newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

రాహుల్ గాంధీకి ఓటమి భయం పట్టుకుందా?

05-05-201905-05-2019 08:38:07 IST
Updated On 02-07-2019 11:22:43 ISTUpdated On 02-07-20192019-05-05T03:08:07.621Z05-05-2019 2019-05-05T03:08:02.589Z - 2019-07-02T05:52:43.179Z - 02-07-2019

రాహుల్ గాంధీకి ఓటమి భయం పట్టుకుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమేథీలో ఓట‌మి భ‌యంతోనే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ సీటు నుంచి కూడా పోటీ చేస్తున్నారన్న బీజేపీ ప్ర‌చారంపై యూపీలో భిన్న‌స్వ‌రాలు వినిపిస్తున్నాయ‌ట‌. ముఖ్యంగా అమేథీ కాంగ్రెస్ నేత‌లు రాహుల్ నిర్ణ‌యంపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఎందుకంటే ఈ ఎన్నిక‌ల్లో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు రాహుల్ గాంధీ. 

కేర‌ళలోని కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల కోరికతోనే వ‌య‌నాడ్ సీటు నుంచి రాహుల్ పోటీ చేస్తున్నార‌ని ప్రియాంక వాద్రా చెబుతున్నా, అటు అమేథీ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, ఇటు సాధార‌ణ ఓటర్లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది. అంతేకాదు, ప్ర‌తి స‌భ‌లో రాహుల్ గాంధీ గెలిచి తీరుతారంటూ ప్రియాంక వాద్రా ప‌దేప‌దే చెప్ప‌డం కూడా బీజేపీకి అస్త్రంగా మారింద‌ట‌. 

2009 ఎన్నిక‌ల్లో అమేథీ నుంచి మూడు ల‌క్ష‌ల పైచిలుకు ఓట్ల‌తో గెలిచిన రాహుల్ గాంధీ, 2014 ఎన్నిక‌ల్లో ల‌క్ష పైచిలుకు ఓట్ల‌తోనే గెలిచారు. అంటే, ఇరానీ అప్పుడే గ‌ట్టి పోటీ ఇచ్చారు. అంటే ఈ ఎన్నిక‌ల్లో రాహుల్, ఇరానీ మ‌ధ్య ఓట్ల వ్య‌త్యాసం చాలా త‌క్కువగా ఉంటుంద‌నీ, మార్జిన్ ఓట్ల‌తో అయినా రాహుల్ గాంధీ గెలుస్తార‌నీ కాంగ్రెస్ నేత‌లు, సానుభూతి ప‌రులు చెబుతున్నారు. 

ఎందుకంటే మోడీ మీద కొన్న వ‌ర్గాల ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉన్నా, 2014 నుంచీ అమేథీ నియోజ‌క‌వ‌ర్గంలో స్మృతీ ఇరానీ ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేప‌ట్టార‌నీ, నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని గ్రామాల ప్ర‌జ‌ల‌తో స‌న్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నార‌ని చెబుతున్నారు. అందుకే అమేథీ సీటు గాంధీ కుటుంబానికి చెందిందే అయినా, ఈ ఎన్నిక‌ల్లో స్మృతీ ఇరానీ మీద గెల‌వ‌డం రాహుల్ గాంధీకి క‌ష్ట‌మ‌ని అంటున్నారు. 

ఇక స్థానిక స‌మ‌స్య‌ల మీద కూడా జ‌నం అక్క‌సు వెళ్ల‌క‌క్కుతున్నారు. ప‌దేళ్లుగా అమేథీలో ట్రాఫిక్ స‌మ‌స్య, డ్రైనేజ్ సిస్టం ఏమాత్రం మెరుగు ప‌డ‌లేద‌నీ, ఉన్న‌త విద్య‌, మెరుగైన వైద్యం కోసం పొరుగు ప్రాంతాల‌కు వెళ్లాల్సి వ‌స్తోంద‌ని ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ యూపీఏ పాల‌న‌లో ఇవ‌న్నీ చేస్తే బాగుండేద‌నీ, మోడీ హ‌యాంలో అమేథీ ప‌రిస్థితులు కొంచెం మెరుగు అయ్యాయ‌నీ అంటున్నారు. 

ఇక కొత్త‌గా ఓటు హ‌క్కు పొందిన యువ ఓట‌ర్లు మోడీ వైపే మొగ్గు చూపుతున్నార‌ట‌. రైతులు కూడా స్మృతీ ఇరానీ వైపే ఉన్నారట. అంతేకాదు, తాము అధికారంలోకి వ‌స్తే పేద‌ల‌కు ఏటా 72వేల రూపాయ‌లు ఇస్తామ‌న్న రాహుల్ గాంధీ హామీని చాలా మంది కొట్టిపారేస్తున్న‌రట‌. ఎందుకంటే ప‌దేళ్ల యూపీఏ ప్ర‌భుత్వం హ‌యాంలో రాహుల్ గాంధీ ఎందుకు ఈ ప‌ని చేయ‌లేద‌ని చాలా మంది ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నిక‌ల్లో అమేథీ పార్ల‌మెంట్ సీటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle