newssting
BITING NEWS :
*అవినీతి నిర్మూలనకు ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం *నా వల్ల.. వంశీ వల్ల జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారంటూ టీడీపీ అడ్డగోలు కామెంట్లు - మంత్రి కొడాలి నాని *సీఎం జగన్ను డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబుకు ఎక్కడిది..?-మంత్రి నాని *ఆర్టీసీ, రవాణాశాఖాదికారులతో సీఎం కేసీఆర్ భేటీ*శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ప్రమాదం లేదంటున్న డ్యామ్ సేఫ్టీ అధికారులు *తూ.గో: ముమ్మడివరం మండలం కొమనాపల్లిలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్*విజయవాడ: స్టెల్లా కాలేజీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత*2021 అసెంబ్లీ ఎన్నికలు అద్భుతాలు ఖాయం-రజనీకాంత్

రాహుల్ వల్ల కానిది ప్రియాంక వల్ల అవుతుందా?

17-06-201917-06-2019 08:48:26 IST
Updated On 21-06-2019 16:23:09 ISTUpdated On 21-06-20192019-06-17T03:18:26.467Z17-06-2019 2019-06-17T03:18:18.074Z - 2019-06-21T10:53:09.184Z - 21-06-2019

 రాహుల్ వల్ల కానిది ప్రియాంక వల్ల అవుతుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ క్షీణించిపోతోంది. ఎప్పుడు ఎవరు పార్టీని వీడతారో అర్థం కావడంలేదు. రాహుల్ గాంధీ అంతగా తన సామర్ధ్యం చూపించడం లేదు. చెల్లెలు ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగినా, ఆమె అంతగా క్రియాశీలకంగా వ్యవహరించడంలేదనే విమర్శలు వచ్చాయి. ఈనేపథ్యంలో రానున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. తాజాగా ఆమె ఎన్నికల్లో ఓటమిపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

Image result for priyanka gandhi and rahul gandhi

కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ ఆ పార్టీకి పూర్వ వైభవం తేవడానికి నడుం బిగించారు. త్వరలో రాబోయే ఉత్తర ప్రదేశ్, పశ్చిమబెంగాల్ శాసన సభ ఎన్నికలపై దృష్టి సారించారు. అక్కడ కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయడానికి ఆమె స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.

వారానికి రెండుసార్లు ఉత్తర ప్రదేశ్‌లో పర్యటిస్తూ, క్షేత్ర స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడాలని ప్రియాంక గాంధీ నిర్ణయించారు. ఎన్నికల నాటికి అక్కడ పార్టీని పటిష్టం చేయనున్నారు. 

లోక్‌సభ ఎన్నికల అనంతరం నిర్వహించిన సమీక్షలో పార్టీ కార్యకర్తలు, నేతల మధ్య సమన్వయం పెరగాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యకర్తలతో నేరుగా మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉంటుందని ఆమె భావిస్తున్నారు.

ప్రియాంక గాంధీ కనీసం వారానికి రెండుసార్లు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని తీర్మానించినట్లు పేర్కొన్నాయి. ఎలాంటి సమస్యలున్నా తనకు విన్నవించాలని ఆమె కోరుతున్నారు. ప్రియాంకా వ్యూహాలతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందేమో చూడాలి.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle