లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!
06-04-202006-04-2020 08:51:54 IST
Updated On 06-04-2020 09:00:55 ISTUpdated On 06-04-20202020-04-06T03:21:54.731Z06-04-2020 2020-04-06T03:21:50.456Z - 2020-04-06T03:30:55.107Z - 06-04-2020

కరోనా వైరస్ భయంతో లాక్ డౌన్ లో బలవంతంగానైనా పాల్గొంటున్నారు కోట్లాదిమంది. లాక్ డౌన్ వల్ల జనజీవనం స్తంభించిపోతోంది. కరోనా మహమ్మారి మనదేశంలో మరింత విజృంభిస్తూనే ఉంది. కాగా.. ప్రజలు అత్యంత సురక్షితమైన, అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాను సీఎన్ఎన్ ప్రచురించింది. సీఎన్ఎన్ వెల్లడించిన వివరాల మేరకు అత్యంత ప్రమాదకర దేశాల్లో తొలి మూడు స్థానాల్లో ఇటలీ, ఇండొనేషియా, స్పెయిన్ ఉండగా.. ఆ తర్వాత స్థానంలో ఇరాక్, ఇరాన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, యూఎస్ఏ, యూకే, ఫిలిప్పీన్స్ దేశాలు ఉన్నాయి. సురక్షితమైన దేశాలు: ఇజ్రాయిల్, సింగపూర్, స్లోవేకియా, న్యూజిలాండ్, హాంకాంగ్, తైవాన్, హంగేరి, ఆస్ట్రియా, జర్మనీ, గ్రీన్ ల్యాండ్లు ఉన్నాయి. ఇదే సమయంలో కరోనా వ్యాధి సోకితే అత్యుత్తమ చికిత్సా విధానాలు ఉన్న దేశాల జాబితాను పరిశీలిస్తే.. సింగపూర్, సౌత్ కొరియా, హాంకాంగ్, చైనా, జపాన్, జర్మనీ, ఆస్ట్రియా, యూఏఈ, బెహరై, తైవాన్ దేశాలు ఉన్నాయి. ఇక భారతదేశం.. ప్రమాదకర జాబితాలోనూ లేదు. సురక్షితమైన దేశాల్లోనూ లేదు. కాబట్టి ఇది మరింత డేంజరస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటికే కరోనా వైరస్ మరింత ప్రబలుతూనే ఉంది. దీని బట్టి కేసులు ఎక్కువై ప్రమాదకర స్థితిలోకి వెళ్లినా అతిశయోక్తి లేదు. లాక్ డౌన్ వల్ల ప్రకృతికి, పర్యావరణానికి, వన్యప్రాణులకు మాత్రం మంచే జరుగుతోందని చెప్పాలి. నిత్యం రణగొణ ధ్వనులతో కాలుష్య కాసారంగా మారిన దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం స్థాయి బాగా తగ్గిపోయింది. స్వచ్ఛమయిన గాలి జనం పీల్చుకోగలుగుతున్నారు. లాక్ డౌన్ కారణంగా రోడ్ల మీద వాహనాలన్నీ ఆగిపోయాయి. అత్యవసర వాహనాలు, మీడియా, పోలీస్, నిత్యావసరాలు, మందులు సరఫరా చేసే వాహనాలే తిరుగుతున్నాయి. ఆకాశంపై విమానాలు తిరగటం ఆగిపోయాయి, రైలు నడవడం లేదు. ఈ మహమ్మారి కారణంగా నగరాల్లోను, పట్టణాల్లోను రద్దీ తగ్గింది. కాలుష్యం కూడా తగ్గింది. భూమి కంపనాల తీవ్రతలో గణనీయంగా తగ్గినట్టు భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా భూ గ్రహం నిశ్చల స్థితిలో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బెల్జియంలోని రాయల్ అబ్జర్వేటరీలో భూవిజ్ఞాన శాస్త్రవేత్త, భూకంప శాస్త్రవేత్త థామస్ లెకోక్ మాట్లాడుతూ ఈ మహమ్మారి కారణాంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి దేశ రాజధాని బ్రస్సెల్స్ ప్రాంతంలో భూకంప శబ్దంలో 30 నుంచి 50 శాతం తగ్గినటు గుర్తించాం అని సిఎన్ఎన్ నివేదికలో వెల్లడించారు. తాజా పరిస్థితి కారణంగా వినికిడి శక్తి బాగా పెరిగింది. చిన్న శబ్దాలు కూడా బాగా వినగలుగుతున్నాం. ఈ మహమ్మారి కారణంగా అందరు ఇళ్లకు పరిమితం అవ్వటం, రద్దీ తగ్గటం వల్ల భూకంపనాల కదలికల్లో గణనీయంగా తగ్గుదల కనిపించింది. ఈ మహమ్మారిని నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు ఇంట్లో ఉండటం మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు. మరోవైపు గంగా నదిలో కాలుష్య ఉద్గారాలు చేరడం బాగా తగ్గింది. 21 రోజుల పాటు లాక్డౌన్ విధించడంతో.. గంగా నదిలో కాలుష్యం తగ్గిందని బెనారస్ హిందు విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ప్రొఫెసర్ పీకే మిశ్రా తెలిపారు. లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా పరిశ్రమలు మూతబడ్డాయి. అయితే పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాలతో గంగా నదిలో కొంతమేరకు కాలుష్యం ఏర్పడుతుంటుంది. ఇప్పుడు పరిశ్రమలు మూతబడటంతో.. ఆ కాలుష్యం శాతం తగ్గింది. గంగా నదిని కలుషితం కావడానికి 10శాతం కారణం పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలే కారణమని అందరికీ తెలిసిందే. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా అన్ని పరిశ్రమలు మూతబడ్డాయి. దీంతో పరిస్థితి కాస్త మెరుగుపడిందని, గంగా నదిలో ఎంతో మార్పు వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గంగా నదిలో ఎంతో మార్పు కనిపిస్తుందని స్థానికులు కూడా అంటున్నారు. ప్రస్తుతం నీళ్లు శుభ్రంగా కనిపిస్తున్నాయని.. పరిశ్రమలు మూతపడటమే ఇందుకు ప్రధాన కారణమని వాళ్లు చెబుతున్నారు. నదిలో ఎవరు స్నానం చేయడం లేదని.. ఇలాగే మరో పది రోజులు కొనసాగితే.. మళ్లీ పాత గంగా నదిని చూస్తామని అనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు. అప్పుడప్పుడు వర్షాల వల్ల కూడా గంగా నది శుభ్రం అవుతోంది. ఇటు హైదరాబాద్ లోనూ కాలుష్యం భారీగా తగ్గిందని పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
3 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
4 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
4 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
8 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
9 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
7 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
9 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
10 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
5 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
12 hours ago
ఇంకా