newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

లాక్ డౌన్ పై ప్రధాని వ్యూహం.. అలా చేయొద్దంటున్న వాణిజ్యశాఖ

13-04-202013-04-2020 17:16:46 IST
Updated On 13-04-2020 19:08:05 ISTUpdated On 13-04-20202020-04-13T11:46:46.637Z13-04-2020 2020-04-13T11:46:25.141Z - 2020-04-13T13:38:05.893Z - 13-04-2020

లాక్ డౌన్ పై ప్రధాని వ్యూహం.. అలా చేయొద్దంటున్న వాణిజ్యశాఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ మరికొద్ది గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎన్నిచోట్ల పొడిగించాలి, మిగిలిన చోట్ల ఎలాంటి నిబంధనలు విధించాలనే విధివిధానాలను రూపొందించే పనిలో కేంద్రం బిజీగా వుంది. ప్రధాని నివాసం లో హైలెవల్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. లాక్‌డౌన్ కొనసాగింపు పై కీలక సమీక్ష నిర్వహించారు.  ఈసమావేశానికి కేంద్ర హోం, రక్షణ, ఆరోగ్య శాఖ మంత్రులు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. 

ఇప్పటికే వివిధ రాష్ట్రాల సీఎంలు లాక్‌డౌన్ కొనసాగిస్తామని ప్రకటించడంతో కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో పాక్షిక సడలింపులు ఇచ్చే ఆలోచనలో కేంద్రం వుందని తెలుస్తోంది. ప్రస్తుత సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రధాని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. లాక్ డౌన్ సదలింపు పై కేంద్ర హోంశాఖకు కీలక సూచనలు చేసింది కేంద్ర వాణిజ్య శాఖ.

ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎంలతో లాక్ డౌన్ పై చర్చించిన ప్రధాని మోడీ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే తెలంగాణతో సహా లాక్ డౌన్ పొడిగించాయి కొన్ని రాష్ట్రాలు. మరోవైపు లాక్ డౌన్ నిబంధనలు ఇలానే కొనసాగితే దేశం ఆర్థికంగా తీవ్రమైన నష్టాలను భరించాల్సి వస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి  కేంద్ర హంశాఖకు లేఖ రాశారు. వాణిజ్య కార్యకలాపాలకు అనుమతించి, కొంతమేరకు లాక్ డౌన్ నిబంధనలు సడలించాలనీ ఆ లేఖలో వాణిజ్య శాఖ కార్యదర్శి కోరారు. కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు లాక్ డౌన్ అనివార్యమే అయినప్పటికీ, ఇప్పుడు అమలు చేస్తున్న నిబంధనలను కొనసాగిస్తే దేశం తీవ్రంగా నష్టపోతుందని, లాక్ డౌన్ నిబంధనలను సడలించి, వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించుకునేందుకు అనుమతించాలని కేంద్ర వాణిజ్య శాఖ కోరింది. 

ఈ మేరకు కొన్ని సలహాలు, సూచనలతో హోమ్ శాఖకు ఓ లేఖను రాసింది. రక్షణాత్మక చర్యలు పూర్తి స్థాయిలో తీసుకుంటూ, వాహన, టెక్స్ టైల్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఫ్యాక్టరీలను  తెరిచేందుకు అనుమతించాలని సిఫార్సు చేసింది. కాగా, ఇప్పటికే 21 రోజులు అమలైన లాక్ డౌన్ ను నెలాఖరు వరకూ పొడిగిస్తూ, నేడు ప్రధాని మోదీ నిర్ణయాన్ని ప్రకటిస్తారని భావిస్తున్న వేళ, వాణిజ్య శాఖ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

లాక్ డౌన్ పై తుది నిర్ణయం తీసుకునే ముందు తమ  సలహాలు పరిశీలించాలని ఆ లేఖలో కోరింది. జాతీయ ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు, ప్రజల వద్ద ద్రవ్య లభ్యత పెంచేందుకు కొన్ని సడలింపులు ఉండాలి  అని పేర్కొంది. కాగా,  వ్యవసాయ శాఖ సైతం ఇదే విధమైన సూచనలతో హోమ్ మంత్రిత్వ శాఖను కోరి వుండవచ్చని, వ్యవసాయం అత్యంత కీలకమని, పంట చేతికి వచ్చే ఈ సమయంలో వ్యవసాయ కార్యకలాపాలకు ఆటంకం లేకుండా చూడాల్సివుందని కూడా పరిశ్రమల శాఖ ఆ లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో మోడీ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle