newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లాక్ డౌన్‌పై మండిపడ్డ బాంద్రా వలస కార్మికులు.. కేంద్రం నిర్ణయంపై తిరుగుబాటే

15-04-202015-04-2020 08:34:36 IST
Updated On 15-04-2020 09:18:48 ISTUpdated On 15-04-20202020-04-15T03:04:36.392Z15-04-2020 2020-04-15T03:04:34.553Z - 2020-04-15T03:48:48.779Z - 15-04-2020

లాక్ డౌన్‌పై మండిపడ్డ బాంద్రా వలస కార్మికులు.. కేంద్రం నిర్ణయంపై తిరుగుబాటే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మంగళవారం మహానగరం ముంబై అట్టుడికిపోయింది. వారాలతరబడి పనిపాటలు కల్పించకుండా, త్యాగాలు చేయాలంటూ పిలుపులిస్తూ రెండో సారి లాక్ డౌన్‌ కూడా తప్పదని ప్రకటించిన కేంద్రప్రభుత్వం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్లో వేలాది మంది ఆంక్షలను సైతం ధిక్కరించి ఆందోళనకు దిగారు. లాక్‌డౌన్‌ నిబంధనలు సామాజిక దూరం సూచనల్ని పక్కనబెట్టి మంగళవారం మధ్యాహ్నం గుంపులుగా రోడ్లపైకొచ్చారు. 

అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని, అక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. వారి మాటల్ని నిరసనకారులు లెక్కచేయకపోడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీంతో ఎక్కడివారక్కడ పరుగులు పెట్టారు. ఈ వీడియో సంచలనమైంది.

ఒకరకంగా తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా సమస్యను నానబెడుతున్న ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై సామాన్యుల తిరుగుబాటుగానే ఈ ఘటనను చెప్పాల్సి ఉంటుంది.

లాక్‌డౌన్‌ కారణంగా పనుల్లేక, చేతిలో చిల్లిగవ్వ లేని వలసకూలీలు బాంద్రా ప్రాంతంలో ఆంక్షలను ధిక్కరించి ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు పంపించాలంటూ ముంబైలోని  బాంద్రా రైల్వే స్టేషన్ పరిధిలో వందలాదిగా కూలీలు రోడ్డెక్కారు. పోలీసులు లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.  పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు వేల సంఖ్యలో పటేల్‌ నగరీ ప్రాంత మురికివాడల్లోని అద్దె ఇళ్లలో ఉంటున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని వారంతా లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి పనులు కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు వారికి ఆహారం, నిత్యావసరాలను అందజేశాయి. 

కేంద్రం లాక్‌డౌన్‌ ఎత్తివేస్తుందని భావించిన వారంతా గుంపులుగుంపులుగా మంగళవారం ఉదయం నుంచి బాంద్రా రైల్వేస్టేషన్‌కు చేరుకోవడం ప్రారంభించారు. ఇంతలోనే లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించగానే అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సుమారు వెయ్యి మంది వలస కూలీలు రైల్వే స్టేషన్‌ వద్ద నిరసనకు దిగారు. స్వగ్రామాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అందజేసే ఆహారం, నిత్యావసరాలు తమకు అక్కర్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసదుల్లా షేక్‌ మాట్లాడుతూ.. సంపాదన లేకపోవడంతో ఇప్పటికే తమ వద్ద ఉన్న డబ్బంతా అయిపోయిందనీ, దయచేసి స్వగ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని వేడుకున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. దాదాపు రెండు గంటల అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

ఈ పరిణామంపై మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తుందని వలసకూలీలు భావించారనీ, ప్రధాని ప్రకటనతో వారంతా అసంతృప్తికి గురయ్యారని అన్నారు. వలసకూలీలను స్వస్థలాలకు పంపబోమని, రాష్ట్రాల సరిహద్దులు మూసివేసి ఉంటాయని అనిల్‌ స్పష్టంచేశారు. వారి బాగోగులను ప్రభుత్వం చూసుకుంటుందని, ఈ మేరకు హామీ ఇవ్వడంతో వారంతా శాంతించారని వెల్లడించారు.  

ముంబై లాక్‌డౌన్‌ పొడిగింపును నిరసిస్తూ ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో వేలాది వలస కార్మికులు భారీ ప్రదర్శనకు యత్నించారు. 

కాగా, దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ఒక్కటే సరైన నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా కేసులు లేని ప్రాంతాల్లో ఏప్రిల్‌ 20 నుంచి లాక్‌డౌన్‌ అమల్లో కొన్ని సడలింపులు ఉంటాయని తెలిపారు. 

అయితే, రోజూ కూలీ చేసుకుని బతికే తాము తిండిలేక చస్తున్నామని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్‌ చేశారు.

సీఎంకు అమిత్‌ షా ఫోన్‌

ముంబైలో పరిణామాలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో ఫోన్‌లో మాట్లాడారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉండగానే వందలాదిగా జనం గుమికూడటంపై ఆందోళన వ్యక్తం చేశారు.  ఇందుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వానికి అన్నివిధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు.  

కాగా బాంద్రాలో ఉద్రిక్త పరిస్థితులకు కేంద్రమే కారణమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే కేంద్రంపై మండిపడ్డారు. 

కాగా వలస కార్మికుల ఇళ్లవద్దకే తాము ఆహారాన్ని తీసుకెళ్లి అందిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ ప్రకటించడం తప్ప వలస కార్మికుల్లో ఎలాంటి ఆత్మవిశ్వాసం కలిగించలేకపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషాన్ సిద్ధీకి ఆరోపించారు. అన్ని రాష్ట్రాలూ సరిహద్దులను మూసివేసినందన వలసకార్మికులు ఎక్కడికీ వెళ్లవద్దని వారి క్షేమం మా బాధ్యత అని సిద్ధీకి హామీ ఇచ్చారు.

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle