లాక్ డౌన్ 2.O కొత్త మార్గదర్శకాలు ఇవే!
17-04-202017-04-2020 13:19:43 IST
Updated On 17-04-2020 13:44:31 ISTUpdated On 17-04-20202020-04-17T07:49:43.188Z17-04-2020 2020-04-17T07:46:16.160Z - 2020-04-17T08:14:31.261Z - 17-04-2020

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం ఈనెల 14 నుంచి మరోమారు లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. ఇటీవల డుదల చేసిన మార్గదర్శకాలకు మరికొన్ని అంశాలను జోడిస్తూ కేంద్రం హోంశాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ రంగానికి రిలీఫ్ కల్పించే తాజా ఉత్తర్వుల పట్ల గ్రామీణ ప్రాంతాలలో హర్షం వ్యక్తం అవుతోంది. కరోనా వ్యాప్తి నియంత్రణకు పీయం మోదీ దేశంలో రెండోదశ లాక్ డౌన్ ప్రకటించిన రెండోరోజే కొన్నింటికి మినహాయింపులు ఇస్తూ కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని సవరించి మరిన్నింటికి మినహాయింపు ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తాజాగా మరో స్టేట్ మెంట్ ఇచ్చారు. అన్ని శాఖలు, విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే నిర్మాణ పనులు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం పనులు, విద్యుత్ లైన్లు, టెలిఫోన్ లైన్లు, ఆప్టిక్ ఫైబర్ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన అన్ని కార్యకలాపాలకు తాజా మార్గదర్శకాలలో కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలకు, సహకార రుణ సంస్థలకు, తక్కువ సిబ్బందితో కార్యకలాపాలు సాగించే విత్త సంస్థలకు తాజా గైడ్ లైన్స్ లో లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. తాజా గైడ్ లైన్స్ లో గిరిజన ప్రాంతాల్లో జరిగే కార్యకలాపాలకు మినహాయింపు ఇచ్చారు. అటవీ ఉత్పత్తుల సేకరణ, పంటల సాగు, కలప సేకరణ వంటివి వ్యవసాయ సంబంధిత కార్యకలాపాల్లో చేర్చారు. సుగంధ ద్రవ్యాలు సాగు..కొబ్బరి, వెదురు, కోకో, సుగంధ ద్రవ్య దినుసుల సాగు, శుద్ధి చేయడం, ప్యాకేజి, మార్కెటింగ్, అమ్మకాలు వంటి కార్యకలాపాలకు తాజాగా మినహాయింపు ఇచ్చారు. అలాగే కాఫీ, తేయాకు తోటల్లో 50 శాతం మ్యాన్పవర్కు అనుమతి లభించింది. రాష్ట్ర సరిహద్దులు దాటేందకు వ్యక్తులను అనుమతి నిరాకరించింది. అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి వుంటుంది. జాతీయ ఉపాధిహామీ పనులకు , ఆక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతి లభించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్ల కార్యకలాపాలకు, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు దుకాణలకు అనుమతి వుంటుంది. వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చే సంస్థలకు, అనాథ, దివ్యాంగ, వృద్ధ ఆశ్రమాల నిర్వహణకు అనుమతి వుంటుంది. వీటికి తోడు భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతులు లభించాయి. నిర్మాణ రంగ పనులకు స్థానికంగా ఉన్న కార్మికులకు మాత్రమే అనుమతిస్తారు. రాజకీయ సమావేశాలు, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుంది. వివాహాలు, శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి వుంటుంది.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
an hour ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
an hour ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
4 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
3 hours ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
5 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
19 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
a day ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
20 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
16-04-2021

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
a day ago
ఇంకా