newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ర‌జ‌నీకాంత్ డిసైడ్ అయ్యారా..?

26-09-201926-09-2019 11:38:30 IST
Updated On 26-09-2019 11:49:42 ISTUpdated On 26-09-20192019-09-26T06:08:30.803Z26-09-2019 2019-09-26T06:08:26.764Z - 2019-09-26T06:19:42.071Z - 26-09-2019

ర‌జ‌నీకాంత్ డిసైడ్ అయ్యారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో గ‌త 25 ఏళ్లుగా వినిపిస్తున్న పేరు ర‌జ‌నీకాంత్‌. ఆయ‌న సినీ రంగంలో సూప‌ర్‌స్టార్‌గా ఎదిగిన త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావాల‌ని అభిమానులు ప‌దేప‌దే కోరుతున్నారు. సినీ రంగం నుంచి వ‌చ్చి రాజ‌కీయంగా స‌క్సెస్ అవ్వ‌డం త‌మిళ‌నాడులో ఎప్పుడూ జ‌రిగేదే. ఎంజేఆర్‌, క‌రుణానిధి, జ‌య‌ల‌లిత సినీరంగం నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి స‌క్సెస్ అయ్యారు. త‌మ అభిమాన న‌టుడు కూడా వీరిలానే ముఖ్య‌మంత్రి అవుతార‌ని ఏళ్లుగా ర‌జ‌నీకాంత్ అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.

అయితే, ర‌జ‌నీకాంత్ మాత్రం త‌న రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం గురించి ఎటూ తేల్చ‌కుండా నాన‌బెడుతున్నారు. రాజ‌కీయాల్లోకి రావ‌డం ఖాయ‌మైనా, స‌మ‌యం రావాలి అంటూ దాట‌వేస్తున్నారు. చివ‌ర‌కు జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఏర్ప‌డిన రాజ‌కీయ శూన్య‌త కార‌ణంగానో, అభిమానుల ఒత్తిళ్ల కార‌ణంగానో 2017 డిసెంబ‌ర్‌లో తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నట్లు ర‌జ‌నీ ప్ర‌క‌టించారు. కొత్త పార్టీని స్థాపిస్తాన‌ని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల‌ను ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చారు. రాష్ట్రంలో కోటి మంది స‌భ్య‌త్వంతో పార్టీని స్థాపించాల‌నేది ర‌జ‌నీకాంత్ ఆలోచ‌న‌గా చెబుతున్నారు. అయితే, పార్టీ స్థాపిస్తాన‌ని చెప్పి రెండేళ్లు గ‌డుస్తున్నా ఆ దిశ‌గా ఇంత‌వ‌ర‌కు ఎటువంటి అడుగులు వేయ‌లేదు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి ఆయ‌న పార్టీని స్థాపించి పోటీ చేస్తార‌ని అభిమానులు భావించారు. కానీ, ఆయ‌న ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నారు. సినిమా మీద సినిమా చేసుకుంటూ వెళుతున్నారు.

మ‌రో రెండేళ్ల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి ఆయ‌న పార్టీ ఏర్పాటు దిశ‌గా అడుగులు వేస్తున్నార‌నే ప్ర‌చారం త‌మిళ‌నాడులో ఊపందుకుంది. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌ను ఆయ‌న క‌లిశార‌నే వార్త‌లే ఇందుకు కార‌ణం. భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటుచేసి పార్టీ స్థాపించాల‌ని భావిస్తున్న ర‌జ‌నీకాంత్ ఈ మేర‌కు ప్ర‌శాంత్ కిషోర్‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ర‌జ‌నీ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

అయితే, ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ సంస్థ మ‌రో న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌కు చెందిన మ‌క్క‌ల్ నిధి మ‌య్యూమ్ పార్టీతో ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఒకే రాష్ట్రంలో రెండు పార్టీల‌కు మాత్రం ఆయ‌న ప‌నిచేసే అవ‌కాశం లేదు. దీంతో రజ‌నీకాంత్ వ్యూహం ఏంట‌నేది అంతుచిక్క‌డం లేదు. కానీ, ర‌జ‌నీకాంత్ అతిత్వ‌ర‌లోనే పార్టీని స్థాపించ‌డం మాత్రం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle