రివ్యూ పిటిషన్ల డిస్మిస్.. అయోధ్యపై సుప్రీం కీలక నిర్ణయం
12-12-201912-12-2019 18:32:42 IST
2019-12-12T13:02:42.780Z12-12-2019 2019-12-12T13:02:41.002Z - - 19-04-2021

చారిత్రాత్మకమయిన అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్లు అన్నిటిపై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. అయోధ్య తీర్పుపై దాఖలైన 18 పిటిషన్లను కొట్టివేసింది సుప్రీంకోర్టు. నవంబర్ 9న ఇచ్చిన తీర్పే ఫైనల్ అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ తీర్పు వెల్లడించింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ గత నెలలో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెల్లడించింది. స్థలం రామమందిరానిదేనని, మసీదు నిర్మించుకోవడానికి రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వాలు అయోధ్యలో 5ఎకరాల స్థలం కేటాయించాలని తీర్పు వెల్లడించింది. సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం పర్సనల్ లా బోర్డు, నిర్మోహి అఖారా సైతం రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. తొలుత తాము సుప్రీం తీర్పుపై రివ్యూకి వెళ్లడం లేదన్న ముస్లిం పర్సనల్ లా బోర్డు తర్వాత రివ్యూకే మొగ్గుచూపింది. అయోధ్య తీర్పును సవాల్ చేస్తూ 40 మంది సామాజిక కార్యకర్తలు సైతం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశారు. మరోవైపు అయోధ్యలో ముస్లింలకు మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాలు కేటాయించాలని సుప్రీం కోర్టు దాఖలు చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హిందూ మహాసభ పిటిషన్ దాఖలు చేసింది. అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడం కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
4 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
5 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
an hour ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
8 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
8 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
28 minutes ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
2 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
8 hours ago

ఇక కేటీఆర్ టైం వచ్చినట్లేనా
10 hours ago

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
18-04-2021
ఇంకా