newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు.. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభణ

10-08-202010-08-2020 15:18:57 IST
Updated On 10-08-2020 16:59:24 ISTUpdated On 10-08-20202020-08-10T09:48:57.228Z10-08-2020 2020-08-10T09:48:53.611Z - 2020-08-10T11:29:24.753Z - 10-08-2020

రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు.. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో క‌రోనా రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో కొత్త‌గా 64,399 క‌రోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 21,53,011కు చెరింది. ఇందులో 6,28,747 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌రో 14,80,885 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న ఒక్క‌రోజే కొత్త‌గా 861 మంది మ‌ర‌ణించారు.

దీంతో క‌రోనాతో మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 43,379కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో కోలుకున్న‌వారి సంఖ్య పెరుగుతుండ‌టంతో రిక‌వ‌రీ రేటు 68.3 శాతంగా ఉన్న‌ద‌ని ప్ర‌క‌టించింది. కాగా వ‌రుస‌గా ఎనిమిది రోజుల‌పాటు ప్ర‌తిరోజు 54 వేల చొప్పున కేసులు న‌మోద‌వ్వగా, గ‌త మూడు రోజులుగా 62 వేల‌కు పైగా వ‌స్తున్నాయి. తాజాగా ఆదివారం రికార్డుస్థాయిలో 64 వేల‌కుపైగా మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు.

దేశరాజధానిలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్

దేశ రాజధాని న్యూఢిల్లీలో క‌రోనా వైర‌స్‌ మళ్లీ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా రికవరీ కేసుల్లో త‌గ్గుద‌ల క‌నిపిస్తుండ‌గా, పాజిటివ్ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ఢిల్లీలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య‌ ఆదివారం 1,45,000 దాటింది. 

గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1300 కేసులు వెలుగు చూడ‌గా మొత్తం కేసుల సంఖ్య 1,45,427కు చేరింది. కొత్త‌గా 1225 మంది వైర‌స్‌ను జ‌యించి డిశ్చార్జి అవ‌గా ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 1,30,587కు చేరుకుంది. మొత్తంగా 4,111 మంది మ‌ర‌ణించారు.

10,279 యాక్టివ్ కేసులుండ‌గా, హోం ఐసోలేష‌న్‌లోనే 5,462 కేసులున్నాయి. క‌రోనా ఉధృతి దృష్ట్యా ఢిల్లీలో 472 కంటైన్‌మెంట్ జోన్లున్నాయి. ఇంకా ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో 13,527 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. 

కాగా ఢిల్లీలో నేడు 5,702 ఆర్‌టీపీసీఆర్ టెస్టులు నిర్వ‌హించ‌గా, 18,085 ర్యాపిడ్ ప‌రీక్ష‌లు చేశారు. దీంతో మొత్తం క‌రోనా టెస్టుల సంఖ్య  11,92,082కు చేరుకుంది. ప్రతి పది లక్షల జనాభాకు 62,741 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. 

మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్నాటక, ఆంధ్ర్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదైన తొలి అయిదు రాష్ట్రాలుగా కొనసాగుతున్నాయి.

 

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   3 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   5 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   11 minutes ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   7 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   7 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   9 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

   18-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle