newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రెండో వారంలోకి ప్రవేశించిన ‘మహా’ రాజకీయం

01-11-201901-11-2019 10:49:56 IST
Updated On 01-11-2019 17:55:17 ISTUpdated On 01-11-20192019-11-01T05:19:56.126Z01-11-2019 2019-11-01T05:19:45.094Z - 2019-11-01T12:25:17.415Z - 01-11-2019

రెండో వారంలోకి ప్రవేశించిన ‘మహా’ రాజకీయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్రలో రాజకీయ డ్రామా రెండో వారంలోకి ప్రవేశించింది. ప్రభుత్వ ఏర్పాటులో ఏర్పడిన ప్రతిష్టంభన ఇంకా తొలగలేదు. బీజేపీ-శివసేనలు పట్టు విడుపు ధోరణితో వ్యవహరిస్తున్నాయా అన్న భావన ఏర్పడేందుకు ఈ రోజు పరిణామాలు దోహదపడినప్పటికీ ఒక స్పష్టత అయితే రాలేదు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు పెట్టుకుని పోటీలోకి దిగిన బీజేపీ, శివసేనలు ఫలితాల తరువాత ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఫలితాలు వెలువడిన వారం రోజుల తరువాత కూడా ప్రభుత్వ ఏర్పాటు విషయం ఒక కొలిక్కి రాకుండా పోయింది. ఇరు పార్టీలూ కూడా సీఎం పోస్టుపై మంకుపట్టు పట్టడంతో సమస్య పీటముడి పడింది. 50-50 ఫార్ములా అంటూ శివసేన భీష్మించుకు కూర్చుంటే...అదేం లేదు...ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కొన్ని మంత్రిపదవులు ఇస్తామంటూ బీజేపీ నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నది.

దీంతో వారం రోజులుగా మహా రాష్ట్రలో రాజకీయ డ్రామా రక్తికడుతోంది. మహారాష్ట్ర మాత్రమే కాకుండా దేశం యావత్తూ ఈ డ్రామాను ఆసక్తిగా తిలకిస్తున్నది. సస్పెన్స్ థ్రిల్లర్ ను మించి మలుపులు తిరుగుతున్న హై డ్రామా ఎప్పటికి ముగింపునకు వస్తుందన్నది ఎవరూ చేప్పలేని పరిస్థితి నెలకొంది. ఇరు పార్టీల నేతలూ వేర్వేరుగా గవర్నర్ ను కలిశారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ ఆహ్వానించాల్సిందిగా ఆయనను కోరలేదు. ఇక శివసేన అయితే ఒక అడుగు ముందుకు వేసి 50-50 ఫార్ములాలో భాగంగా ముందుగా తమకే ముఖ్యమంత్రి పదవి దక్కాలని కండీషన్ పెట్టింది. అందుకు ప్రతిగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వచ్చే ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రినని ప్రకటించేశారు.

దీంతో ఇక ఇరు పార్టీల మధ్యా సయోధ్యకు అవకాశమే లేని పరిస్థితి ఏర్పడిందని అంతా భావించారు. సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్ రంగ ప్రవేశం చేసి చక్రం తిప్పడానికి ప్రయత్నించింది. కోరితే శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామంటూ ముందుకు వచ్చింది. ఇంతలో హఠాత్తుగా బీజేపీ శివసేనతో సమస్య పరిష్కారమైందని ప్రకటించడమే కాకుండా సీఎల్పీ నేతగా ఫడ్నవీస్ ను ఎన్నుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. బీజేపీ ప్రతిపాదనకు శివసేన అంగీకరించిందనే అంతా భావించేలా సీన్ క్రియోట్ చేసింది. వ్యూహాత్మకంగా శివసేనను డిఫెన్స్ లో పడేసే ప్రయత్నం చేసింది.

ఇందులో భాగంగానే ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తరువాత తీరిగ్గా శివసేనను బుజ్జగించవచ్చని భావించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన శివసేన పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఏక్ నాథ్ షిండేను ఎన్నుకుంది. దీంతా అంతా శివసేన మొత్తబడిందని భావించారు. అయితే అనూహ్యంగా ఆ పార్టీ గవర్నర్ అప్పాయింట్ మెంట్ తీసుకుంది. గవర్నర్ తో ఎందుకు అప్పాయింట్ మెంట్ తీసుకుంది? ఏ యే అంశాలు ప్రస్తావిస్తుంది? అన్న సస్పెన్స్ కొద్ది సేపు ఊపేసింది. ఇలా గత రెండు రోజులుగా మహారాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి.

ఇంతకీ శివసేన గవర్నర్ తో భేటీలో ఏం చెప్పిందంటే...ఇటీవలి భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకొనేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన గవర్నర్ తానే స్వయంగా కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. రాజకీయ పరిస్థితులు హీటెక్కి ఉన్న తరుణంలో కూడా శివసేన రైతు సమస్యలపై గవర్నర్ ను కలవడం ఎంతైనా హర్షించదగ్గ విషయమే. అయితే ఇందుకే శివసేన బృందం గవర్నర్ అప్పాయింట్ మెంట్ తీసుకుని, ఆయనను కలవడానికి ముందు అత్యవసరంగా సమావేశం అయ్యిందంటే నమ్మశక్యంగా ఎంతమాత్రం లేదని పరిశీలకులు అంటున్నారు.

గవర్నర్ తో భేటీ తరువాత విలేకరులతో ఆదిత్యథాక్రే మాట్లాడటం...అంతకు ముందు శివసేన లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఏక్ నాథ్ షిండేను పార్టీ ఎన్నుకోవడం వంటి సంఘటనలు శివసేన ఎత్తుగడ ఏమిటన్న దానిపై సస్పెన్స్ పెంచేశాయి. అయితే పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా ఆధిత్య థాక్రే కాకుండా ఏక్ నాథ్ షిండేను శివసేన ఎమ్మెల్యేలు ఎన్నుకోవడంతో సీఎం పదవి విషయంలో శివసేన ఒక మెట్టు దిగిందని భావించవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle