ ఇంతింత కాదయా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కూటికోసం, కూలికోసం

పట్టణంలో బ్రతుకుదామని

బయలుదేరిన బాటసారికి

ఎంతకష్టం.. ఎంత కష్టం

నడుస్తున్నా దిక్కుతెలియక-

నడిసముద్రపు నావరీతిగ

సంచరిస్తూ సంచలిస్తూ,

దిగులు పడుతూ, దీనుడౌతూ

గుండుసూదులు గ్రుచ్చినట్లే

శిరోవేదన అతిశయించగ

అప్పుడెప్పెడో మహాకవి శ్రీశ్రీ రాసింది అక్షర సత్యం. ఇప్పుడు వలసకూలీలకు ఎంత కష్టం.. ఎంత నష్టం అంటూ దీనంగా పాడుకోవాల్సిన పరిస్థితి. దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా కారణంగా జీవితాలు ఛిద్రం అయిపోయాయి. మూడవ ప్రపంచయుద్ధం ఎలా వస్తుందోనని ఎదురుచూస్తున్నవారికి కరోనా రూపంలో మహా ప్రళయం ముంచుకొచ్చింది. పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలకు పట్టెడన్నం పెట్టే వారు లేక తమ స్వస్థలానికి పంపేవారు లేక  నానా అవస్థలు పడుతున్నారు. కొంతమంది ఊరికి నడక దారిపడితే మధ్యలో విధి వక్రీకరించింది. ఔరంగాబాద్ సమీపంలో పట్టాలపై నిద్రిస్తున్నవారిపై గూడ్స్ రైలు పగబట్టినట్టయింది. వారి జీవితాలు పట్టాల పరం అయిపోయాయి. 

ఈ విషాదం మరిచిపోకముందే ట్రక్కు బోల్తా పడి... అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు వలస కూలీలు చనిపోయారు. మరో11 మంది గాయాలపాలయ్యారు. నర్సింగపూర్‌లోని పాథా గ్రామంలో రాత్రి వేళ ఈ దుర్ఘటన జరిగింది. తెలంగాణ... హైదరాబాద్ నుంచి ఆ ట్రక్కు... వలస కూలీలు, మామిడికాయలతో ఉత్తరప్రదేశ్‌కి బయలుదేరింది. మామిడికాయలు ఆగ్రాకు తీసుకెళ్లాల్సి ఉంది. ట్రక్కులో 18 మంది వలస కూలీలు ఎక్కారు. వారిలో ఇద్దరు డ్రైవర్లు, ఓ కండక్టర్ ఉన్నారు. వీరిలో ఐదుగురు చనిపోవడం విషాదకరం.

పశ్చిమ బెంగాల్‌లో జార్ఖండ్‌కు చెందిన 20 మంది వలస కార్మికులు రైలు ప్రమాదం నుంచి తప్పించుకుని బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు.  బిర్భూం జిల్లా నుంచి జార్ఖండ్‌కు వెళ్లే రైల్వే ట్రాక్‌ మీదుగా బయల్దేరిన కార్మికులు పూర్వబర్ధమాన్‌ జిల్లాలోని తారాపీఠ్‌ పుణ్యక్షేత్రానికి వెళ్లారు. శుక్రవారం రాత్రి నదిపై ఉన్న వంతెనపై నడుస్తున్నారు. ఇంతలో ఎదురుగా జార్ఖండ్‌లోని పాకూర్‌ నుంచి వస్తున్న ఇన్స్‌పెక్షన్‌ వ్యాన్‌ డ్రైవర్‌ ట్రాక్‌పై వారిని చూసి ఎమర్జెన్సీ బ్రేక్‌ వేసి వ్యాన్‌ ఆపేశాడు. అలా వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు. 

హైదరాబాద్ లోని ఐఐటీలో వలస కార్మికులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం చొరవతో వారంతా శ్రామిక్ రైళ్ళలో తమ స్వస్థలాలకు చేరారు. బీహార్, జార్ఖండ్ కార్మికులదీ అదే దారి అయింది. 

ఏపీలోని పలు ప్రాంతాల్లో వలస కార్మికులది దుర్భర పరిస్థితి.  ఊరురమ్మంటోంది.. లాక్ డౌన్ వద్దంటోంది.  చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణం అతి సమీపంలో ఉన్నటువంటి  రాచగున్నేరు, మల్లవరం చుట్టుపక్కల ప్రాంతాలలో కర్మాగారాలు  అనేక ఉన్నాయి వాటిలో ఎక్కువ శాతం కార్మికులు బయట ప్రాంతాల నుండి వచ్చిన వారే. దాదాపు 1500 మంది దాకా ఉన్నారు వారి కష్టాన్ని వారి శ్రమని వాడు కున్నటువంటి యాజమాన్యం వారు కష్టకాలంలో ఉండేటప్పుడు ఆదుకోవాల్సిందిగా పోయి చేతులు ఎత్తేస్తున్న వైనం.  

కరోనా మహమ్మారి పుణ్యమా అంటూ వీరికి చేయడానికి పని లేక తినడానికి తిండి లేక  పస్తులతో దాతల సహాయం కోసం చేతులు చాచి ఎదురు చూస్తున్నారు. వీరి బాగోగులు చూడవలసిన ఫ్యాక్టరీ యాజమాన్యం మాకు ఎటువంటి సంబంధం లేదంటూ చేతులెత్తేస్తున్నారు. కనీసం వారి స్వస్థలానికి చేర్చడం  మా వల్ల కాదంటున్న ఫ్యాక్టరీ యాజమాన్యం దానికి మాకు ఎటువంటి సంబంధం లేదంటూ చేతులెత్తేస్తున్నారు.దీంతో విసిగిన కార్మికులు యజమాన్యం పై కన్నెర్ర చేసి రోడ్డు పైకి వచ్చి యాజమాన్యం నిరంకుశ వైఖరి నశించాలని దర్న నిర్వహించారు.మమ్మల్ని  ఇటు ప్రభుత్వంగానీ,  యాజమాన్యం గానీ పట్టించుకోకపోవడం అసహనం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ స్వస్థలాలకు మమ్మల్ని పంపించాలని కోరుతున్నారు.

పోలవరం ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్న వలస కూలీలది ఇదే పరిస్థితి. పోలవరం చెక్ పోస్టు వద్ద వలస కూలీలు ఆందోళనకు దిగారు. వివిధ రాష్ట్రాల నుంచి తమను స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతం నుంచి కాలి నడకన బయలు దేరిన 500 మంది కూలీలను పోలీసులు చెక్ పోస్ట్ వద్ద అడ్డుకున్నారు.

దీంతో ఇరు వర్గాల మధ్య తోపు లాట చోటు చేసుకుంది. కార్మికులంతా స్వరాష్ట్రాలకు అనుమతులు వచ్చాయని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పడంతో పరిస్థితి సద్దు మణిగింది.  అయితే వలస కూలీలు ఏదో ఒక విధంగా తమ గ్రామాలకు చేరుకున్నా వారు క్వారంటైన్ సెంటర్లకు వెళ్లక తప్పడంలేదు. కర్నూలు జిల్లాకు చెందిన 487 మంది వలస కూలీలు, మత్స్యకారులు 19 బస్సుల్లో కర్నూలు నుంచి భీమవరంలోని క్వారంటైన్ సెంటర్ కు వెళ్లారు.  చత్తీస్ ఘడ్ కు చెందిన వలస కూలీల బస్ కూడా భీమవరంకు రావడంతో వారిని అధికారులు తిరిగి పంపించారు.

 

 

 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   11 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   13 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   20 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   21 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle