newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వలస కార్మికుల తరలింపుపై సోనియాస్త్రం... దిగొచ్చిన కేంద్రం

05-05-202005-05-2020 08:26:17 IST
Updated On 05-05-2020 09:04:15 ISTUpdated On 05-05-20202020-05-05T02:56:17.320Z05-05-2020 2020-05-05T02:56:14.202Z - 2020-05-05T03:34:15.006Z - 05-05-2020

వలస కార్మికుల తరలింపుపై సోనియాస్త్రం... దిగొచ్చిన కేంద్రం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశం తిరిగిరావాలంటే ఎవరి చార్జీలు వారే పెట్టుకోవాలని తేల్చిపడేసిన కేంద్రప్రభుత్వం వలస కార్మికులకు కూడా అదే నిబంధన పెట్టడానికి ప్రయత్నించి ప్రతిపక్షాల అప్రమత్తతతో అభాసుపాలై ఒక్కసారిగా పీచే మూడ్ అనేసింది. వలస కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం టికెట్‌ చార్జీలు వసూలు చేస్తున్నందున, ఇకపై తమ పార్టీయే ఆ మొత్తాన్ని భరిస్తుందంటూ కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ సోమవారం చేసిన ప్రకటన తీవ్రదుమారం చెలరేగింది.  రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వలస కార్మికులకు చార్జీల చెల్లింపు తమ వల్ల కాదని చేతులెత్తేయడంతో కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో వెనకడుగు వేసింది. పైగా వలస కార్మికుల నుంచి రైల్వే టికెట్లకు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం కౌంటర్ ప్రకటించింది. 

దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న కార్మికులకు సోనియాగాంధీ సంఘీభావం ప్రకటిస్తూ సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటన సంచలనం లేకెత్తించింది. ఈ విషయంలో సాయం కోసం ఎదురుచూస్తున్న వలస కార్మికులకు పార్టీ రాష్ట్రాల విభాగాలు  సాయం అందిస్తాయని  ఆమె తెలిపారు. ఈ అంశంపై సీపీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ కూడా స్పందించాయి. ‘పేరులో ఉన్నట్లే పీఎం–కేర్స్‌ నిధి కేవలం ప్రధాని సంబంధీకులదిగా మారింది. వలస కార్మికులను ఎన్నారైలు(నాన్‌ రిక్వైర్డ్‌ ఇండియన్స్‌)’అని పిలవొచ్చని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు కేంద్రమే ఉచితంగా చేర్చాలని కొన్ని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయడం, వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు అయ్యే ఖర్చును తాము భరిస్తామంటూ కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా చేసిన ప్రకటన రాజకీయ దుమారం రేపింది. పీఎం–కేర్స్‌ నిధులను కార్మికుల కోసం వెచ్చించాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. 

అయితే విపక్షం వ్యాఖ్యలపై అధికార బీజేపీ మండిపడింది. స్వస్థలాలకు తరలివెళ్లే వలస కార్మికుల టికెట్‌ ఖరీదులో రైల్వేలు 85 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా మొత్తాన్ని భరిస్తున్నాయని బీజేపీ తెలిపింది. ఈ విషయమై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ మహాపాత్ర, పార్టీ ఐటీ విభాగం బాధ్యుడు అమిత్‌ మాల్వీయ ట్విట్టర్‌లో పలు వ్యాఖ్యలు చేశారు. ‘వలస కార్మికుల కోసం రైల్వే శాఖ శ్రామిక్‌ రైళ్లు నడుపుతోంది. ఏ రైల్వేస్టేషన్‌లోనూ టికెట్లు విక్రయించడం లేదు. టికెట్‌ రుసుములో రైల్వేలు 85 శాతం సబ్సిడీ ఇస్తున్నాయి. మిగతా 15 శాతం రాష్ట్రాలు చెల్లిస్తున్నాయి. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు తమ వంతు చెల్లించేలా ఆ పార్టీ చీఫ్‌ సోనియా సూచించాలి’అని వారు కోరారు.

కార్మికుల నుంచి టికెట్ ఛార్జీలు వసూలు చేయాలని తాము భావించలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వారిని రైళ్లలో తరలించడానికి అయ్యే ఖర్చులో 85 శాతాన్ని కేంద్రమే భరిస్తోందని, 15 శాతాన్ని రాష్ట్రాలు భరించాలని సూచించినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ప్రెస్‌మీట్‌లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనకు ఒకటి రెండు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలు అంగీకారం తెలిపినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రత్యేక రైళ్లు నడపాలని కేంద్రానికి కొన్ని రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయని, ఆ రాష్ట్రాల్లో మాత్రమే ప్రత్యేక రైళ్లకు అనుమతించామని కేంద్రం తెలిపింది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle