newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

రాహుల్ ఎత్తుగడలకు దీదీ చెక్

13-05-201913-05-2019 07:45:42 IST
Updated On 28-06-2019 13:15:52 ISTUpdated On 28-06-20192019-05-13T02:15:42.323Z13-05-2019 2019-05-13T02:15:13.873Z - 2019-06-28T07:45:52.324Z - 28-06-2019

రాహుల్ ఎత్తుగడలకు దీదీ చెక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌త బెన‌ర్జీ అదును చూసి మ‌రోసారి రాజ‌కీయ ఎత్తుగ‌డ వేశార‌ట‌. బీజేపీయేత‌ర కూట‌మిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్ష‌ుడు రాహుల్ గాంధీ ప్రాధాన్య‌త త‌గ్గించే య‌త్నంలో ఓ ర‌కంగా ఆమె విజ‌యం సాధించారట‌. ఎందుకంటే ఈ నెల 21వ తేదీన విప‌క్షాల‌తో ఓ భారీ స‌మావేశం ఏర్పాటు చేయాల‌న్న రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్ర‌బాబు పిలుపునకు ఆమె నో చెప్పేశారు. 

త‌న‌కు తాను ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించుకున్న మ‌మ‌త‌, వేరే వాళ్ల‌కి ప్ర‌ధాని ప‌ద‌విపై ఆలోచ‌న కూడా రాకుండా చూడాల‌న్న‌దే ఆమె ఎత్తుగ‌డ‌గా తెలుస్తోంది. ప‌శ్చిమ బెంగాల్ వెళ్లి మ‌రీ ఈ భేటీ విష‌యాన్ని చెప్పిన చంద్ర‌బాబుకు, ఆమె త‌న నిర్ణ‌యంతో షాక్ ఇచ్చార‌ట‌. ఫ‌లితాల త‌ర్వాతే ఏదైనా అంటూ ఆమె తెగేసి చెప్ప‌డంతో ఏమీ అన‌లేని ప‌రిస్థితిలో చంద్ర‌బాబు ఉన్న‌ట్లు స‌మాచారం. కేవ‌లం మోడీని ప్ర‌ధాని కాకుండా చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తాన‌నీ, అందుకోసం అడ్డ‌గోలుగా ముందుకు వెళ్ల‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని మ‌మ‌త బెన‌ర్జీ చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 

చంద్ర‌బాబు ద్వారా ఈ వ‌ర్త‌మానం పంపిన రాహుల్ గాంధీ కూడా మ‌మ‌త నిర్ణ‌యం మీద నోరు మెద‌ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ట‌. మ‌రీ తెగేసి చెబితే వ్యూహం బెడిసి కొడుతుంద‌న్న ఆలోచ‌న‌తో ఆమె చాలా తెలివిగా త‌న నిర్ణ‌యం చెప్పార‌ట‌. ఈవీఎంల మీద త‌న‌కు కూడా అనుమానాలు ఉన్నాయ‌నీ, వాటి భ‌ద్ర‌త మీదే కౌంటింగ్ రోజు దాకా ఎక్కువ శ్ర‌ద్ధ పెడ‌దామని మ‌మ‌త బెన‌ర్జీ చంద్ర‌బాబుతో అన్నార‌ట‌. దీంతో గ‌తంలో తాను చేసిన ఆరోప‌ణే, ఇప్పుడు త‌న‌కు అడ్డంకిగా మారింద‌న్న అస‌హ‌నం చంద్ర‌బాబులో క‌నిపించిన‌ట్లు ఓ జాతీయ మీడియా అంచ‌నా వేసింది. 

ఈవీఎంల పేరుతో మ‌మ‌త బెనర్జీ తెలివిగా 21వ తేదీ స‌మావేశాన్ని జ‌ర‌గ‌కుండా దాటేశార‌ని చంద్ర‌బాబుతో పాటు రాహుల్ గాంధీకి అర్థమైంద‌ట‌. మ‌మ‌త ఈ నిర్ణ‌యం వెనుక మ‌రో కార‌ణం కూడా ఉంద‌ట‌. ఏపీలో చంద్ర‌బాబుకు ఎన్ని సీట్లు వ‌స్తాయో తెలియ‌కుండా, ఆయ‌న రాయ‌బారాల‌ను ఎలా న‌మ్ముతామంటూ సొంత పార్టీ నేత‌ల ద‌గ్గ‌ర ఆమె వ్యాఖ్యానించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇదే స‌మయంలో తాను కాంగ్రెస్ పార్టీని మోసే కంటే, ఆ పార్టీనే త‌న వెనుక రావాల‌న్న‌ది మ‌మ‌త బెన‌ర్జీ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. 

ఓవైపు శ‌ర‌ద్ ప‌వార్ కూడా రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంపై క్లారిటీ ఇవ్వ‌లేదు. అలాంట‌ప్పుడు ఫ‌లితాలు తెలియ‌కుండా తొంద‌ర‌ప‌డి స‌మావేశానికి వళ్తే, రాహుల్ నాయ‌క‌త్వాన్ని తాము స‌మ‌ర్థించిన‌ట్లుగా ఇత‌ర పార్టీల‌కు అర్థం అవుతుంద‌నీ, అది త‌న‌కు ఇబ్బందిగా మార‌డం ఖాయ‌మ‌న్న‌దే మ‌మ‌త బెన‌ర్జీ భ‌యం. అందుకే చంద్ర‌బాబు రాయ‌బార్ని ఆమె సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్లు అర్థం అవుతోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle