newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లాక్ డౌన్ పై పార్లమెంటులో రాజకీయ రచ్చ..

17-09-202017-09-2020 12:03:26 IST
2020-09-17T06:33:26.452Z17-09-2020 2020-09-17T06:27:48.440Z - - 11-04-2021

లాక్ డౌన్ పై పార్లమెంటులో రాజకీయ రచ్చ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అయిపోయిన పెళ్లికి బాజాలన్నట్లుగా ఉంది... పార్లమెంటులో లాక్ డౌన్ పై అధికార విపక్షాల మధ్య జరిగిన చర్చ. కోవిడ్ నియంత్రణకు లాక్ డౌన్ విధించామనీ, సకాలంలో కేంద్రం స్పందించినందునే దేశంలో కోవిడ్ మరణాల సంఖ్యను తగ్గించగలిగామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. అదే సమయంలో వ్యూహాలు, ప్రణాళికలూ లేకుండా కేంద్రం కోవిడ్ పై పోరు ప్రారంభించిందనీ, అందుకే దేశంలో మహమ్మారి  అదుపులేకుండా వ్యాపిస్తున్నదని విపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నది.

ప్రపంచ మహమ్మారి కరోనాను కట్టడి చేయాలంటే, వ్యాప్తి తీవ్రతను తగ్గించాలంటే...లాక్ డౌన్ ఒక్కటే మార్గమనడంలో సందేహం లేదు. మోడీ సర్కార్  మహమ్మారి వ్యాప్తి కట్టడి కోసం మార్చి 3వ వారంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ విధించడాన్ని ఎవరూ తప్పుపట్టజాలరు. అప్పట్లో పార్టీలకు అతీతంగా  అందరూ లాక్ డౌన్ ను స్వాగతించారు కూడా. అయితే లాక్ డౌన్ కొనసాగింపు, దశల వారీ అన్ లాక్ ప్రక్రియ విషయంలో కేంద్ర సర్కార్ ప్రణాళికా రహితంగా వ్యవహరించింది.

నిపుణులు, ఆఖరికి  ప్రపంచ ఆరోగ్య సంస్థా చెబుతున్నది  కూడా ఇదే. అధిక జనాభాకు  ఆరోగ్య రక్షణ వ్యవస్థ అంతంత మాత్రంగా  భారత్ లో  కోవిడ్ సామాజిక వ్యాప్తికి అవకాశాలు ఎక్కువ అన్నది అందరికీ తెలిసిందే. ఆ విషయంలో ప్రజలలో చైతన్యం కలిగించే విధంగా కార్యక్రమాలను రూపొందించిన కేంద్ర సర్కార్...స్వయంగా కట్టడి చర్యలను గాలికి వదిలేసి ప్రజారోగ్యాన్ని గాలిలో దీపంగా మార్చేసింది.

వలస కార్మికుల సంఖ్య విషయోంలో స్పష్టత లేకపోవడం, ఉపాధి కరవై వారు స్వస్థలాలకు వెల్లడానికే మొగ్గు చూపుతారన్న అంచనా లేకపోవడం లాక్ డౌన్ సమయంలో కేంద్రం చేసిన తప్పిదాలుగా నిపుణులు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ విమర్శిస్తున్నట్లుగా గత మార్చిలో కేంద్రం లాక్ డౌన్ విధించడమే వ్యూహాత్మక తప్పిదనం అని చెప్పజాలం. ఎందుకంటే లాక్ డౌన్ విధించకుండా ఉన్నట్లైతే....ఈ పాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య అమెరికాను దాటేసి ఉండేది.

లాక్ డౌన్ విధింపుపై కాంగ్రెస్ విమర్శలు పూర్తిగా రాజకీయపరమైనవేననడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. అదే సమయంలో కరోనా కట్టడి విషయంలో కేంద్రం వైఫల్యాలను ప్రశ్నించడాన్ని కూడా కేంద్రం సహించలేకపోవడం విపక్ష సూచనలు ఖాతరు చేయకపోవడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. మొత్తంగా కోవిడ్..కట్టడి చర్యలు, వ్యాప్తి విజృంభణపై నిన్న పార్లమెంటు వేదికగా అధికార విపక్షాల మధ్య జరిగినది చర్చ అని భావించలేం. అది రచ్చ మాత్రమే.

అధికార, విపక్షాలు రెండూ తమ ఆధిపత్యం చూపడానికీ, రాజకీయంగా ప్రయోజనం పొందడానికే కోవిడ్ పై చర్చను రచ్చగా మార్చేశాయి. ఇప్పటికైనా కోవిడ్ నియంత్రణ, కట్టడి విషయంలో సమష్టిగా ముందుకు కదలాల్సిన పని ఉంది. రికవరీ రేటు, మరణాల సంఖ్యపై భుజాలు చరుచుకుంటూ అధికార పక్షం, కేసుల సంఖ్యను భూతద్దంలో చూపుతూ విపక్షం పరస్పర ఆరోపణలతో కాలం గడపడం వల్ల ఉపయోగం ఉండదు. 

 

parliament, political, stunt, covid


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle