newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రాహుల్ మెడకి చుట్టుకున్న వివాదం

01-05-201901-05-2019 08:56:51 IST
Updated On 02-07-2019 17:38:47 ISTUpdated On 02-07-20192019-05-01T03:26:51.840Z01-05-2019 2019-05-01T03:26:48.066Z - 2019-07-02T12:08:47.574Z - 02-07-2019

రాహుల్ మెడకి చుట్టుకున్న వివాదం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
125 సంవ‌త్స‌రాల చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడికి, తాను ఈ దేశంలోనే పుట్టాన‌ని చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి రావ‌డం చిన్నాచిత‌కా విష‌యం కాదు. ఆయ‌న్ని ప‌ట్టుకుని మీరు భార‌తీయుడేనా, భార‌త పౌర‌స‌త్వం ఒక్క‌టే ఉందా అంటూ కేంద్ర హోం శాఖ రాహుల్ గాంధీని ప్ర‌శ్నించ‌డం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి. 

ఎందుకంటే రాహుల్ గాంధీకి బ్రిట‌న్ పౌర‌స‌త్వం ఉందంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి కేంద్ర హోం శాఖ‌కు ఫిర్యాదు చేశారు. బ్రిట‌న్ లోని ప‌లు కంపెనీల‌కు రాహుల్ గాంధీ డైరెక్ట‌రుగా ఉన్నార‌ని త‌న ఫిర్యాదులో స్వామి పేర్కొన్నారు. అంతేకాదు, రాహుల్ గాంధీకి నాలుగు పాస్ పోర్టులు ఉన్నాయ‌నీ, అందులో ఒక దానిమీద రౌల్ విన్సీ పేరుతో, క్రిస్టియ‌న్ పౌరుడిగా ఉంద‌ని కూడా స్వామి ఆరోపిస్తున్నసంగతి తెలిసిందే.

2003లో బ్రిట‌న్ లోని బ్యాకోప్స్ లిమిటెడ్ పేరుతో 51 సౌత్ గేట్ స్ట్రీట్, వాంచెస్ట‌ర్, హ్యాంప్ షైర్ ఎస్.వో 23, 9ఈహెచ్ అడ్ర‌స్ పేరుతో ఉన్న ఈ కంపెనీకి రాహుల్ గాంధీ డైరెక్ట‌ర్ అండ్ సెక్ర‌ట‌రీగా ఉన్న‌ట్లు కూడా త‌న కంప్ల‌యింటులో సుబ్ర‌హ్మణ్యం స్వామి రాసుకొచ్చారు. ఈ ఫిర్యాదు మీద స్పందించిన కేంద్ర హోం శాఖ 15 రోజుల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాలంటూ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. 

ఓవైపు ఎన్నిక‌ల జ‌రుగుతున్న త‌రుణంలో రాహుల్ గాంధీకి ఈ విధంగా నోటీసులు రావ‌డం, తాను భార‌తీయుడినే  అంటూ రుజువు చేసుకోవాల్సి రావ‌డం ఆయ‌న‌కే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బందికరమే. రాహుల్ గాంధీ మీద ఇలాంటి ఆరోప‌ణ‌లు ఇప్పుడు కాదు గ‌తంలో కూడా వ‌చ్చాయి. ఆయ‌న‌కు ఇటాలియ‌న్ పౌర‌స‌త్వం ఉందంటూ గ‌తంలో స్వామి ఆరోపించారు. 

ఇట‌లీ చ‌ట్టాల ప్ర‌కారం ఆ దేశానికి చెందిన మ‌హిళ‌, ప్ర‌పంచంలోని ఏ దేశ‌స్తుడిని వివాహం చేసుకున్నా, ఆమెకు పుట్టే మ‌గ సంతానానికి ఇటాలియ‌న్ పౌర‌సత్వం స్వ‌త‌హాగా వ‌స్తుందట‌. అయితే ఆ పౌర‌సత్వాన్ని ఉంచుకోవాలో, ర‌ద్దు చేసుకోవాలో నిర్ణ‌యించుకోవాల్సింది మాత్రం స‌ద‌రు వ్య‌క్తి మాత్ర‌మే. దీనిపై కూడా రాహుల్ గాంధీ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. 

మ‌రో విష‌యం ఏంటంటే త‌న సోద‌రుడు భార‌త‌దేశంలోనే పుట్టి పెరిగాడంటూ ప్రియాంక వాద్రా చెప్ప‌డం కూడా చాలా కామెడీగా ఉంది. ఎందుకంటే, రాహుల్ గాంధీ భార‌త‌దేశంలోనే పుట్టారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఈ పౌర‌సత్వాల గొడ‌వే జ‌నానికి అంతు చిక్క‌డం లేదు. దీనిపై ప్రియాంక గాంధీ క్లారిటీ ఇస్తే జ‌నం ఆమెను మెచ్చుకుంటారు. అంతేకానీ, ఏదో మాట్లాడితే కుద‌ర‌దు. 

Image result for deepika and akshay

ఎందుకంటే, దాదాపు 11 మంది  ప్రముఖ బాలీవుడ్ స్టార్ల‌కు భార‌త పౌర‌స‌త్వం లేదు. వారిలో చాలా మంది ఈ దేశంలో పుట్టిన వారే. మ‌రికొందరు భార‌త పౌరుల‌కు పుట్టి విదేశాల్లో పెరిగిన వారే. బాలీవుడ్ ముద్దుగుమ్మ, డైరెక్ట‌ర్ మ‌హేష్ భ‌ట్ కుమార్తె ఆలియాభ‌ట్ బ్రిట‌న్ పౌరురాలు. ఆమెకు భార‌త పౌర‌సత్వం లేదు. ఎందుకంటే ఆమె త‌ల్లి సోని రాజ్దాన్ ఆ దేశానికి చెందిన మ‌హిళ‌. ఇక డైన‌మిక్ హీరో అక్ష‌య్ కుమార్ ప‌రిస్థితి కూడా ఇంతే. 

పంజాబ్‌లోని అమ్రుత్ స‌ర్‌లో పుట్టిన‌ అక్ష‌య్ కుమార్, త‌న భార‌త పౌర‌స‌త్వాన్ని వ‌దులుకుని కెన‌డాలో స్థిర‌ప‌డ్డారు. దీంతో ఆయ‌న‌కు కెన‌డియ‌న్ పౌర‌సత్వం ల‌భించింది. ఇప్పుడు భార‌త పౌర‌సత్వం కోసం మళ్లీ ప్ర‌య‌త్నిస్తున్నారు. అలాగే అందాల భామ క‌త్రీనా కైఫ్‌కి బ్రిట‌న్ పౌర‌సత్వం ఉంది. ఇక ప్ర‌కాష్ ప‌దుకొనె కుమార్తె, దీపికా ప‌దుకొనె కూడా ఇదే కోవ‌లోకి వ‌స్తారు. డెన్మార్క్ దేశంలో పుట్టి, బెంగ‌ళూరులో పెరిగిన దీపికా, అధికారికంగా భార‌తీయురాలు కాదు. ఆమెకు డెన్మార్క్ పౌర‌సత్వం ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం. 

Image result for alia bhatt and katrina kaif

ఇవ‌న్నీ చూస్తే అర్థం అవుతోంది ఒక్క‌టే. ఇక్క‌డ పుట్టామా, పెరిగామా అన్న‌ది పాయింట్ కాదు, ఈ దేశ పౌర‌స‌త్వం ఉందా, లేదా. ఒక‌వేళ ఈ దేశ పౌర‌సత్వంతో పాటు మ‌‌రో దేశంలో కూడా పౌర‌సత్వం ఉందా అన్న‌ది తేలాలి. ఎందుకంటే భార‌త రాజ్యాంగం ప్ర‌కారం ద్వంద్వ పౌర‌సత్వం ఉన్నవారు ఎన్నిక‌ల్లో పోటీకే కాదు, ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు కూడా అన‌ర్హులు. అందుకే త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల మీద త‌ప్పించుకునే ధోర‌ణి ప్ర‌ద‌ర్శించ‌కుండా, అంద‌రికీ అర్థం అయ్యాలా నిజానిజాలు ఏంటో చెప్పాల్సిన అవ‌స‌రం రాహుల్ గాంధీకి ఎంతైనా ఉంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle