newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లక్నో సీటు మళ్ళీ వారిదేనా?

06-05-201906-05-2019 07:21:08 IST
2019-05-06T01:51:08.592Z06-05-2019 2019-05-06T01:47:17.598Z - - 12-04-2021

లక్నో సీటు మళ్ళీ వారిదేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నో పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం ఈసారి కూడా బీజేపీదే అంటూ నేష‌న‌ల్ మీడియా క‌థ‌నాలు ప్ర‌చురిస్తోంది. ముఖ్యంగా యూపీ ప‌త్రిక‌లు ఈ వార్త‌ల‌ను హైలెట్ చేస్తున్నాయ‌ట‌. 1991 నుంచి ల‌క్నో ఎంపీ సీటును గెలుచుకుంటూ వ‌స్తున్న బీజేపీ, ఈసారి కూడా గెల‌వ‌డం లాంఛ‌న‌మేన‌నీ, అయితే మెజార్టీ ఎంత అన్న‌దే లెక్క‌పెట్టుకోవాల‌ని హిందీ మీడియా వ్యాఖ్యానిస్తోంది. 

గ‌త ఎన్నిక‌ల్లో ఈ సీటు నుంచి పోటీ చేసిన రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ అభ్య‌ర్థి రీటా బ‌హుగుణ జోషి మీద 2 ల‌క్ష‌ల 72 వేల 749 ఓట్ల‌తో గెలిచారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత అయిన రీటా బ‌హుగుణ‌, ఆ త‌ర్వాత బీజేపీలో చేరి, యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యానికి పాటు ప‌డ్డారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో కూడా ల‌క్నో నుంచి పోటీ చేస్తున్న రాజ్ నాథ్ సింగ్, ప్ర‌చారంలో దూసుకు పోయారు. 

ఈసారి స‌మాజ్ వాదీ పార్టీ నుంచి న‌టుడు శ‌త్రుఘ్న‌సిన్హా స‌తీమ‌ణి పూనం సిన్హా పోటీ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా ప్ర‌మోద్ కిష‌న్ బ‌రిలో దిగారు. ఇప్ప‌టికే ఆల‌యాలు, మ‌సీదులు చుట్టేసి వ‌చ్చిన రాజ్ నాథ్ సింగ్, ల‌క్నో నియోజ‌క‌వ‌ర్గానికి తాను చేసిన సేవ‌లే, త‌న‌ను మ‌రోసారి గెలిపిస్తాయ‌ని చెబుతున్నారు. 

ప్ర‌జ‌ల‌కు తానేంటో తెల్సున‌నీ, త‌న విజ‌యం ఖాయ‌మ‌ని ధీమాగా ఉన్నారు. అటు స‌మాజ్ వాదీ అభ్య‌ర్థి పూనం సిన్హాకు మ‌ద్ద‌తుగా ఆమె భ‌ర్త శత్రుఘ్న‌సిన్హా, కుమార్తె సాక్షి సిన్హా ప్ర‌చారం చేశారు. ఓట‌ర్లను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. 1991 నుంచీ ఈ సీటులో వ‌రుసగా ఐదుసార్లు గెలిచారు మాజీ ప్ర‌ధాని అటల్ బిహారీ వాజ్ పాయ్. ఆ త‌ర్వాత కూడా ల‌క్నో వాసులు బీజేపీని ఆద‌రిస్తూనే ఉన్నారు. ఈసారి ల‌క్నో సీటులో పాగా వేయాల‌ని అటు స‌మాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతున్నాయ‌ట‌.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle