newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల విజృంభణ.. 7,80,054 పాజిటివ్ కేసులు... 21, 417 మరణాలు *ఉత్త‌ర‌ప్ర‌దేశ్ గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబే ఎన్‌కౌంట‌ర్... యూపీ పోలీసుల ఎన్‌కౌంట‌ర్‌లో దూబే హ‌తం*గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ నేపథ్యంలో అప్రమ‌త్త‌మైన వ్యాపార వర్గాలు.. వ్యాపార కార్యకలాపాల సమయం కుదింపు*శ్రీకాకుళం: నేటి నుంచి రాజాంలో లాక్ డౌన్.. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు షాపులు తెరిచేందుకు అనుమతి*నేటి నుంచి సికింద్రాబాద్ ఉజ్జ‌యిని అమ్మ‌వారి ద‌ర్శ‌నాలు బంద్‌... సోమ‌వారం వ‌ర‌కు ద‌ర్శ‌నాలు నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న*ఢిల్లీ: వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా ఇవాళ‌ బ్యాంకాక్‌, లండ‌న్, ఉక్రెయిన్, వియ‌త్నాం నుంచి భార‌తీయుల‌ను త‌ర‌లించ‌నున్న ఎయిరిండియా*తెలంగాణాలో గ‌త 24 గంట‌ల్లో 1,410 పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 331 మంది మృతి..హైదరాబాద్ లో 918 కేసులు..యాక్టివ్ కేసులు 12,423, డిశ్చార్జ్ అయిన కేసులు 18,192*రఘురామకృష్ణం రాజు మీద తణుకు ఎమ్మెల్యే ఫిర్యాదు..తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఎంపీ మాట్లాడారని, జంతువులతో పోల్చారని ఫిర్యాదు చేసిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు*మాజీ మంత్రి రామస్వామి మృతి..సంతాపం వ్యక్తం చేసిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ*ఈ నెల 25 లోపు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ పూర్తి చేయాలని డీఈఓ లకు పాఠశాల విద్యాశాఖ ఆదేశం*తెలంగాణా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు*ఏపీలో గడచిన 24 గంటల్లో 16,882 మంది నమూనాలు పరీక్షించగా 1,555 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ

రాహుల్ మీరు భారతీయుడేనా? హోంశాఖ ప్రశ్నల వర్షం

30-04-201930-04-2019 12:46:03 IST
Updated On 30-04-2019 18:09:10 ISTUpdated On 30-04-20192019-04-30T07:16:03.082Z30-04-2019 2019-04-30T07:15:08.938Z - 2019-04-30T12:39:10.188Z - 30-04-2019

రాహుల్ మీరు భారతీయుడేనా? హోంశాఖ ప్రశ్నల వర్షం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల వేళ కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశం అయింది.  రాహుల్‌ పౌరసత్వంపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హోం శాఖ కోరింది. బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాహుల్‌కు నోటీసులు జారీ అయినట్టు తెలుస్తోంది.  రాహుల్‌ గాంధీకి నాలుగు పాస్‌పోర్ట్‌లున్నాయని, ఒకదానిపై ఆయన పేరు రౌల్‌ విన్సీ, క్రిస్టియన్‌గా నమోదైందని సుబ్రహ్మణ్యం స్వామి ఇటీవల ఆరోపించారు.

కాగా రాహుల్‌ పౌరసత్వంపై వివాదం నేపధ్యంలో ఈసీ ఇటీవల రాహుల్‌ నామినేషన్‌ పత్రాలను ఆమోదించడంతో కాంగ్రెస్‌ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. నామినేషన్ పత్రాల పరిశీలన వాయిదా వేసి మరీ వివరణ తీసుకున్నాక రిటర్నింగ్ అధికారులు నామినేషన్‌కు ఓకె చెప్పారు. 

మరోవైపు రాహుల్‌ పౌరసత్వంపై ఆమేధిలో ఆయనపై స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన ధ్రువ్‌లాల్‌ సైతం ఫిర్యాదు చేశారు. బ్రిటన్‌లో ఓ కంపెనీ నమోదు సమయంలో రాహుల్‌ గాంధీ తాను బ్రిటన్‌ పౌరుడినని ప్రకటించుకున్నారని ధ్రువ్‌లాల్‌ న్యాయవాది రవిప్రకాష్‌ అన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భారతీయేతరులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని చెప్పారు.  

గతంలో రాహుల్‌ గాంధీ భారతీయుడు కాదని.. ఆయనకు బ్రిటిష్‌ పౌరసత్వం ఉందని  ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి గత కొంత కాలంగా తీవ్రంగా ఆరోపిస్తున్నారు. తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను 2015లో స్పీకర్‌ సుమిత్రామహాజన్‌కు  ఆయన అందజేశారు. వాటి ఆధారంగా రాహుల్‌ను ఎంపీకి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై అప్పట్లో దుమారం రేగడంతో తాను భారతీయుడినేనని రాహుల్‌ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రాహుల్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. 

No photo description available.

జ‌గ‌న్ కొడుతున్న దెబ్బ‌ల‌కు వైఎస్సార్ మంచి వార‌య్యారా..?

జ‌గ‌న్ కొడుతున్న దెబ్బ‌ల‌కు వైఎస్సార్ మంచి వార‌య్యారా..?

   25 minutes ago


 ‘సోనియా’ సంస్థలపై కేంద్రం విచారణ.. మీ బెదిరింపులు మాదగ్గర కాదన్న రాహుల్‌

‘సోనియా’ సంస్థలపై కేంద్రం విచారణ.. మీ బెదిరింపులు మాదగ్గర కాదన్న రాహుల్‌

   38 minutes ago


బ్రేకింగ్... యూపీలో ఎన్ కౌంటర్.. వికాస్ దూబె హతం

బ్రేకింగ్... యూపీలో ఎన్ కౌంటర్.. వికాస్ దూబె హతం

   an hour ago


అత్యధిక కేసుల జాబితాలో తెలంగాణకు ఆరో స్థానం.. కొత్తగా 1410 కరోనా కేసులు

అత్యధిక కేసుల జాబితాలో తెలంగాణకు ఆరో స్థానం.. కొత్తగా 1410 కరోనా కేసులు

   an hour ago


సీఎం కేసీయార్ తీరుపై గాంధీ ఆస్పత్రి డాక్టర్ కామెంట్స్ వైరల్

సీఎం కేసీయార్ తీరుపై గాంధీ ఆస్పత్రి డాక్టర్ కామెంట్స్ వైరల్

   13 hours ago


మోడీ ప్రాపకం కోసం పాకులాడింది మీరు కాదా?

మోడీ ప్రాపకం కోసం పాకులాడింది మీరు కాదా?

   13 hours ago


కన్నా vs విజయసాయి.. తార స్థాయికి ట్వీట్ వార్

కన్నా vs విజయసాయి.. తార స్థాయికి ట్వీట్ వార్

   14 hours ago


ముదిరి పాకానపడిన నర్సాపురం ఎంపీ వివాదం.. ఎంపీ వర్సెస్ మంత్రి

ముదిరి పాకానపడిన నర్సాపురం ఎంపీ వివాదం.. ఎంపీ వర్సెస్ మంత్రి

   20 hours ago


వికాస్ దూబె ఉజ్జయిని ఆలయంలో ఎలా చిక్కాడంటే?

వికాస్ దూబె ఉజ్జయిని ఆలయంలో ఎలా చిక్కాడంటే?

   21 hours ago


కరోనా వైద్యానికి ఎంత ఫీజు ? ఏపీ కీలక ఆదేశాలు

కరోనా వైద్యానికి ఎంత ఫీజు ? ఏపీ కీలక ఆదేశాలు

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle