newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రెండోసారి మోడీ ప్రమాణ స్వీకారం.. కొలువుతీరిన టీం

30-05-201930-05-2019 18:29:01 IST
Updated On 30-05-2019 23:13:54 ISTUpdated On 30-05-20192019-05-30T12:59:01.223Z30-05-2019 2019-05-30T12:58:58.048Z - 2019-05-30T17:43:54.919Z - 30-05-2019

రెండోసారి మోడీ ప్రమాణ స్వీకారం.. కొలువుతీరిన టీం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మరోమారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు నరేంద్రమోడీ. మొత్తం 58మందికి అవకాశం దక్కింది. మంత్రివర్గంలో ఇద్దరి శాఖలు మాత్రం మారలేదు. మరోసారి నిర్మలా సీతామన్‌తోపాటు, రాజ్‌నాథ్ సింగ్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇద్దరికి కూడ మోడీ వాళ్లు ఇదివరకు నిర్వహించిన శాఖలనే కేటాయించారు.

ఈ టీమ్‌లో 25 మంది (మోదీతో సహా) కేబినెట్‌, 9 మంది స్వతంత్ర హోదా, 24మంది కేంద్ర సహాయ మంత్రులుగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణం చేయించారు. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు విదేశీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక దిగ్గజ ప్రముఖులు హాజరయ్యారు.

ఈనేపథ్యంలోనే రాజ్‌నాథ్ సింగ్ కు హోంశాఖ కేటాయించగా ,నిర్మల సీతారామన్‌కు సైతం డిఫెన్స్ శాఖను కేటాయించారు. దీంతో వారు తిరిగి గత ప్రభుత్వంలో నిర్వహించిన బాద్యతలనే తిరిగి చేపట్టబోతున్నారు. దాదాపు 62 మందితో భారీస్థాయిలో క్యాబినెట్‌ ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కొత్త మంత్రివర్గంలో అమిత్షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, సుష్మా స్వరాజ్‌ పియూష్ గోయల్,  ప్రకాశ్ జవదేకర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తదితరులు ప్రమాణం చేస్తున్నారు. కాగా ఈ సారి  కొత్తవారికి  స్థానం కల్పించడం విశేషంగా నిలిచింది. 

మోడీ టీంలో మంత్రులు:

1. నరేంద్ర మోదీ (ప్రధానమంత్రి)

2. రాజ్‌నాథ్‌ సింగ్‌

3. అమిత్‌ షా

4. నితిన్‌ గడ్కరీ

5. సదానంద గౌడ

6. నిర్మలా సీతారామన్‌

7. రాంవిలాస్‌ పాశ్వాన్‌

8. నరేంద్ర సింగ్‌ తోమర్‌

9. రవిశంకర్‌ ప్రసాద్‌

10. హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌

11. థావర్‌ చంద్‌ గెహ్లాట్‌

12. సుబ్రహ్మణ్యం జయశంకర్‌

13. రమేశ్‌ పోఖ్రియాల్‌

14. అర్జున్‌ ముండా

15. స్మృతి ఇరానీ

16. డాక్టర్‌ హర్షవర్థన్

17. ప్రకాశ్‌ జవదేకర్‌

18. పీయూష్‌ గోయల్‌

19. ధర్మేంద్ర ప్రధాన్‌

20. ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ

21. ప్రహ్లాద్‌ జోషీ

22. మహేంద్రనాథ్‌ పాండే

23. అరవింద్‌ సావంత్‌

24. గిరిరాజ్‌ సింగ్‌

25. గజేంద్ర సింగ్‌ షెకావత్‌

సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)

1. సంతోష్‌ గాంగ్వర్‌

2. రావ్‌ ఇందర్జీత్‌ సింగ్‌

3. శ్రీపాద యశో నాయక్‌

4. జితేంద్ర సింగ్‌ (సహాయ మంత్రి)

5. కిరణ్‌ రిజిజు  (సహాయ మంత్రి)

6. ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ (సహాయ మంత్రి)

7. రాజ్‌ కుమార్‌ సింగ్‌ (సహాయ మంత్రి)

8. హర్దీప్‌ సింగ్‌ పూరీ (సహాయ మంత్రి)

9. మన్సూఖ్‌ మాండవియా (స్వతంత్ర సహాయ మంత్రి)

సహాయ మంత్రులు

1. ఫగ్గీన్‌ సింగ్‌ కులస్తే

2.. అశ్వినీ చౌబే

3. అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌

4. జనరల్‌ వీకే సింగ్‌

5. కిృషన్‌ పాల్‌ గుజ్జర్‌

6. దాదారావ్‌ పాటిల్‌

7. కిషన్‌ రెడ్డి

8. పురుషోత్తం రూపాలా

9. రాందాస్‌ అథవాలే

10. సాధ్వీ నిరంజన్‌ జ్యోతి

11. బాబుల్‌ సుప్రియో

12. సంజీవ్‌ కుమార్‌ బాల్యాన్‌

13. దోత్రే సంజయ్‌ శ్యారావ్‌

14. అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌

15. సురేష్‌ అంగాడి

16. నిత్యానంద్‌ రాయ్‌

17. రత్తన్‌ లాల్‌ కఠారియా

18. వి.మురళీధరన్‌

19. రేణుకా సింగ్‌ 

20. సోమ్‌ ప్రకాశ్‌

21. రామేశ్వర్‌ తెలి

22. ప్రతాప్‌ చంద్ర సారంగి

23. కైలాస్‌ చౌదరి

24. దేవశ్రీ చౌదురి


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle