వలస కార్మికుల ఇబ్బందులపై కేంద్రానికి సుప్రీం సలహా
29-04-202029-04-2020 11:41:50 IST
Updated On 29-04-2020 12:06:58 ISTUpdated On 29-04-20202020-04-29T06:11:50.766Z29-04-2020 2020-04-29T06:11:43.262Z - 2020-04-29T06:36:58.538Z - 29-04-2020

లాక్ డౌన్ కారణంగా ఎక్కడివారక్కడే ఉండిపోయారు. వివిధ పనుల నిమిత్తం దేశంలోని వివిధ ప్రాంతాలకు వచ్చినవారంతా ఇరుక్కుపోయారు. వలస కార్మికుల ఇబ్బం దులు.. వారు పడుతున్న ఆకలి వేద న.. ఆర్థిక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రానికి సుప్రీం కోర్టు కీలక సలహా ఇచ్చింది. వారికి ఊరటనిచ్చేలా చర్యలు చేపట్టాలని కోరింది. లాక్డౌన్ నేపథ్యంలో లక్షలాది మంది కార్మికు లు స్వస్థలాలకు చేరుకోలేకపోయారని, సరిహద్దు వరకు వచ్చి ఆగిపో యారని, అక్కడి పరిస్థితులను గమనించి.. తాత్కాలికంగా ‘వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు’ను అమలు చేయాలని సూచించింది. ఇలా చేయడంతో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలు సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలు పొందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. జూన్ నుంచి ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు విధానా న్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నామని సుప్రీం కోర్టు తెలపడంతో వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుందో చూడాలి. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా.. వలస కార్మికులను ఆదుకునేందుకు తీసుకురావాలని భావిస్తున్న ఈ పథకాన్ని వెంటనే అమలు చేసేలా చూడాలని కోరుతూ.. న్యాయవాది రీపక్ కన్సల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో అమలు చేస్తే.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి ఇది ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందని పిటిషన్లో ప్రస్తావించారు. వన్ నేషన్.. వన్ రేషన్ విధానం అమలుచేస్తే లాక్డౌన్ కారణంగా చాలా మంది సొంత రాష్ట్రాల్లో లేరని వివరించారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉన్నా.. పునరావాస కేంద్రంలో ఉన్నా.. ఆకలితో బాధపడ కుండా ఉండేందుకు స్థానిక గుర్తింపు కార్డు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు తమ తమ ఓటర్లు, పౌరులకు ప్రాధాన్యత ఇస్తున్నారని, వలస కార్మికులకు మాత్రం సబ్సిడీపై ఆహార ధాన్యాలు, భోజనం, షెల్టర్, వైద్య సదుపాయాలు ఇవ్వడం లేదని తెలిపారు. కొన్ని రాష్ట్రాలు వలస కార్మికులకు తగిన సదుపాయాలు కల్పిస్తూనే వుంది. తెలంగాణలో వలస కార్మికులకు ఐదువందలు, 5 కిలోల బియ్యం అందిస్తోంది. ఏపీలోనూ వలస కార్మికులకు ఆహారం అందిస్తోంది ప్రభుత్వం. సూరత్ లో వలస కార్మికుల ఆందోళన లాక్డౌన్ సందర్భంగా మూత పడిన అనేక కంపెనీలు, దుకాణాలు కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదు. ఫలితంగా వలస కార్మికులు సొంతూర్లకు పయనమయ్యారు. బస్సులు, రైళ్లు లేకపోవడంతో వారు చిక్కుకు పోయారు. ఎటు వెళ్లాలో తెలీక అక్రమమార్గంలో రాష్ట్రాల సరిహద్దులు దాటుతూ పోలీసులకు చిక్కుతున్నారు. వారిని క్వారంటైన్లకు తరలిస్తున్నారు పోలీసులు. ముంబై, కోల్ కతా లాంటి చోట్ల రోడ్లమీదకు వచ్చి వారు నిరసనకు దిగుతున్న సంగతి తెలిసిందే. తమను సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ వందలాదిమంది కార్మికులు గుజరాత్‌లోని సూరత్‌లో మంగళవారం ఆందోళనలు నిర్వహించారు. తమ ఆకలి బాధలు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్మికులు రోడ్లపై బైఠాయించారు. సూరత్‌లోని కజోర్ ఏరియాలో నిర్మాణం జరుగుతున్న 'డైమండ్ బోర్స్ కాంప్లెక్స్' స్థలం వద్ద బైఠాయించారు. అధికా రుల అత్యుత్సాహంతో నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. కొందరు వలస కార్మికులు రాళ్లు రువ్వారు. పోలీసులు అక్కడకు వచ్చి, వారిని హెచ్చరించారు. సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వందలాదిమంది వలస కార్మికులు రైల్వే ట్రాకులపై ఆందోళన చేశారు. ఇళ్లకు వెళ్లిపోవాలంటూ పోలీసులు వారిని నెట్టివేసేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
12 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
8 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
11 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
15 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
18 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
19 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా