newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లిక్కర్‌పై అధిక పన్ను.. దేశానికి మా విరాళం అంటున్న మందుబాబులు

06-05-202006-05-2020 10:38:46 IST
Updated On 06-05-2020 10:40:28 ISTUpdated On 06-05-20202020-05-06T05:08:46.340Z06-05-2020 2020-05-06T05:08:44.580Z - 2020-05-06T05:10:28.988Z - 06-05-2020

 లిక్కర్‌పై అధిక పన్ను.. దేశానికి మా విరాళం అంటున్న మందుబాబులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మీరే దేశ అర్థిక వ్యవస్థని కాపాడేది అంటూ మందుబాబులపై ఓ వ్యక్తి పూల వర్షం కురిపించాడు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మందుబాబులే ప్రభుత్వ ఖజానాని నింపేది అంటూ న్యూఢిల్లీలో చందేర్‌ నగర్‌లోని ఓ వైన్‌ షాప్‌ ఎదుట భారీ లైన్‌లో నిల్చున్న మందుబాబులపై పూలు చల్లాడు. మరోవైపు భారీ లైన్లలో లిక్కర్‌ కోసం మండుటెండలో నిల్చున్న మందుబాబులపై మిర్జాపూర్‌లో ఓ లిక్కర్‌ షాప్‌ యజమాని పూలు చల్లాడు.

కాగా, లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యపాన ప్రియులు పండగ చేసుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా మద్యం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. దాదాపు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడారు. ఇక మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అమలు అవ్వడంలేదు.

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ సడలించిన అనంతరం మంగళవారం రెండో రోజు కూడా దేశ రాజధాని ఢిల్లీలో మద్యం దుకాణాల వద్ద భారీ క్యూలు కొనసాగాయి. కేజ్రీవాల్‌ సర్కార్‌ మద్యం ధరల ఎమ్మార్పీపై ఏకంగా 70 శాతం ధరలు పెంచినా పొడవాటి క్యూలు ఏమాత్రం తగ్గలేదు. ఉదయం 9 గంటలకు మద్యం షాపులు తెరిచే క్రమంలో తెల్లవారుజామున 4 గంటల నుంచే మందు బాబులు షాపుల ముందు క్యూ కట్టారు.

భౌతిక దూరం పాటించాలనే నిబంధనను వారు ఏమాత్రం ఖాతరుచేయడం లేదు. పలు చోట్ల గుంపులను కంట్రోల్‌ చేసేందుకు పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. 

లిక్కర్‌పై కరోనా పన్నును చెల్లించడం తమకు భారమేమీ కాదని, ఇది తమ నుంచి దేశానికి విరాళం లాంటిదేనని షాపుల ఎదుట బారులు తీరిన కొందరు మద్యం ప్రియులు చెప్పుకొచ్చారు. మద్యంపై 70 శాతం అదనపు పన్నును మంగళవారం నుంచి స్పెషల్‌ కరోనా ఫీజుగా వసూలు చేస్తామని కేజ్రీవాల్‌ సర్కార్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఆంద్రప్రదేశ్‌లో కూడా ప్రభుత్వం ఇప్పటికే రెండు రోజుల్లో రెండు దఫాలుగా లిక్కర్ ధరలను 75 శాతం పెంచడం తెలిసిందే.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle