newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వరవరరావుకి మెరుగైన వైద్యం అందించాలి.. మహారాష్ట్ర సీఎంకి ఎంపీల లేఖ

19-06-202019-06-2020 18:28:16 IST
Updated On 19-06-2020 20:15:38 ISTUpdated On 19-06-20202020-06-19T12:58:16.333Z19-06-2020 2020-06-19T12:56:08.510Z - 2020-06-19T14:45:38.346Z - 19-06-2020

వరవరరావుకి మెరుగైన వైద్యం అందించాలి.. మహారాష్ట్ర సీఎంకి ఎంపీల లేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.  ప్రధాని మోడీకి కుట్ర కేసులో పుణె పోలీసులు అతనిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది నుంచి జైలులోనే ఉంచి.. బెయిల్ కూడా ఇవ్వడం లేదు. తలోజా జైలులో ఉన్న వరవరరావు ఆరోగ్యం మెరుగుపడేందుకు మెరుగైన వైద్యం అందించాలని 14 మంది ఎంపీలు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరేకు లేఖ రాశారు. ఇటీవల వరవరరావు ఆరోగ్యం క్షీణించిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక కోర్టు నివేదిక కోరింది. ముంబై జేజే హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌కు ప్రత్యేక కోర్టు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని, 81 ఏళ్ళ వయసులో వివిధ ఆరోగ్యసమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారని 14 మంది ఎంపీలు మహారాష్ట్ర సీఎంకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఉద్దవ్ థాకరేకు లేఖ రాసిన ఎంపీలు డీఎంకె ఎంపీ కనిమొళి కరుణానిధి, డా.సుమతి తమిజహచి, రాజ్యసభ ఎంపీ తిరుచ్చి శివ, కాంగ్రెస్ ఎంపీలు, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి,  కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీసీకె ఎంపీ లు ఎం.సెల్వరాజ్, డా.థోల్ తిరుమా వలవన్, డా. రవికుమార్ , ఆర్ జెడి ఎంపీ ప్రొఫెసర్ డా. మనోజ్ ఝా, సీపీఐ ఎంపీలు కెకె రాగేష్,  పీఆర్ నటరాజన్, కె.సుబ్బరాయన్, ఎస్. వెంకటేశన్ వున్నారు. 

https://www.photojoiner.net/image/EWGl2Cdu

గత నెల 29వ తేదీన . ముంబై  జైలులో ఉన్న వరవరరావు పరిస్థితి విషమంగా ఉండటంతో ముంబయి తలోజా జైలు నుంచి JJ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని ముంబయి పోలీసులు చిక్కడపల్లి పోలీసుస్టేషన్ కు తెలిపారు. పోలీసులు వరవరరావు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

రాజీవ్‌గాంధీ హత్య తరహాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని హత్య చేయటానికి నక్సలైట్లు కుట్ర పన్నిన విషయం వెల్లడైందని తెలిపారు. 2018 ఆగస్టు 28న.. విప్లవ రచయితల సంఘం నేత పెండ్యాల వరవరరావు సహా.. పలువురు హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, రచయితల ఇళ్లల్లో మహారాష్ట్ర పోలీసులు సోదాలు చేశారు. హైదరాబాద్ నుంచి వరవరరావును అరెస్ట్ చేసి తమతో పాటు పుణె తీసుకెళ్లారు. భీమాకోరేగావ్ అల్లర్లకు సంబంధించి జూన్‌లో అరెస్టు చేసిన వారిలో కొందరు మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారని.. వారంతా ప్రధానమంత్రి మోదీ హత్యకు కుట్ర పన్నారని.. వారికి వరవరరావు ఆర్థికంగా సహకరిస్తున్నారని మహారాష్ట్ర పోలీసుల అభియోగం మోపిన సంగతి తెలిసిందే. 

వరవరరావుతో పాటు జైలులో వీల్ చైర్ లో వున్న ప్రొఫెసర్ సాయిబాబా 90 శాతం వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారని, మెరుగైన వైద్యం అందించాలని ఎంపీలు కోరారు. 

 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle