newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రాహుల్ ఆ భేటీకి ఎందుకు రాలేదు?

14-09-201914-09-2019 10:58:36 IST
2019-09-14T05:28:36.878Z14-09-2019 2019-09-14T05:22:15.973Z - - 23-04-2021

రాహుల్ ఆ భేటీకి ఎందుకు రాలేదు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2019 సార్వత్రిక ఎన్నికలలో పరాజయం తరువాత నుంచీ కాంగ్రెస్ మాజీ అధినేత రాహుల్ గాంధీ రాజకీయాల పట్ల, ముఖ్యంగా కాంగ్రెస్ వ్యవహారాల పట్ల అంత ఆసక్తి చూపడం లేదనిపిస్తున్నది. ఎన్నికలలో పరాజయం తరువాత ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఎవరెంత ఒత్తిడి తీసుకువచ్చినా, ఆఖరికి తల్లీ, సోదరీ కోరినా కూడా ససేమిరా అన్నారు..ఆయన కోసం ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులు కూడా రాజీనామాలకు సిద్ధపడ్డారు. 

పార్టీని గాడిలో పెట్టాలంటే ముందుగా పార్టీలో పాతుకుపోయిన సీనియర్ల హవాను తగ్గించాలని రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో చెబుతూ వచ్చారు. ఆ విషయంలో తన తల్లి కఠినంగా వ్యవహరించలేదన్న అసంతృప్తినీ కొన్ని సందర్భాలలో వ్యక్తం చేశారు. ఇదంతా ఆయన పార్టీ పగ్గాలు చేపట్టడానికి ముందు సంగతి. పార్టీ పగ్గాలు చేపట్టిన తరవాత ఆయన వరుసగా ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడంతోనే సరిపోయింది. ముందు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ విజయాలనే సాధించిందని చెప్పుకోవచ్చు. 

కీలకమైన హిందీ బెల్ట్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పాగా వేసింది. అయితే సంపూర్ణ మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోవడంతో...సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించి యంగ్ బ్రిగేడ్ గా పేరొందిన యువ నేతలకు పాలనా పగ్గాలను అప్పగించాలన్న ఆయన వ్యూహానికి గండిపడింది. మధ్య ప్రదేశ్ లోనూ, రాజస్థాన్ లోనూ కూడా అయిష్టంగానైనా వరుసగా కమల్ నాథ్,  అశోక్ గెహ్లాట్ లకు ఆయా రాష్ట్రాలలో అధికార పగ్గాలను అప్పగించాల్సి వచ్చింది.

సమర్ధత, ప్రజలలో ఆదరణ, గుర్తింపు ఉన్న యువనేతలు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్లు ఈ పరిణామంతో సహజంగానే అసంతృప్తికి గురయ్యారు. వాస్తవానికి అందరి కంటే ఎక్కువ అసంతృప్తి చెందినది రాహుల్ గాంధీయే అని చెప్పాలి. ఎందుకంటే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాత వచ్చిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. అందుకు ఆ రాష్ట్రంలో ప్రభుత్వ పని తీరే అని చెప్పక తప్పదు. 

నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, వాటిని అమలు చేయడంలో కానీ మధ్య ప్రదేశ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా మన్నన పొందడంలో విఫలమయ్యాయి. పార్టీ అధ్యక్షుడిగా తాను అనుకున్న రీతిలో పార్టీని ప్రక్షాళన చేయడంలో విఫలమయ్యానన్న భావనే రాహుల్ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగాలన్న నిర్ణయానికి కారణం. తాను అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగడమే కాకుండా, తన తల్లీ, సొదరి అధ్యక్ష పగ్గాలు చేపట్టడం ఇష్టం లేదనీ, తమ కుటుంబం నుంచి కాకుండా ఎన్నిక ద్వారా అధ్యక్షడిని ఎన్నుకోవాలనీ సూచించారు. 

అయితే కాంగ్రెస్ లో నెహ్రూ కుటుంబం నుంచి కాకుండా మరో అధ్యక్షుడిని ఎన్నుకోవడం అన్నది ఊహకు అందని విషయమే. అందుకే అనివార్యంగా సోనియా గాంధీయే తాత్కాలిక అధ్యక్షురాలిగా పార్టీ పగ్గాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ పరిణామాల పట్ల అసంతృప్తితోనే ఆయన కాంగ్రెస్ వ్యవహారాల పట్ల అంటీముట్టనట్టు ఉంటున్నారని భావించాల్సి ఉంటుంది. త్వరలో కీలకమైన మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో జరిగిన కీలక భేటీకి రాహుల్ అందుకే హాజరు కాలేదని అంటున్నారు. 

సోనియా తిరిగి అధ్యక్ష పగ్గాలు అందుకున్న తరువాత జరిగిన తొలి భేటీ కావడం, అదీ మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల కార్యక్రమాలను ఖరారు చేయడమే కాకుండా, మహా ఎన్నికల వ్యూహం ఖరారు చేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశం అత్యంత కీలకంగా పార్టీ అధిష్టానం భావించింది. అంతటి కీలక సమావేశానికి రాహుల్ గాంధీ డుమ్మా కొట్టడం పట్ల పరిశీలకులు పలు కోణాల్లో విశ్లేషిస్తున్నారు. 

సమీప భవిష్యత్ లో ఆయన రాజకీయాలలో చురుకుగా పాల్గొనే అవకాశాలు అంతంత మాత్రమే అంటున్నారు. అంతే కాకుండా తన నియోజకవర్గమైన వాయనాడ్ సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధికే ప్రస్తుతానికి రాహుల్ పరిమితమౌతారని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ లో పరిణామాల పట్ల రాహుల్ సంతృప్తిగా లేరనడానికి ఈ సమావేశానికి ఆయన గైర్హాజర్ అవ్వడం సంకేతంగా భావించాల్సి ఉంటుంది.

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   an hour ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   2 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   4 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   21 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle