newssting
BITING NEWS :
*అవినీతి నిర్మూలనకు ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం *నా వల్ల.. వంశీ వల్ల జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారంటూ టీడీపీ అడ్డగోలు కామెంట్లు - మంత్రి కొడాలి నాని *సీఎం జగన్ను డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబుకు ఎక్కడిది..?-మంత్రి నాని *ఆర్టీసీ, రవాణాశాఖాదికారులతో సీఎం కేసీఆర్ భేటీ*శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ప్రమాదం లేదంటున్న డ్యామ్ సేఫ్టీ అధికారులు *తూ.గో: ముమ్మడివరం మండలం కొమనాపల్లిలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్*విజయవాడ: స్టెల్లా కాలేజీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత*2021 అసెంబ్లీ ఎన్నికలు అద్భుతాలు ఖాయం-రజనీకాంత్

లఢక్‌లో కమలం వికసిస్తుందా?

06-05-201906-05-2019 14:29:59 IST
Updated On 01-07-2019 15:11:48 ISTUpdated On 01-07-20192019-05-06T08:59:59.687Z06-05-2019 2019-05-06T08:59:53.867Z - 2019-07-01T09:41:48.487Z - 01-07-2019

లఢక్‌లో కమలం వికసిస్తుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ ఎన్నికల్లో ఎలాగైనా జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రంలోని ల‌ఢ‌క్ ఎంపీ సీటు గెల్చుకోవాల‌ని సంఘ్ ప‌రివార్ బీజేపీని ఆదేశించింద‌ట‌. ఈ సీటు గెల‌వ‌డం భౌగోళికంగా, మ‌త‌ప‌రంగా, రాజ‌కీయంగా ఎంతో అవ‌స‌ర‌మ‌ని సంఘ్ పెద్దలు అమిత్ షా, మోడీల‌కు స్ప‌ష్టం చేశార‌ట‌. 2014 ఎన్నిక‌ల్లో ఈ సీటును బీజేపీ గెల్చుకుంది. అప్పట్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన తుప్సాన్ చెవాంగ్ స్వతంత్ర అభ్య‌ర్థి గులాం రాజా మీద కేవ‌లం 36 ఓట్లతో గెలిచారు. అయితే గ‌తేడాది ఆయ‌న బీజేపీకి, ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇక 2018లో జరిగిన ల‌ఢ‌క్, లేహ్ స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెల‌వ‌లేదు. అందుకే ఇప్పుడు బీజేపీకి ల‌ఢక్ సీటు గెల‌వ‌డానికి క‌ష్టప‌డాల్సి వస్తోంది. 

ఈసారి బీజేపీ అభ్యర్థిగా జ‌మింగ్ తెరింగ్ నాంగ్యాల్ పోటీలో ఉన్నారు, ఈయ‌న ప్ర‌స్తుతం ల‌ఢ‌క్ అటాన‌మ‌స్ హిల్ డెవ‌లప్‌మెంట్ చీఫ్ ఎగ్జిక్యుటివ్ కౌన్సిల‌ర్. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా రిగ్జిన్ స్పాల్బర్ బ‌రిలో ఉన్నారు. అయితే నేష‌న‌ల్ కాన్ఫరెన్స్, పీడీపీలు త‌మ అభ్యర్థుల‌ను బ‌రిలో దింప‌లేదు. సాజ‌ద్ కార్గిల్ అనే స్వతంత్ర అభ్యర్థికి మ‌ద్దతు ఇస్తున్నాయి. కార్గిల్ ఇస్లామిక్ స్కూల్ కూడా ఇత‌నికి స‌పోర్ట్ తెలిపింది. 

ఇదంతా రాజ‌కీయం అయితే, ల‌ఢ‌క్ సీటును గెల‌వాల‌ని సంఘ్ ప‌రివార్ ప‌ట్టుప‌ట్టడం వెనుక చాలా కార‌ణాలు ఉన్నాయ‌ట‌. ల‌ఢ‌క్ ప్రాంతంలో లేహ్, కార్గిల్ జిల్లాలు ఉన్నాయి. వీటిలో కార్గిల్ జిల్లాలో ముస్లింలు అధికం, అలాగే లేహ్ జిల్లాలో బౌద్ధులు అధికం. చాలా కాలం నుంచి ల‌ఢ‌క్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించాల‌ని బౌద్ధులు డిమాండ్ చేస్తున్నారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో బౌద్ధుల డిమాండ్ నెర‌వేరుస్తామ‌ని బీజేపీ హామీ ఇచ్చింది. 

అయితే 2018 దాకా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చ‌ర్యలు తీసుకోలేదు. దీంతో ల‌ఢ‌క్ వాసులు ఉద్యమ‌బాట ప‌ట్టారు. ఇదే సమ‌యంలో సిట్టింగ్ ఎంపీ బీజేపీకి రాజీనామా చేయ‌డంతో, కేంద్రం స‌త్వర చ‌ర్యలు చేప‌ట్టింది. ఈ ఏడాది ఫిబ్రవ‌రిలో ల‌ఢ‌క్ ప్రాంతాన్ని ప్రత్యేక డివిజ‌న్ గా గుర్తించిన కేంద్రం, దాని ప్రధాన కార్యాల‌యం లేహ్‌లో ఏర్పాటు చేసింది. కేంద్ర నిర్ణయాన్ని స్వాగ‌తించిన బౌద్ధులు, బీజేపీ వైపు నిలిచారు. 

అయితే ఇప్పుడు కార్గిల్ జిల్లాలోని ముస్లింలు కేంద్ర నిర్ణయం మీద మండిప‌డుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణ‌యంతో ల‌ఢ‌క్ ప్రాంతంలో బౌద్ధుల పెత్తనం ఎక్కువ అవుతుంద‌ని వారు భ‌య‌ప‌డుతున్నారు. 2011 జ‌నాభా లెక్కల ప్రకారం ల‌ఢ‌క్ ప్రాంతంలో ల‌క్ష 26 వేల మంది ముస్లింలు, ల‌క్ష 7 వేల మంది బౌద్ధులు ఉన్నారు. బౌద్ధుల్లో ఎక్కువ మంది ఆర్మీ జ‌వాన్ల కుటుంబాలే ఉన్నాయి. అయితే ల‌వ్ జిహాద్ పేరుతో 2003 నుంచి 2017 దాకా 97 మంది బౌద్ధ యువ‌తులు ఇస్లాంలోకి మారార‌ట‌. 

ఈ ప‌రిస్థితి త‌మ‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంద‌ని ల‌ఢ‌క్ బుద్ధిస్ట్ అసోసియేష‌న్ అధ్యక్షుడు పీటీ. కున్జాంగ్ వాపోతున్నారు. ఇదే కొన‌సాగితే తాము మైనార్టీలుగా మారి పోతామ‌న్న భ‌యాన్ని ఆయ‌న వ్యక్తం చేస్తున్నారు. ఈ మ‌త‌మార్పిడుల వ‌ల్లే సంఘ్ ప‌రివార్ కూడా భ‌య‌ప‌డుతోంది. ఎందుకంటే ఇప్పటికే క‌శ్మీర్ లోయ‌లో హిందువులు లేకుండా పోయారు. ల‌ఢ‌క్ ప్రాంతంలో కూడా ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే, క‌శ్మీర్, ల‌ఢ‌క్ ప్రాంతాల్లో తీవ్రవాదం పెరుగుతుంద‌నీ, హిందువులు, బౌద్ధుల ప్రాణాల‌కు ఇబ్బంది వ‌స్తుంద‌నేది సంఘ్ చెబుతున్న మాట‌. అందుకే ల‌ఢ‌క్ పార్లమెంట్ సీటు ఎట్టి ప‌రిస్థితుల్లో అయినా గెల‌వాల‌ని బీజేపీ అధిష్టానం మీద ఒత్తిడి తెస్తున్నారు సంఘ్ పెద్దలు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle