newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రూ. 40 వేల కోట్లు కాపాడేందుకే ఫడ్నవీస్‌ను సీఎంని చేశారా?

03-12-201903-12-2019 12:17:28 IST
2019-12-03T06:47:28.967Z03-12-2019 2019-12-03T06:47:23.139Z - - 23-04-2021

రూ. 40 వేల కోట్లు కాపాడేందుకే ఫడ్నవీస్‌ను సీఎంని చేశారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ముచ్చటగా మూడు రోజులు కూడా ముగియక ముందే దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడం అత్యంత నాటకీయంగా పరిణమించడం ఒక ఎత్తైతే. అంత హడావుడిగా అర్ధరాత్రి పావులు కదిపి ప్రపంచం నిద్రపోతున్న వేళ సీఎంగా ఎందుకు తనను నిలిపారు అన్నది ఇన్నాళ్లూ సస్పెన్స్ గానే ఉంది. బీజేపీ శరవేగంగా తీసుకునే నిర్ణయాలే పడ్నవీస్‌ను సీఎం చేశాయన్నది ఇన్నాళ్లుగా తెలిసిన వార్త అయితే తాజాగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి.

40 వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులను ప్రతిపక్ష కూటమి చేతుల్లోకి పోనివ్వరాదనే ఏకైక లక్ష్యంతోటే ఉన్నట్లుండి పడ్నివీస్‌ను సీఎంగా చేయాల్సి వస్తుందని బీజేపీ నేత ప్రకటించడంపై మహారాష్ట్ర అధికార కూటమి మండిపడుతోంది.

మహారాష్ట్రలో సీఎం నియంత్రణలో రూ. 40 వేల కోట్లు ఉన్నాయి. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ నిధులు దుర్వినియోగమవుతాయి. ఆ నిధులను కాపాడటం కోసమే హుటాహుటిన ఫడ్నవీస్‌ను సీఎం చేశాం.. వాటిని అభివృద్ధి పనులకు కేటాయించడం కోసమే ఆ డ్రామా ఆడాం. ఫడ్నవీస్‌ సీఎం అయిన 15 గంటల్లోనే ఆ నిధులను ఎక్కడికి పంపాలో అక్కడికి పంపి, వాటిని కాపాడారు. ఆ నిధులను కేంద్రానికి తిరిగి పంపించనట్లయితే.. అవి శివసేన కూటమి సీఎం చేతిలో పడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు’ అంటూ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ‘రూ. 40 వేల కోట్ల నిధులను కాపాడేందుకే మహారాష్ట్రలో హుటాహుటిన ఫడ్నవీస్‌ను సీఎం చేశాం’ అంటూ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అనంత్‌కుమార్‌ హెగ్డే చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి.  హెగ్డే వ్యాఖ్యల్లో వాస్తవం ఉంటే ప్రధాని నరేంద్రమోదీ తక్షణమే రాజీనామా చేయాలని ఎన్సీపీ, ఇది మహారాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడమేనని శివసేన మండిపడ్డాయి.

కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం అనంత్‌ కుమార్‌ హెగ్డే పై వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీకి మెజారిటీ లేకపోయినా, మహారాష్ట్రలో ఫడ్నవీస్‌ను ఎందుకు సీఎం చేశారన్న ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు. అదంతా ముందుగా అనుకున్న ప్రణాళికే అంటూ హెగ్డే అసలు విషయం చెప్పారు.

హెగ్డే వ్యాఖ్యలను మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ అబద్ధాలంటూ ఖండించారు. తాను సీఎంగా ఉన్న ఆ మూడు రోజుల్లో ఎలాంటి నిధుల గురించి  కేంద్రం అడగలేదని, తాము కూడా కేంద్రానికి నిధులను పంపించలేదని సోమవారం స్పష్టం చేశారు. ‘బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ కంపెనీ చేపట్టింది. వారికి భూ సేకరణ కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. కేంద్రం మమ్మల్ని నిధులు అడగలేదు. మేం పంపించలేదు. ఏ ప్రాజెక్టు నుంచి కూడా మహారాష్ట్రకు చెందిన ఒక్క రూపాయిని కూడా కేంద్రానికి పంపించలేదు’ అని ఫడ్నవీస్‌ వివరణ ఇచ్చారు.

అయితే బీజేపీ సీనియర్ నేత కర్నాటక ఉప ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఏంటి. తను చెప్పిన విషయంలో నిజం లేదా అన్నది స్పష్టం కావడం లేదు.

ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్‌ పవార్‌ మద్దతుతో నవంబర్‌ 23న ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రి కావడం, ఆ తరువాత మెజారిటీ నిరూపించుకోలేని పరిస్థితుల్లో 80 గంటల్లోపే రాజీనామా చేయడం తెలిసిందే.

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   2 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle