newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లాక్‌డౌన్ విధింపుపై రాష్ట్రాల కొత్త వ్యూహాలు... ఇంటింటి సర్వే తప్పదు

30-06-202030-06-2020 15:54:14 IST
Updated On 30-06-2020 17:18:44 ISTUpdated On 30-06-20202020-06-30T10:24:14.608Z30-06-2020 2020-06-30T10:24:12.202Z - 2020-06-30T11:48:44.228Z - 30-06-2020

లాక్‌డౌన్ విధింపుపై రాష్ట్రాల కొత్త వ్యూహాలు... ఇంటింటి సర్వే తప్పదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వరుసగా ఆరురోజులుగా దేశవ్యాప్తంగా రోజుకు 20 వేలలోపు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో కరోనా వ్యాప్తి విస్తృతమవుతున్న రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్ర చర్యల దిశగా ముందుకెళుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో  అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న రీత్యా ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు నుంచి నాలుగువారాలపాటు లాక్ డౌన్ విధింపుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో వైద్య అధికారులు మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ విధించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచించిన సంగతి తెలిసిందే. దీనిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడనుంది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం పలు రాష్ట్రాలు నూతన విధానాలను అమలు చేయనున్నాయి. 

ఇంటింటి సర్వే.. లాక్‌డౌన్‌

ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 5,28,859గా ఉండగా.. లక్షమందికి పైగా కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 58.56 శాతం ఉన్నట్లు ప్రకటన విడుదల చేసింది. జూన్‌ 1 నుంచి అన్‌లాక్‌.1 అమల్లోకి రావడం.. ఆంక్షలు సడలించడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్‌లాక్‌ కాలంలోనే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని.. కరోనా నియమాలు పాటించడంలో అలసత్వం పనికిరాదని ప్రజలను హెచ్చరించారు. మాస్క్‌ ధరించడం.. రెండు మీటర్ల దూరంతో పాటు ఇతర నిబంధనలను పాటించకపోతే.. మిమ్మల్ని, మీతో పాటు ఇతరులు.. ముఖ్యంగా మీ కుంటుంబంలోని వృద్ధులు, పిల్లలను ప్రమాదంలో పడేసిన వారు అవుతారు’ అని హెచ్చరించారు. కరోనా విషయంలో అజాగ్రత్తగా ఉంటే మనతో పాటు ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలో పడేసినవాళ్లం అవుతామన్నారు.

కాగా, కరోనా కట్టడి కోసం మధ్యప్రదేశ్‌, యూపీ రాష్ట్రాల్లో ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయించగా.. గోవా, ఢిల్లీ, ఒడిశా వంటి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ విధించాలని భావిస్తున్నాయి. అస్సాం గువాహటిలో ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 

అన్‌లాక్‌ దిశగా మహారాష్ట్ర..

అత్యధిక కరోనా కేసులు ఉన్న మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 5,493 నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని రోగుల సంఖ్య 1,64,626 కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఆర్థిక రాజధాని ముంబైలో ఆఫీసులకు, అత్యవసర వైద్య సేవలకు హాజరు కావడం తప్ప నగరవాసులు తమ ఇళ్ల నుంచి రెండు కిలోమీటర్లు దాటి వెళ్లవద్దని పోలీసులు కోరారు. రాష్ట్రంలో కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షల సడలింపుతో పాటు సెలూన్లు తెరవడానికి ప్రభుత్వం ఆదివారం అనుమతిచ్చింది. అయితే తగినంత మంది వర్కర్లు లేకపోవడంతో చాలా సెలూన్లు తెరవలేదు. 

ఢిల్లీలో కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్య పెంపు

దేశ రాజధాని ఢిల్లీలో కేసులు భారీగా పెరగటంతో అధికారులు కొత్త వ్యూహాన్ని అమలు చేయనున్నారు. కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్యను  218 నుంచి 417 కి పెంచారు. కరోనా వ్యాప్తిని గుర్తించడం కోసం ఇంటింటి సర్వేలో భాగంగా కేవలం ఒక నెల రోజుల్లోనే సుమారు 2.45 లక్షల మంది ప్రజలను పరీక్షించారు. కరోనా కట్టడి కోసం ఇంటింటి సర్వే జూలై 6 వరకు పూర్తి కావాల్సి ఉండగా.. ఇప్పటికే 2 లక్షల మందిని పరీక్షించామని అధికారులు తెలిపారు. అలాగే కంటైన్మెంట్ జోన్లలో 45,000 మందిని పరీక్షించామన్నారు. ఢిల్లీలో నిన్న ఒక్క రోజే 2,889 కొత్త కేసులు నమోదయ్యి మొత్తం కేసుల సంఖ్య 83,000 మార్కును దాటింది. కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,623 కు పెరిగింది.

యూపీ, మధ్యప్రదేశ్‌లో ఇంటింటి సర్వే

ఉత్తరప్రదేశ్ అదనపు ప్రధాన కార్యదర్శి (వైద్య, ఆరోగ్య) అమిత్ మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ జూలైలో మీరట్ డివిజన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా వ్యాప్తి నివారణ ప్రచారం ప్రారంభిస్తామని తెలిపారు. పల్స్ పోలియో మాదిరిగానే ఇంటింటి సర్వే చేపట్టనున్నట్లు చెప్పారు. కంటైన్మెంట్‌, నాన్‌ కంటైన్మెంట్‌ జోన్లలో కూడా సర్వే నిర్వహిస్తామన్నారు. 13,186 కేసులు నమోదైన మధ్యప్రదేశ్‌లో కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి జూలై 1 నుంచి 'కిల్ కరోనా' ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనిలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించబడుతుందని..ఇతర వ్యాధులపై కూడా పౌరులకు పరీక్షలు జరుపుతామని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 15 రోజుల ఈ కార్యక్రమంలో 2.5 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తామని.. ప్రతిరోజూ 15 నుంచి 20 వేల మంది నమూనాలను సేకరిస్తామని చౌహాన్ తెలిపారు. 

భారతదేశంలో కరోనా పరీక్షల కోసం ప్రస్తుతం 1,036 డయాగ్నొస్టిక్ ల్యాబ్‌లు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ రంగంలో 749, ప్రైవేటులో 287 ల్యాబ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం రోజు 2,00,000 కంటే ఎక్కువ నమూనాలను పరీక్షిస్తున్నారు. గత 24 గంటల్లో 2,31,095 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 82,27,802 అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. జూన్ 28 నాటికి దేశవ్యాప్తంగా 1,055 కరోనా ఆస్పత్రుల్లో 1,77,529 ఐసోలేషన్ పడకలు, 23,168 ఐసీయూ పడకలు, 78,060 ఆక్సిజన్ సపోర్ట్ బెడ్స్‌ ఉన్నాయని అధికారులు తెలిపారు

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle