newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లంచ్ పె చర్చ.. హేమాహేమీల మధ్య మాటల యుద్ధం

29-02-202029-02-2020 09:02:20 IST
Updated On 29-02-2020 09:02:05 ISTUpdated On 29-02-20202020-02-29T03:32:20.277Z29-02-2020 2020-02-29T03:27:18.141Z - 2020-02-29T03:32:05.326Z - 29-02-2020

లంచ్ పె చర్చ.. హేమాహేమీల మధ్య మాటల యుద్ధం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మమతాబెనర్జీ, నవీన్ పట్నాయక్,  అమిత్ షా, నితీష్... వీరంతా కలిస్తే ఎలా వుంటుంది. రాజకీయంగా వీరంతా రెండు గ్రూపులుగా వున్నారు. నిత్యం రాజకీయంగా తీవ్రమయిన ఆరోపణలు చేసుకునే ఈ హేమాహేమీలంతా ఒడిశాలో భేటీ అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో శుక్రవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఈస్ట్రన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోం మంత్రి అమిత్ షాతో పాటు పశ్చిమబెంగాల్ సీఎం మమత ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బెంగాల్ సీఎం మమత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ హాజరయ్యారు. అయితే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అనివార్య కారణాల మీటింగ్ కు హాజరుకాలేదు. సమావేశం తర్వాత నేతలందరూ కలిసి ఒడిశా సీఎం నవీన్ ఇంట్లో లంచ్ చేశారు. ఒరియా వంటకాలను తనివి తీరా ఆస్వాదించారు. అమిత్ షా-మమతా బెనర్జీ ఎదురెదురుగా కూర్చుని భోజనం చేస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. జనమంతా ఈ సమావేశం గురించే చర్చించుకున్నారు.అప్పటివరకూ చాలా సరదాగా సాగిపోయిన వాతావరణం భోజనాలు అయిపోయాక మారిపోయింది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కొద్ది నిమాషాల పాటు గొడవల్ని పక్కనపెట్టారు. కలిసి భోజనం చేసి అందరినీ ఆశ్చర్చపర్చారు. తినడం పూర్తయిన గంటలోపే పరస్పర విమర్శలతో మళ్లీ నిప్పులు రాజేయడం రాజకీయాల్లో మామూలేననే భావన కలిగేలా చేసిందన్నారు. నిత్యం ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం సాగుతూనే వుంది. సీఏఏపై ఇద్దరు పరస్పరం విమర్శలు చేసుకుంటూనే వున్నారు. 

ఈజెడ్‌సీ వైస్ చైర్మన్ గా కొనసాగుతోన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తన అదికారిక నివాసం ‘నవీన్ నివాస్' లో నేతలకు లంచ్ ఏర్పాటు చేశారు. మమతా బెనర్జీ, అమిత్ షా, నితీశ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి భోజనం చేస్తున్న ఫొటోను నవీన్ షేర్ చేశారు. వీళ్లందరితో ఇలా గడపడం చాలా సంతోషంగా ఉందని, ఒడిశా ప్రత్యేక రుచులను అతిథులకు వడ్డించామంటూ నవీన్ ట్వీట్ చేశారు. ఈ ఫొటో పోస్టయిన గంట తర్వాత సీన్ మళ్లీ రివర్సయింది.

ఇదేదో కొత్త రాజకీయ సమీకరణ అనుకునేలోపే విమర్శలకు అది కేంద్ర బిందువుగా మారింది. నవీన్ ఇంట్లో లంచ్ అయ్యాక కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా బీజేపీ నిర్వహించిన సభలో పాల్గొనడం అక్కడ విపక్షాలను కడిగి పారేయడం కనిపించింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెల్చుకున్న తర్వాత అమిత్ షా ఒడిశా తొలిసారిగా వచ్చారు.

పనిలో పనిగా సీఏఏకు వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు తీర్మానాలు చేసిన నేపథ్యాన్ని ప్రస్తావించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీలను వదలలేదు అమిత్ షా. దేశంలో ప్రతి పౌరుడి హక్కులను పరిరక్షిస్తానని హామీ ఇచ్చిన అమిత్ షా ప్రతిపక్షాలు కావాలనే దీనిపై రాద్ధాంతం చేస్తున్నాయని విరుచుకుపడ్డారు. ల

సీఏఏ వల్ల దేశంలోని ఏ పౌరుడికి కూడా అన్యాయం జరగదని, దీనిపై కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ, బీజేడీ లాంటి పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా విమర్శించారు. 70 ఏళ్ళలో పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలను మోడీ తన సాహసోపేత నిర్ణయాలతో సులువుగా పరిష్కరించారని అమిత్ షా అన్నారు.  అంతకుముందు చాలా సరదాగా వున్న నేతలు ఒక్కసారిగా మాటల యుద్ధానికి దిగడంతో జనం అవాక్కయ్యారు. 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   4 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   4 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   8 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   9 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   10 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   12 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle