newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లాక్ డౌన్ పై మోడీ ప్రకటన..... దశలవారీగా ఎత్తివేస్తాం

08-04-202008-04-2020 17:52:28 IST
Updated On 08-04-2020 18:09:22 ISTUpdated On 08-04-20202020-04-08T12:22:28.836Z08-04-2020 2020-04-08T12:21:56.357Z - 2020-04-08T12:39:22.036Z - 08-04-2020

లాక్ డౌన్ పై మోడీ ప్రకటన..... దశలవారీగా ఎత్తివేస్తాం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తి వేసే ఆలోచన లేదు..ఒకేసారి లాక్ డౌన్ ఎత్తివేయలేం..కరోనా తరువాత పరిస్థితులు మునుపటిలా ఉండవన్నారు ప్రధాని మోడీ.  ఒకేసారి లాక్ డౌన్‌ని ఎత్తివేసి కొత్త ప్రమాదాన్ని కొనితెచ్చుకోలేమని ఆయన అన్నారు. బుధవారం పలు రాజకీయ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలతో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా భేటీ అయ్యారు. అన్ని పార్టీలు లాక్ డౌన్ కొనసాగించాలని అభిప్రాయానికి వచ్చాయి. 

ఈ సందర్భంగా లాక్ డౌన్ ఎత్తివేతపై పలువురు పలు రకాల సలహాలు, సూచనలు చేసినప్పటికీ.. మెజారిటీ పక్షాలు లాక్ డౌన్ కొనసాగింపునకే మొగ్గు చూపాయి.ఈ సందర్భంగా పలు మార్లు తన అభిప్రాయాలను పార్లమెంటరీ పార్టీల నేతలతో పంచుకున్న మోదీ.. ఏప్రిల్ 14వ తేదీన లాక్ డౌన్ ఎత్తివేసే ఆలోచన లేదని హింట్ ఇచ్చారు.  ఒకే సారి లాక్ డౌన్ ఎత్తివేయలేమని, లాక్ డౌన్ ఎత్తివేతపై వస్తున్న సలహాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటున్నామని వ్యాఖ్యానించారు..

ఈ అంశంపై ముఖ్యమంత్రులందరితో సంప్రదించాల్సి ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 14వ తేదీలోగా మరోసారి ముఖ్యమంత్రులతో భేటీ అయ్యే అవకాశాలున్నట్లు సంకేతాలిచ్చారు.కరోనా తర్వాత పరిస్థితులు మునుపటిలాగా సాధారణంగా ఉండవని, కరోనాకు ముందు, కరోనాకు తరువాత అనే రకంగా పరిస్థితి ఉంటుందని మోదీ వ్యాఖ్యానించారు. ఈక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీలు పరస్పరం భిన్నమైన అభిప్రాయాన్ని ప్రధాని ముందుంచాయి. దీనిపై ప్రధాని నిర్ణయం తీసుకోనున్నారు. 

లాక్ డౌన్‌ను కనీసం మరో రెండు వారాల పాటు అంటే ఏప్రిల్ నెలాఖరుదాకా కొనసాగించాలని తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ మోడీ ముందు అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే.. కరోనా కేసులు లేని చోట్ల లాక్ డౌన్‌ను ఎత్తివేసి.. హాట్ స్పాట్లలో మరింత పకడ్బందీగా లాక్ డౌన్ కొనసాగించాలని ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి  ప్రధాన మంత్రిని కోరారు. 

వీడియో కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ గులాం నబీ ఆజాద్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుదీప్‌ బంధోపాధ్యాయ్‌, శివసేన నుంచి సంజయ్‌ రౌత్‌, బిజు జనతాదళ్‌ నుంచి పినాకీ మిశ్రా, బహుజన్‌ సమాజ్‌ పార్టీ నుంచి ఎస్‌సీ మిశ్రా, ఎన్సీపీ నుంచి శరద్‌ పవార్‌, సమాజ్‌వాదీ పార్టీ నుంచి రామ్‌ గోపాల్‌ యాదవ్‌, శిరోమణి అకాలీదళ్‌ నుంచి సుఖ్బీర్‌ సింగ్‌ బారల్‌, జనతాదళ్‌ నుంచి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ సహా ఇతర పార్టీల ఎంపీలు పాల్గొన్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle