లాక్ డౌన్ అమలుపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
15-04-202015-04-2020 12:40:18 IST
Updated On 15-04-2020 12:58:04 ISTUpdated On 15-04-20202020-04-15T07:10:18.087Z15-04-2020 2020-04-15T07:10:02.831Z - 2020-04-15T07:28:04.510Z - 15-04-2020

కరోనా లాక్ డౌన్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ, వాటికి మినహాయింపులు ఇచ్చింది. దేశం లో కరోనా వైరస్‌ని పూర్తిగా కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఏప్రిల్ 20 తర్వాత మాత్రం కొన్నింటికి మినహాయింపు ఇచ్చింది. వ్యవసాయం, కొన్ని పరిశ్రమలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ యూనిట్ల పరిశ్రమలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అలాగే గ్రామాల్లో భవన, ఇళ్ల నిర్మాణ రంగ కార్యకాలపాలు నిర్వహించుకోవచ్చు. అలాగే. మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో కార్మికులు. నిర్మాణ భవనం దగ్గరే ఉండేటట్లైతే. అక్కడ నిర్మాణాలు జరుపు కోవచ్చు. నిత్యావసర వస్తువులు అంటే మందులు, ఫార్మా ఉత్పత్తులు చేపట్టవచ్చు. గ్రామ ప్రాంతాల్లో అన్ని పరిశ్రమలనూ తెరచుకోవచ్చు. సినిమా హాళ్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు, జిమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు, మాత్రం.. మే 3 వరకూ తెరవకూడదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాల మధ్య, అలాగే జిల్లాల మధ్య ప్రజల ప్రయాణాలు, రాకపోక లపై కేంద్రం మే 3 వరకూ నిషేధం విధించింది. అలాగే.. మెట్రో రైళ్లు, బస్సు సర్వీసులు కూడా మే 3 వరకూ లాక్ డౌన్ లోనే ఉంటాయి. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పుడు దేశ వ్యాప్తంగా ప్రజలు ముఖానికి మాస్క్ ధరించడాన్ని కేంద్రం తప్పని సరి చేసింది. బయటకు వచ్చినప్పుడు, పని ప్రదేశాల్లో ఉన్నప్పుడు తప్పని సరిగా మాస్క్ ధరించాలి. అలాగే ఆరు బయట ఉమ్మి వేయడం ఇకపై చట్ట ప్రకారం నేరం. దానికి జరిమానా విధిస్తారు. సామాజిక, రాజకీయ, క్రీడా, మత పరమైన కార్యక్రమాలు, వేడుకలు, ఫంక్షన్లు నిర్వహించ కూడదు. అన్ని ప్రార్థనా స్థలాలూ మే 3 వరకూ క్లోజ్ చేసి ఉంటాయి. విద్యా సంస్థలు, ట్రైనింగ్, కోచింగ్ కేంద్రాలు మే 3 వరకూ తెరవ కూడదు. అంత్యక్రియల కార్యక్రమాల్లో 20 మందికి మించి పాల్గొన కూడదు.అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలూ లాక్ డౌన్ నిబంధనల్ని కఠినంగా అమలు చెయ్యాలని కేంద్రం ఆదేశించింది. అవసరమైతే రాష్ట్రాలు స్థానికంగా అవసరాన్ని బట్టీ ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలన్నా తీసుకోవచ్చని తెలిపింది. ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, టెలి మెడిసిన్ సర్వీసులు రోజూ పని చేస్తాయి. అలాగే డిస్పెన్సరీస్, కెమిస్ట్స్, ఫార్మసీస్, అన్ని రకాల మందుల షాపులు, జన ఔషధి కేంద్రాలు తెరిచే ఉంటాయి. మెడికల్ ల్యాబ్స్, వైద్య ఉత్పత్తుల కలెక్షన్ కేంద్రాలు తెరిచే ఉంచ వచ్చని కేంద్రం తన మార్గ దర్శకాల్లో తెలిపింది. మినహాయింపులు ఇచ్చిన వాటిని ఏప్రిల్ 20 తర్వాత నుంచి కొనసాగించు కోవచ్చు. మినహాయింపులు లేని వాటిని మాత్రం.. మే 3 వరకూ కొన సాగించేందుకు అవకాశం లేదు. మే 3 తర్వాత ఏం చెయ్యాలన్నది అప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంతో చెప్పనున్నారు.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
10 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
14 hours ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
11 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
15 hours ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
13 hours ago

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత
18 hours ago

లక్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడినట్లే- రఘురామ
17 hours ago

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
20 hours ago

షర్మిల పక్కనే విజయమ్మ.. లాభమా నష్టమా
16 hours ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
21 hours ago
ఇంకా