newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

21-02-202021-02-2020 10:44:03 IST
2020-02-21T05:14:03.239Z21-02-2020 2020-02-21T05:13:44.751Z - - 27-05-2020

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దశాబ్లాల నాటి రామజన్మభూమి-బాబ్రీమసీదు వివాదానికి గత ఏడాది సుప్రీంకోర్టు తెరదించింది. రామమందిరం నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటుచేయాలని, మసీదుకి  స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ఓ ట్రస్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ ట్రస్ట్‌కు చైర్మన్‌గా ప్రముఖ న్యాయ నిపుణుడు పరాశరన్‌ను నియమించగా, ఇందులో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. ఒక దళితుడు శాశ్వత సభ్యుడిగా కొనసాగుతారు. అంతేకాదు, రామమందిర నిర్మాణ ట్రస్ట్ కోసం ప్రభుత్వం ఒక రూపాయిను విరాళంగా ఇచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కేంద్రం తరఫున హోం శాఖ కార్యదర్శి డి.ముర్ము ఈ రూపాయి విరాళాన్ని ట్రస్ట్‌ సభ్యులకు అందజేశారు.

రామమందిర నిర్మాణం కోసం ఎవరైనా విరాళాలు నగదు, ఆస్తుల రూపంలో అందజేయవచ్చని, వీటిని ఎలాంటి షరతులు విధించకుండా స్వీకరిస్తామని ట్రస్టు తెలిపింది. ప్రస్తుతం ట్రస్ట్ ఛైర్మన్ పరాశరన్‌ ఇంటి నుంచే ట్రస్ట్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఒక కమిటీని నియమించిన కేంద్ర ప్రభుత్వం మసీదు నిర్మాణానికి కమిటీని నియమించకపోవడంపై ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌ తప్పుబట్టారు. రామమందిర నిర్మాణానికి కమిటీని నియమించినట్లే అయోధ్యలో మసీదు నిర్మాణానికి కూడా కమిటీని నియమించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 ”రామమందిరానికి ట్రస్టును ఏర్పాటు చేసిన మీరు మసీదుకు ట్రస్టును ఎందుకు ఏర్పాటు చేయలేదు? దేశం అందరికీ సంబంధించినది” అని ఆయన అన్నారు. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన పవార్ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయిందన్నారు. ఈ కేసులో కోర్టు తీర్పును అందరూ గౌరవించాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీల నేతలు కోర్టు తీర్పును స్వాగతించడాన్ని ఆయన అభినందించిన సంగతి తెలిసిందే.  శరద్ పవార్ తాజా డిమాండ్ పై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle