newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రాహుల్ గాంధీ మ‌ళ్లీ మిస్సింగ్‌..?

07-01-202007-01-2020 12:53:12 IST
Updated On 07-01-2020 12:56:07 ISTUpdated On 07-01-20202020-01-07T07:23:12.898Z07-01-2020 2020-01-07T07:16:19.314Z - 2020-01-07T07:26:07.887Z - 07-01-2020

రాహుల్ గాంధీ మ‌ళ్లీ మిస్సింగ్‌..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ రాజ‌కీయాలు కాక మీదున్నాయి. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చట్టం, ఎన్ఏఏ, ఎన్‌పీఆర్ మీద దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. విప‌క్ష పార్టీల‌న్నీ కేంద్రం వైఖ‌రికి వ్య‌తిరేకంగా ఆందోళ‌నలు చేస్తున్నాయి. విద్యార్థులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. మ‌రో వైపు జవ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ విద్యార్థుల‌పై దుండ‌గుల భౌతిక‌దాడి దేశ‌మంతా క‌ల‌కలం రేపింది. ఈ స‌మ‌యంలో పార్టీల‌న్నీ దాడికి గురైన విద్యార్థుల ప‌క్షాన నిలుస్తున్నాయి.

దేశంలో ఇంత పెద్ద రాజ‌కీయ ర‌గ‌డ జ‌రుగుతుంటే బీజేపీకి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి అయిన కాంగ్రెస్ యువ నేత, మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మాత్రం క‌నిపించ‌డం లేదు. వారం రోజులుగా ఆయ‌న ఎటువంటి ఆందోళ‌న‌ల్లో పాల్గొన‌డం లేదు.

రాహుల్ గాంధీ దేశంలో లేడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత‌టి కీల‌క‌మైన స‌మ‌యంలో దేశంలో ఉండి కేంద్రానికి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌ను ముందుండి న‌డిపించాల్సిన రాహుల్ గాంధీ ఇలా క‌నిపించ‌కుండా పోవ‌డం కాంగ్రెస్ శ్రేణుల‌కే మింగుడు ప‌డ‌ని వ్య‌వ‌హారంగా త‌యారైంది.

ఒకవైపు రాహుల్ గాంధీ సైలెంట్ అయిపోగా ఆయ‌న సోద‌రి ప్రియాంక గాంధీ మ‌రింత యాక్టీవ్‌గా మారారు. సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల్లో ఆమె ముందుంటున్నారు. ఆందోళ‌న‌ల్లో గాయ‌ప‌డ్డ‌వారిని, మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శిస్తున్నారు. ఈ స‌మ‌యంలో పోలీసుల‌ను ఎదుర్కొని ముందుకువెళుతున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వంపై ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో ప్రియాంక విరుచుకుప‌డుతున్నారు. జేఎన్‌యూలో విద్యార్థులపై దాడి ఘ‌ట‌న తెలియ‌గానే ఆమె విద్యార్థుల‌కు అండ‌గా నిలిచారు. రాహుల్ స్థానంలో ప్రియాంక యాక్టీవ్ కావ‌డంతో ఆమె పార్టీలో మ‌రింత క్రియాశీల‌కం అవుతున్నారా అనే చర్చ జ‌రుగుతోంది.

అయితే, రాహుల్ గాంధీ వ్య‌వ‌హారం మాత్రం కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ల‌కే మింగుడు ప‌డ‌టం లేదు. గ‌తంలోనూ ఆయ‌న ప‌లు కీల‌క సంద‌ర్భాల్లో ఇలానే సైలెంట్ అయిపోయారు. హాలీడే ట్రిప్‌ల‌కు విదేశాల‌కు వెళ్లిన సంద‌ర్భాలూ ఉన్నాయి. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో పార్టీ దారుణ ఓట‌మి త‌ర్వాత పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు ముందుండి న‌డిపించాల్సిన రాహుల్ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను వ‌దులుకొని త‌ప్పించుకున్నారు.

కానీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత లేదా ఈ ఏడాది చివ‌ర్లో మ‌ళ్లీ ఆయ‌నే పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఇటువంటి స‌మ‌యంలో రాహుల్ గాంధీ పార్టీని, రాజ‌కీయాల‌ను ఇంత తేలిగ్గా తీసుకుంటే ఎలా అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇంకో వైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌లు కాంగ్రెస్‌కు కీల‌కంగా మారాయి. ఈ ఎన్నిక‌ల్లో పార్టీకి గౌర‌వ‌ప్ర‌ద‌మైన ఓట్లు, సీట్లు రాక‌పోతే పార్టీ ప్ర‌భ మ‌రింత మ‌స‌క‌బార‌బోతోంది. మరి, ఈ ఎన్నిక‌ల బాధ్య‌త‌లు కూడా ప్రియాంక గాంధీ తీసుకుంటారా అనేది చ‌ర్చ జ‌రుగుతోంది.

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   37 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   15 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   19 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   20 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle