newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

లాక్ డౌన్ సడలింపులు మంచివి కావా?

04-05-202004-05-2020 10:41:51 IST
Updated On 04-05-2020 11:58:38 ISTUpdated On 04-05-20202020-05-04T05:11:51.596Z04-05-2020 2020-05-04T05:11:41.899Z - 2020-05-04T06:28:38.641Z - 04-05-2020

లాక్ డౌన్ సడలింపులు మంచివి కావా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనా తర్వాత అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కేసులు ప్రస్తుతం 40 వేలు దాటాయి. తాజాగా రికార్డు స్థాయిలో ఒక్కరోజులో 83 మంది కరోనా వల్ల తుదిశ్వాస విడిచారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు.. 24 గంటల వ్యవధిలో ఈ మరణాలు చోటుచేసుకున్నాయి. అలాగే కొత్తగా 2,487 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం అంటున్నారు అధికారులు.

మొత్తం మరణాల సంఖ్య 1,306కు, పాజిటివ్‌ కేసుల సంఖ్య 40,263కు చేరిందని కేంద్రం ఆదివారం ప్రకటించింది. దేశంలో యాక్టివ్‌ కరోనా కేసులు 28,070. ఇప్పటివరకు 10,886 మంది బాధితులు చికిత్సతో కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.  మార్చి 22 నుంచి ఇవాళ్టి వరకూ లాక్ డౌన్ అమలులోనే వుంది. కానీ కేసుల సంఖ్య భారీగా పెరగడం పరిస్థితికి అద్దం పడుతోంది. 

22మార్చి , 2020 - 341 కేసులు 7 మరణాలు  

4 మే, 2020-  42వేేల కేసులు, 1373 మరణాలు 

దేశంలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్రం మూడవ దశ లాక్ డౌన్ ఇవాళ్టి నుంచి అమలులోకి తెచ్చింది. అయితే కరోనా వైరస్ వీరవిహారం చేస్తున్న వేళ  లాక్‌డౌన్‌ సడలింపులపై డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికలు జారీచేసింది. లాక్‌డౌన్ వంటి చర్యలు‌ మాత్రమే కరోనాను కట్టడి చేస్తాయని, భారత్‌, అమెరికా‌ లాంటి దేశాలు ఆంక్షలు సడలిస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటోంది. జనం వివిధ సడలింపుల పేరుతో రోడ్లమీదకు వస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని, కరోనా వైరస్ మరింత విస్తరిస్తే పరిస్థితి చేయిదాటిపోతుందని డబ్ల్యుహెచ్ వో హెచ్చరిస్తోంది. 

కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు సడలింపులు వద్దంటోంది. ఈ విషయంలో పాలకులు బాగా ఆలోచించుకోవాలంటోంది. పలు దేశాల్లో లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తోన్న విషయంపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆయా దేశాలకు పలు హెచ్చరికలు చేసింది. కరోనా విజృంభణ అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరం, లాక్‌డౌన్ వంటి చర్యలు‌ మాత్రమే కరోనాను కట్టడి చేస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగ సీనియర్‌ అధికారి డాక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు.

భారత్‌తో పాటు అమెరికా‌ లాంటి దేశాలు ఒకవేళ నిబంధనలను సడలిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటాయని చెప్పారు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించవద్దని హెచ్చరించారు. కాగా, కరోనా వైరస్‌ను‌ కట్టడి చేయడానికి ప్రస్తుతం పలు దేశాలు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని తెలిపారు.ఇటువంటి సమయంలో వైరస్‌ ప్రభావం లేని ప్రాంతాల్లో నిబంధనలు ఎత్తివేడం వల్ల మళ్లీ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని చెప్పారు. 

ఆయా దేశాల్లో లాక్‌డౌన్ నిబంధనల్ని ఎత్తివేసే విషయంపై బాగా ఆలోచించు కోవాలని తెలిపారు. లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్న చాలా దేశాల్లో కేసులు ఒక్కసారిగా పెరిగాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల్లో అధికంగా ఉన్నాయన్నారు.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle