newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

05-08-202005-08-2020 10:42:52 IST
2020-08-05T05:12:52.104Z05-08-2020 2020-08-05T05:12:39.961Z - - 19-04-2021

రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నో ఏళ్ల నిరీక్షణ. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. సకల గుణాభిరాముడు శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి అంతా రెడీ అయింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఇవాళ మధ్యాహ్నం భూమిపూజ జరుగనుంది. ప్రధాని నరేంద్ర దామోదర్ మోడీ స్వయంగా హాజరై.. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించనున్నారు. ఇప్పటికే ఆయన అయోధ్యకు బయలుదేరారు. 

ఈ శంకుస్థాపన ద్వారా ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 44 నిమిషాల 40 సెకన్లదాకా.. అంటే 32 సెకన్లలోపు ఈ కార్యక్రమం పూర్తవుతుంది. శంకుస్థాపనకు సకలసన్నాహాలు పూర్తయ్యాయి. సోమవారమే మొదలైన పూజలు.. భూమిపూజతో బుధవారం మధ్యాహ్నం పూర్తవుతాయి. శంకుస్థాపనకు ఎలాంటి అవరోధాలు కలగకుండా 12 మంది పురోహితులు విఘ్నేశ్వరుడికి పూజాదికాలు నిర్వహించారు. 

మంగళవారం ఉదయం 9 గంటలకు 21 మంది పురోహితులు వేద పఠనం ఆరంభించారు. రామాచార్య పూజ చేశారు. రుతుపవనాల ప్రభావంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయోధ్య ప్రాంతంలోనూ కురుస్తాయన్న సమాచారంతో రామజన్మభూమి ప్రాంతంలో భారీ రెయిన్‌ ప్రూఫ్‌ టెంట్‌ వేశారు. 

భూమిపూజ జరిగే ప్రధాన స్థలం వెనుక భారీ టీవీ తెరలు ఏర్పాటు చేశారు. ఈ క్రతువునంతా ఈ టీవీల ద్వారా చూడవచ్చు. ప్రధాని మోదీ, ఆర్‌ఎ్‌సఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ పేరు, అనంతరం యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, శ్రీరామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు చైర్మన్‌ మహంత నృత్యగోపాల్‌ దాస్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పేర్లు ప్రదర్శిస్తారు. కరోనా నేపథ్యంలో బీజేపీ వృద్ధ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ అయోధ్యకు రావడం లేదు. 

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారు ఈ కార్యక్రమాన్ని తిలకిస్తారు. కాగా.. రామజన్మభూమి ప్రాంతంలో అతిథుల కోసం భారీ వేదికను నిర్మించారు. వేదికపై పై ఐదుగురే ఆసీనులవుతారు. భౌతిక దూరం పాటిస్తూ 175 మంది ఆహూతులు కూర్చునేలా కుర్చీలు, శంకుస్థాపనను తిలకించేందుకు ఎల్‌సీడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 5 గోపురాలతో, 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మిస్తారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle