newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రైల్వే ఉద్యోగులకు చేదువార్తే.. సికింద్రాబాద్ టు విశాఖ

18-01-202018-01-2020 08:19:04 IST
2020-01-18T02:49:04.602Z18-01-2020 2020-01-18T02:48:58.771Z - - 14-04-2021

రైల్వే ఉద్యోగులకు చేదువార్తే.. సికింద్రాబాద్ టు విశాఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభుత్వ ఉద్యోగాలు బదిలీలతో సాగుతాయి. ఇప్పటివరకూ హాయిగా సాగిపోయిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులు కొందరు తట్టాబుట్టా సర్దేసుకోవాల్సిన సమయం ఆసన్నమయింది. విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చాలనుకుంటున్న సీఎం జగన్ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు సాగిపోతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర రైల్వే శాఖ  తాజాగా ఆదేశాలిచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి వచ్చే రైల్వే కార్యాలయాలన్నీ విశాఖ నుంచే పనిచేయాల్సి వుంటుందని ఆదేశాలు జారీచేసింది. 

దీంతో విశాఖ జోన్ పరిధిలో పనిచేయాల్సిన ఉద్యోగులు వెంటనే విశాఖకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకూ ఇవన్నీ దక్షిణ మధ్య రైల్వే జోన్ కింద సికింద్రాబాద్ నుంచీ పనిచేస్తున్నాయి. ఇటీవల విశాఖపట్నం దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఈ జోన్ కిందకు వచ్చే రైల్వే కార్యాలయాలన్నీ... ఏప్రిల్ నుంచీ ఇదే జోన్ కింద పనిచేస్తాయి. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వేకి ఈ కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం ఉండదంటున్నారు అధికారులు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌ను కేంద్రం రెండుగా విభజించింది. విశాఖపట్నం డివిజన్‌ను దక్షిణ తీర రైల్వే జోన్‌గా మార్చింది. దీంతో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉండబోతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు పనిచేస్తాయి. విశాఖలో ఆఫీసులు, మౌలిక వసతుల కోసం కేంద్రం రూ.120 కోట్లు విడుదల చేసింది. 

సికింద్రాబాద్ లో పనిచేస్తున్న ఉద్యోగులంతా వెంటనే సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాల్సిందే. అక్కడికి వెళ్లడానికి ఇష్టపడని ఉద్యోగులను బలవంతంగా కూడా పంపించేస్తారు. సంక్రాంతి సెలవులు ముగిసిన వెంటనే పిల్లల చదువుల గురించి ఆలోచించకుండానే వెంటనే విశాఖ వెళ్ళి విధుల్లో చేరాల్సిందే.  సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 20 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వాళ్లలో 10 వేల మంది విశాఖకు తరలివెళ్లాలి.

విశాఖలో తాత్కాలిక ఆఫీసుల ఏర్పాటు గురించి రైల్వే అధికారులు అన్వేషణ మొదలుపెట్టారు.  ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. దీంతో నెలాఖరులోపే వైజాగ్ కోసం లగేజీ సర్దుకోవాలి. మార్చిలో ఉద్యోగుల తరలింపు జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. కేంద్ర రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం వైసీపీకి అనుకూలంగా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle