రైల్వేల రూటు ఇక ప్రైవేటు వైపేనా?
06-07-201906-07-2019 11:50:05 IST
Updated On 06-07-2019 11:54:59 ISTUpdated On 06-07-20192019-07-06T06:20:05.886Z06-07-2019 2019-07-06T06:20:03.305Z - 2019-07-06T06:24:59.984Z - 06-07-2019

గతంలో అనేక సార్లు వినిపించినా ఈసారి ఆర్థిక మంత్రి నోట రైల్వే రూట్ల ప్రైవేటీకరణ మాట పార్లమెంటు సాక్షిగా వినిపించింది. కేంద్ర బడ్జెట్ తో పాటు రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థికమంత్రి దేశంలో ప్రైవేటు భాగస్వామ్యంతో రైల్వేలు అభివృద్ధి చెందుతాయని ఆకాంక్షించారు. దేశంలో రైల్వే రవాణా వేగంగా పెంచాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రైవేటు సహకారం అవసరం అంటున్నారు. రైల్వే ప్రాజెక్టుల కోసం ఏటా లక్షల కోట్ల నిధులు అవసరమనీ, ఇందుకోసం ప్రైవేటీకరణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనీ నిర్మలా సీతారామన్ అభిప్రాయపడడం చర్చకు దారితీస్తోంది. రైల్వేల్లో పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) కింద ప్రాజెక్టుల నిర్వహణకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. అలాగే కొత్త మెట్రో ప్రాజెక్టుల కోసం ఇప్పటికే 300 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. బడ్జెట్లో రైల్వేల కోసం రూ.65,837 కోట్లు కేటాయించారు. 2019-20లో మూలధన ఖర్చుల కింద రూ.1.60 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రయాణికుల సదుపాయాల కోసం 200 శాతం అధికంగా ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.. ప్రయాణికుల సౌకర్యాల కోసం ఈసారి బడ్జెట్లో రూ.3,422 కోట్లు కేటాయించగా... గతేడాది అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.1,657 కోట్లు మాత్రమే కేటాయించారు. పీపీపీ విధానం ద్వారా... రైల్వేలు వేగంగా వృద్ధి చెందడమే కాకుండా... రైల్వే ప్రాజెక్టులకు ఫ్రైట్ సర్వీసులు పుంజుకుంటాయన్నారు. స్పెషల్ పర్పస్ వెహికిల్స్ సహకారంతో పీపీపీ విధానంలో చిన్న పట్టణాల్లో కూడా రైల్వేలను విస్తరించాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు. అయితే రైల్వే వ్యవస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదంటున్నారు నిపుణులు, ప్రజాసంఘాలు. దేశ రవాణా రంగానికి జీవనాడి వంటి రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరించే చర్యలు మానుకోవాలని సిపిఎం అధికార పత్రిక పీపుల్స్ డెమొక్రసీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈమేరకు పత్రికా ప్రకటన విడుదల చేయడం సంచలనం కలిగిస్తోంది. కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ప్రతిపాదించిన కార్యాచరణ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే మాత్రం ప్రయాణికులకు చౌక ప్రయాణం కలగానే మిగులుతుంది. బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం 100 రోజుల్లో ప్రైవేటు ప్రయాణికుల రైళ్లు పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. రెండు ప్రయాణికుల రైళ్లను రైల్వేల అనుబంధ సంస్థ అయిన ఐఆర్సిటిసికి అప్పగిస్తారు. ఈ సంస్థ ఈ రైళ్లలో టికెటింగ్, ఆన్బోర్డ్ సేవలను అందిస్తుంది. రైల్వేలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ వంటి రైళ్లను కూడా క్రమంగా ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలుచేపడుతోందని రైల్వే కార్మిక సంఘాలు అంటున్నాయి. మెట్రో పాలిటన్ నగరాలకు, ప్రధాన మార్గాలలో లాభదాయకంగా నడుస్తున్న రైళ్లను కూడా ప్రైవేటు రంగానికి అప్పజెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రైవేటు పరం చేసిన రూట్లలో ప్రభుత్వం వివిధ వర్గాలకు అందించే రాయితీల సంగతి తేల్చలేదు. ప్రైవేటు వ్యక్తులు లాభాల కోసం చూస్తారు కానీ, ప్రయాణికులకు రాయితీల గురించి పట్టించుకోరు. రైల్వేల ప్రైవేటీకరణపై మరింత అధ్యయనం, పరిశీలన జరగాల్సి ఉందంటున్నారు నిపుణులు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
6 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
9 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
12 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
12 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
10 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
12 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
13 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
7 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
16 hours ago
ఇంకా