newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లాక్‌డౌన్ వ్యూహం విఫలమైన ఏకైక దేశం భారత్.. కేంద్రంపై చిదంబరం ధ్వజం

06-09-202006-09-2020 07:35:46 IST
2020-09-06T02:05:46.469Z06-09-2020 2020-09-06T02:05:43.042Z - - 10-04-2021

లాక్‌డౌన్ వ్యూహం విఫలమైన ఏకైక దేశం భారత్.. కేంద్రంపై చిదంబరం ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్‌డౌన్ వ్యూహం నుంచి  ప్రయోజనాన్ని పొందలేని ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశమేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు. దేశంలో కరోనావైరస్ కేసుల ఉధృతిపై కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.  లాక్‌డౌన్ ద్వారా అన్ని దేశాలు కరోనా మహమ్మారిని అదుపు చేస్తే భారత్‌లో మాత్రం కరోనా విజృంభిస్తోందన్నారు. 

ఈమేరకు శనివారం ఆయన వరుస ట్వీట్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై దాడి చేశారు. ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య 40 లక్షలకు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించిన నేపథ్యంలో చిదంబరం తాజా వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 30 నాటికి మొత్తం సంఖ్య 55 లక్షలకు చేరుకుంటుందని మొదట ఊహించాను... కానీ ఈ విషయంలో తనది  తప్పు అంచనా  అని పేర్కొన్నారు, సెప్టెంబర్ 20 నాటికి భారతదేశం ఆ సంఖ్యకు(55 లక్షలు) చేరుకోనుందని వ్యాఖ్యానించారు.  అంతేకాదు సెప్టెంబర్ చివరి నాటికి కేసులసంఖ్య 65 లక్షలకు చేరవచ‍్చని  అంచనావేశారు.  

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 21 రోజుల్లో కరోనా వైరస్‌ను అంత చేస్తామంటూ మొదట్లో హామీలు గుప్పించారని, కానీ ఐదు నెలలు గడిచినా కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోయారో ప్రధాని వివరణ ఇవ్వాలని  ఆయన డిమాండ్ చేశారు. ఇతర దేశాలు విజయవంతం అయినప్పుడు భారతదేశం ఎందుకు విఫలమైందో వివరించాలన్నారు.  వి షేప్‌ రికవరీ అంటూ ప్రజలను తప్పు దారి పట్టిస్తోందని మండిపడ్డారు  అలాగే  2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆర్థికమందగమనం, ప్రతికూల వృద్ధిపై ఆర్థికమంత్రిత్వ శాఖ వద్ద సమాధానం లేదని మరో ట్వీట్‌లో మాజీ ఆర్థిక మంత్రి  చిదంబరం  ఆరోపించారు.

కాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40,23,179కి చేరింది. అందులో 8,46,395 యాక్టివ్ కేసులు ఉండగా, 31,07,223 మంది ఇప్పటికే వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.  మరణాలు 69,561గా ఉ న్నాయి.

ప్రపంచంలో ఇండియా మాత్రమే లాక్‌డౌన్ వ్యూహం ప్రయోజనాలు పొందని దేశంగా కనిపిస్తోందని అన్నారు. 'కరనా వైరస్‌ను 21 రోజుల్లో ఓడిస్తామంటూ వాగ్దానం చేసిన ప్రధాని (మోదీ) ఇతర దేశాలు విజయవంతమై ఇండియా ఎందుకు విఫలమైందో చెప్పాలి' అని చిదంబరం ఒక ట్వీట్‌లో నిలదీశారు. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   3 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle