వరదలతో అసోం విలవిల.. 34మంది మృతి
03-07-202003-07-2020 18:47:17 IST
Updated On 03-07-2020 20:13:39 ISTUpdated On 03-07-20202020-07-03T13:17:17.082Z03-07-2020 2020-07-03T13:16:52.500Z - 2020-07-03T14:43:39.177Z - 03-07-2020

భారీవర్షాలు, వరదలతో ఈశాన్య రాష్ట్రం అసోం అతలాకుతలం అవుతోంది. గత సోమవారం నుంచి కురుస్తున్న వానలతో 22 జిల్లాల్లో 16 లక్షల మంది వరదల్లో చిక్కుకుపోయారని విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించింది. రెండురోజులుగా కురిసిన వర్షాలకు ఒకరు మరణించారని, దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 34కు చేరిందని వెల్లడించింది. రాష్ట్రంలోని 4.62 లక్షల మందిపై వరదల ప్రభావం చూపిస్తోంది. మరో నాలుగు రోజులపాటు పిడుగులతోకూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతవరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షాలలో వరదలు పోటెత్తడంతో రాష్ట్రంలోని ధెమాజి, లఖీంపూర్, బిశ్వనాథ్, దరాంగ్, నల్బరి, బార్పెటా వంటి 22 జిల్లాల్లో 16,03,255 మంది వరదల్లో చిక్కుకుపోయారని తెలిపింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 162 పునరావాస కేంద్రాల్లో 21 వేలమంది వున్నారని అధికారులు తెలిపారు. భారీవర్షాల వల్ల నదులు ఉప్పొంగి వరదలు వెల్లువెత్తడంతో జాతీయ వనాల్లోని వన్యప్రాణులు విలవిలలాడుతున్నాయి. అసోంలోని కజిరంగా, మనాస్, పొబితొర అభయారణ్యాల్లోకి వరదనీరు పోటెత్తింది. దీంతో జాతీయ వనాల్లోని వన్యప్రాణులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదబారిన పడిన వన్యప్రాణులను 183 వన్యప్రాణుల శిబిరాలకు తరలించామని అసోం రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల సంస్థ తెలిపింది. వన్యప్రాణులకు ఆహారకొరత ఏర్పడిందని, ప్రభుత్వం వాటి రక్షణకు అన్ని చర్యలు చేపట్టిందని అధికారులు తెలిపారు. టిన్ సుకియా, గుజ్జాన్ ప్రాంతాల్లోని గ్రామాల్లో వరదనీరు పోటెత్తడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
15 minutes ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
42 minutes ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
4 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
2 hours ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
5 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
18 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
a day ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
20 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
a day ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
a day ago
ఇంకా