newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రాష్ట్రాల సీఎంలతో నేడు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

11-05-202011-05-2020 08:02:57 IST
Updated On 11-05-2020 09:02:38 ISTUpdated On 11-05-20202020-05-11T02:32:57.212Z11-05-2020 2020-05-11T02:32:46.105Z - 2020-05-11T03:32:38.743Z - 11-05-2020

రాష్ట్రాల సీఎంలతో నేడు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ మూడవదశ ముగింపునకు చేరుకుంది. ఇప్పటికే కొన్ని సడలింపులు కొనసాగుతున్నాయి.  ఈనేపథ్యంలో భవిష్యత్తు వ్యూహం గురించి చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పీఎం నరేంద్రమోదీ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకున్నాక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో కేంద్రం వెల్లడించనుంది. ఇప్పటికే అనేక వెసులుబాటులు కల్పించిన కేంద్రం లాక్ డౌన్ ఎత్తివేసే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజలు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. 

కరోనా కట్టడికి కేంద్రం ఇప్పటికే మూడు సార్లు లాక్ డౌన్ పొడిగించింది. గతంలో 4 సార్లు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోడీ ఈ సారి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నాలుగవ దశ లాక్ డౌన్ కు సంబంధించిన వివరాలను ప్రకటిస్తారు. కేంద్రం ఇప్పటికే లాక్ డౌన్ ని ఈ నెల 17 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.  అయితే చాలా రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయం ప్రకారం ముందుకు వెళ్లాలని భావిస్తుంది. అయితే లాక్ డౌన్ ని జూన్ మొదటి వారం వరకు పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

ఒకపక్క రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటూ ఇంకో పక్క కేంద్రం అన్ని రాష్ట్రాలలో పలు సడలింపులు ఇచ్చింది. ఆ సడలింపులను ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు. అయితే కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడం ద్వారానే కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయన్నా అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఈ అభిప్రాయం కూడా కేంద్రం దృష్టికి వెళ్ళింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు,  వైద్య శాఖ మంత్రులు, వైద్య శాఖ కార్యదర్శులు కూడా హాజరు కావాలని కేంద్రం సూచించింది. లాక్ డౌన్ మూడవదశ ముగిశాక  మళ్లీ లాక్ డౌన్ కొనసాగింపు చేయాలా వద్దా? కరోనాలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సవాళ్లు అంశాలపై ఈ వీడియో కాన్ఫిరెన్స్ లో చర్చిస్తారు.

దేశంలోని జిల్లాలను రెడ్ జోన్ లు, ఆరెంజ్ జోన్ లు, గ్రీన్ జోన్ లుగా గుర్తించిన కేంద్రం ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సడలింపులు ఇచ్చాకా రాష్ట్రాలలో చాలా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ విషయాలతో పాటు రాష్ట్రాల ఆదాయ మార్గాలు, ఆర్థిక పరిస్థితి, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్రం  రాష్ట్రాల అభిప్రాయం తీసుకునే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల లో ఉన్న వారిని ఆయా  రాష్ట్రాలకు తీసుకురావడంతో పాటు, రాష్ట్రాలలో ఉన్నా వలస కూలీలను సొంతరాష్ట్రాలకు పంపిస్తున్నారు. దీనివల్ల కొన్ని అనుకోని సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపధ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని రాష్ట్రాల అభిప్రాయాలను కోరే అవకాశం ఉంది.

ఇటీవల తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగిన తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రంగా విమర్శలు చేసారు. గత వీడియో కాన్ఫరెన్స్ లో కేసీఆర్ కు మాట్లాడే అవకాశం కూడా రాలేదు. మరి ఈసారి కేసీఆర్ కు అవకాశం వస్తుందా? వస్తే కేంద్రంపై ప్రెస్ మీట్లో తీవ్రమైన విమర్శలు చేసిన కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ లోనూ అంతే ఘాటుగా విమర్శలు చేస్తారా? లేదా సున్నితంగా సూచనలిస్తారా అనేది చూడాలి. దీంతో ఇవాళ్టి సమావేశం కీలకంగా మారింది.

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   5 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   6 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   6 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   11 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   9 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   12 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   7 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle