newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వలస కూలీలపై బూటు తన్నులు.. వ్యవస్థ అమానుషత్వానికి తాజా సాక్ష్యం

14-05-202014-05-2020 08:12:06 IST
Updated On 14-05-2020 08:53:11 ISTUpdated On 14-05-20202020-05-14T02:42:06.500Z14-05-2020 2020-05-14T02:42:04.804Z - 2020-05-14T03:23:11.222Z - 14-05-2020

వలస కూలీలపై బూటు తన్నులు.. వ్యవస్థ అమానుషత్వానికి తాజా సాక్ష్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ విభజన తర్వాత అతిపెద్ద ఉత్పాతం కరోనా వెలుగులో 12 కోట్ల మంది వలస కార్మికులపై విరుచుకుపడిందని, ఆదుకునే వారు లేరనే నిరాశతో లక్షలాది మంది వలస కూలీలు రైలు పట్టాలు, రోడ్లమీదుగా వందలాది మైళ్ల దూరం నడుచుకుంటూ తమ స్వస్థలాలకు బయలు దేరుతూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారంటూ అంతర్జాతీయ పత్రికలు భారత్‌లో విషాదం గురించి పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు ప్రచురిస్తున్నాయి. 

కానీ మన దేశంలో మాత్రం ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుని 50 రోజులుగా పలకరించే దిక్కు లేక కాలినడకన వందలాది మైళ్లు నడిచి స్వస్థలాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్న వలస కార్మికుల పట్ల కనీస మానవత్వాన్ని కూడా పాలకులు, పోలీసు యంత్రాంగం ప్రదర్శించలేదని పదే పదే రుజువవుతోంది. 

బెంగళూరులో తాజాగా స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతి కావాలంటూ కేజీ హోలీ పోలీస్ట్‌ స్టేషన్‌కు వెళ్లిన కార్మికులపై స్థానిక అధికారి దుశ్చర్యకు పాల్పడ్డారు. కార్మికుడిపై చేయి చేసుకోవడమే కాకుండా బూటుకాలితో తన్ని పరిగెత్తించారు. ఇదీ దేశంలోని 12 కోట్లమంది వలస కార్మికుల వ్యథల పట్ల మన వ్యవస్థ ప్రదర్శిస్తున్న స్పందన.

లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలురైళ్లను నడుతున్నా.. అనుమతులు లభించక చాలామంది కార్మికులు పడిగాపులు గాస్తున్నారు. పాసుల కోసం వెళ్లగా పలుచోట్ల వలస కార్మికులపై పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారు. 

తాము స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతి కావాలంటూ బెంగుళూరులోని కేజీ హోలీ పోలీస్ట్‌ స్టేషన్‌కు వెళ్లిన కార్మికులపై స్థానిక అధికారి దుశ్చర్యకు పాల్పడ్డారు. కార్మికుడిపై చేయి చేసుకోవడమే కాకుండా బూటుకాలితో తన్ని పరిగెత్తించారు. ఈ వీడియోకాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారడంతో ఉన్నతాధికారులు స్పందించి అతన్ని విధుల్లోనుంచి తొలగించారు. 

సోమవారం జరిగిన ఈ ఘటనపై సీనియర్‌ పోలీస్‌ అధికారి ఎస్‌డీ శరనప్ప మాట్లాడుతూ.. ‘ఉత్తర ప్రదేశ్‌కి చెందిన కొంతమంది వలస కూలీలు స్థానిక పోలీస్‌‌ స్టేషన్‌కు వచ్చారు. తాము స్వస్థలాలకు వెళ్లేందుకు పాసులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. ఈ క్రమంలోనే  ఏఎస్‌ఐ రాజా సాహెబ్‌ వారితో దుర్భాషలాడారు. అంతేకాకుండా చేయి చేసుకుని బూటుకాలితో తన్నారు. పై అధికారుల ఆదేశాల మేరకు  ఏఎస్‌ను సస్పెండ్‌ చేశాము’ అని వివరించారు.

మరోవైపున వలస కూలీలు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వారిని అడ్డుకోవద్దని, వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కేంద్ర హోంశాఖ కోరింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా సోమవారం లేఖ రాశారు. వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లేందుకు సహకరించాలని అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు రాసిన మరో లేఖలో కోరారు. 

వలస కూలీలను సొంతూళ్లకు చేర్చేందుకు అవసరమైన ప్రత్యేక శ్రామిక రైళ్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. వారిని వారి ప్రాంతాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలని హోంశాఖ కార్యదర్శి లేఖలో కోరారు. వలస కూలీలు రోడ్డు మార్గంలో, రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైళ్లు, బస్సులు ఏర్పాటయ్యే వరకు వారికి వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలని స్పష్టంగా తెలిపారు.

కానీ వారికి వసతి, భోజన సౌకర్యం కల్పించడం మాటేమిటో కానీ పాసులిప్పించాలని పోలీసుస్టేషన్‌కు రావడమే నేరం అన్నట్లుగా పోలీసు అధికారి బూటుకాళ్లతో తన్నడం అధికార వ్యవస్థ స్పందనా రాహిత్యానికి ప్రతీకగా మిగిలిపోనుంది.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   12 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   11 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   15 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   18 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   19 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle